Thursday, January 15, 2015

ఉడత1

                     
“ఐ లవ్ యూ....”
“ఎవర్నిరా? “
“నేను పూర్తిగా చెప్ప లేదమ్మా! అటు చూడు”
సీతమ్మ అటు వైపు చూచింది. అక్కడ ఏ అమ్మాయీ కనిపించ లేదు. గోడ మీద ఒక ఉడత మెతుకులు తింటున్నాది.ఒక్కొక్క మెతుకును నాలుగు సార్లుగా నోట్లో వేసుకున్తున్నాది.
“నేను ఇంకా పూర్తీ చేయ లేదు , ఉడతా అని,మధ్యలో నీవు వచ్చావు. చూడు అది ఎంత ముచ్చట గా ఉందో?”
“ఇన్ని రోజులుగా చూస్తూనే ఉన్నావు. అయినా అది తినడము నీకు కొత్తగానే ఉన్నాది. “
“అంతే కాదమ్మా! చిన్నప్పటినుండి తింటున్నాను. అయినా నీవు పెడితే ప్రతి రోజు చాలా రుచి గా ఉంటుంది కాదమ్మా!”
“నిన్ను మాటలలో ఎవరూ ఓడించ లేరు పోరా.”
          ------------------------------------------------------
గోడకు అటు వైపు ఉలిక్కి పడిన వారు మరొకరు ఉన్నారు.
హాయిగా కుర్చీలో కూర్చొని  ఒక పుస్తకము చదువు కుంటున్నాది.తనకు తెలిసిన వాళ్ళింట్లో ఒక చిన్న పిల్లల పుస్తకము ఒకటి దొరికినది. దాని పేరు “ఉడతా ఉడతా హుత్”.ఇది చాలా ఏళ్ల క్రిందట ఆంధ్ర ప్రభ వార పత్రికలో ధారా వాహికగా వచ్చిందట. అదే సమయములో  “ ఐ  లవ్ యూ “ అని వినిపించి ఉలిక్కి పడింది. అది ఎవరో కాదు ప్రక్కింట్లో ఆదిత్య. ఆ తరువాత చెప్పిన ఉడత తనకు వినిపించ లేదు.
అందుకే అతడు తనను గూర్చి అన్నాడేమో అన్న భావన క్షణ కాలము కలిగినది. అయినా అతడిని తను ఎప్పుడూ దగ్గిరగా గమనించ లేదు. ఎదో ఒకటి రెండు సార్లు దూరముగా చూచింది. అప్పుడు తనకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.అయినా తాను ఆ విషయాన్ని పూర్తిగా వదిలి వేసింది. కానీ ఆ మాటలు తనలో కలవరాన్ని రేపినవి. అయినా తననే అన్నాడని నమ్మకమేమిటి? వాళ్ళింట్లో  ఇంకెవరయినా తెలిసిన అమ్మాయి ఉందేమో? తన కలవరానికి ఇంకో కారణముంది. అదేమిటి?
         ------------------------------------------------------------------
ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష.  ఈ రోజుల్లో కొద్ది మందే అటువంటి పేరు పెడతారు. పెట్టినా పూర్తి పేరుతొ పిలిచే వారు చాలా తక్కువ మంది. రమేష్ అని పేరు పెట్టి రమ్మీ అని, లేదా సుమ అని పేరు పెట్టి సుమ్మీ అని పిలిచే ఈ రోజుల్లో ఆకాంక్ష అనే పేరు పెట్టి పూర్తీ పేరుతొ పిలుస్తున్నారంటే వాళ్లకు భాష మీద ఎంత మమకారమో  తెలుసు కోవచ్చును.
అటువంటి సాంప్రదాయ కుటుంబములో పుట్టిన ఆ అమ్మాయిని తన స్నేహితురాండ్రు పేరు కుదించాలని ప్రయత్నించే వాళ్ళేమో కానీ ఇంట్లో వాళ్ళు నోరారా పూర్తీ పేరుతొ పిలిచే వారు. అలా అలవాటు పడిన ఆ అమ్మాయికి మరొక రకముగా ఎవరూ పిలిచినా నచ్చేది కాదు.
చిన్నప్పటినుండి తెలుగు భాష అంటే చాలా మక్కువ ఉండేది. తెలుగులో పంచ కావ్యాలు చాలా శ్రద్ధగా చదివింది. మరి పోతన భాగవతాన్ని అసలు వదిలి పెట్టేది కాదు. గొంతు చాలా శ్రావ్యముగా స్పష్టముగా ఉన్నందు వలన తన నాయనమ్మ ప్రత్యేకముగా ఆకాంక్ష చేత చదివి వినిపించుకొనేది.
అయినా చదువులో చాలా ముందుండేది.తనకు ఇష్టమయిన గణితము, భౌతిక  శాస్త్రము(ఫిజిక్సు) లో డిగ్రీ(పట్టా) తీసుకుంది. ఈ చదువంతా గూడూరు లో జరిగింది.  ఆ సమయములో తను నానమ్మ తాతయ్యల దగ్గిరే ఉండేది.తరువాత ఫిజిక్సు లో పిజి చేయడానికి తను కావలి లో చేరింది.  వాళ్ళ నాన్నగారు కావలి జవహర్ భారతి లో పని చేసే వారు.
తను గూడూరులో యున్నప్పుడు ఎందుకో చదవాలనిపించి శ్రీ నాథుడి శృంగార నైషధము పదే పదే చదివింది.  దీక్షగా ఆపు లేకుండా చదివి నిద్ర పోయే ముందు అనుకున్నది.”దమయంతిని పెళ్లి చేసుకోబోయే నిషధ రాజు నలుడు కలలో కనిపించడము లాంటివి నిజముగా జరుగుతాయా?” అనుకొని అనుకోని అలసటతో నిద్ర పోయింది. ఆ రోజే తనకు రాత్రి ఒక కల వచ్చింది. అందులో ఒక యువకుడు, చాలా అందముగా యున్నాడు. అతడికి తనకు పెళ్లి అని అందరూ అనుకుంటున్నారు.
ఈ విషయము తను ఎవరితో అయినా చెబితే తనకు పెళ్లి పిచ్చి పట్టిందని అనుకుంటారు.  అందుకే ఈ కల గురించి తను ఎవరికీ చెప్పకుండా, నిశ్శబ్దముగా ఉండి పోయింది. ఇది జరిగి రెండేళ్ళు అయింది. తరువాత తను కావలి వచ్చేసింది. నాన్న గారున్న ఇంట్లో పక్క వాటాలోమరొక కుటుంబమున్నది. వెనుక వైపు సందులో కుర్చీలో కూర్చుంటే వాళ్ళు పూర్తిగా కనబడుతారు.
ఆ రోజు పక్క వాళ్ళు తమ ఇంట్లో తాళాలు ఇచ్చి వెళ్ళినారు. సాయంత్రమయేసరికి ఒక యువకుడు  “ఆంటీ! తాళాలిస్తారా?”అంటూ లోపలికి వచ్చినాడు. అమ్మ వెంటనే తాళాలను ఇచ్చింది. ఆ యువకుడి ముఖమును చూడగానే  తనకు ఎదో షాక్  (అఘాతము) తిన్నట్లు అనిపించినది. ఎందుకంటే రెండేళ్ళ క్రిందట తనకు కలలో కనిపించినది అతడే. అమ్మ వచ్చే లోపల , తను “మీరా?”అని అన్నది. వెంటనే తను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చి నాలుక కరుచుకొని వెనుకకు వెళ్లి పోయినది. ఆ యువకుడు కూడా తన మాట విని, తనను వింతగా చూచి వెనక్కు వెళ్లి పోయినాడు. అప్పటినుండి అతడిని బాగా పరీక్షగా చూడాలని అనిపించేది. కాని, తను పెరిగిన వాతావరణము  తనను ముందుకు అడుగు వేయనీయ లేదు.
“అమ్మా! ఆయనెవరే?”,అని అడిగింది.
“ఆయన ఏమిటే?  చిన్న పిల్లాడే. ఇంకా పెళ్లి  కాలేదు. జవహర్ భారతి లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. చాలా తెలివి గల వాడు.”
“మరి ఏ యునివర్సిటీ లోన చేరకుండా ఈ కాలేజి లో ఎందుకు చేరేడు?”
“ఎవరి అవసరాలు వారివి. వాళ్ళ నాన్నకు కొంత అనారోగ్యము. ఇంటి పట్టున యుండి తండ్రిని కూడా చూచుకోవాలని ఇక్కడ చేరేడు. లేక బోతే పెద్ద లేబరేటరీ లో  ఉద్యోగము వచ్చిందిట. ఇంక యూనివర్సిటీ లో  పోస్టులే ఇవ్వటము లేదు.”

ఇప్పుడు తనకు చదువు కంటే ఆ అబ్బాయిని గూర్చి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అలా అని చదువులో అలక్ష్యము చూపించుట లేదు.  ఇంక వీలున్నపు డల్లా పోతన  పద్యాలను చదువుకుంటూ ఉండేది.
















No comments:

Post a Comment