Sunday, April 5, 2015

నిప్పు రవ్వలు



మనటీవి లో పెద్ద అక్షరాలలో ప్రత్యేక ప్రకటన.
ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా మీకు ఉత్సుకత రేపే సీరియల్
నిప్పు రవ్వలు.
అనుక్షణము మిమ్ములను ఉద్వేగములో ముంచెత్తుతుంది. మీరు చాలా కాలమునుండి ఎదురు చూస్తున్న రచయిత నుండి, మీ కోసం, మీ కుటుంబము కోసము, మీ ఆనందము కోసము ........
ఒక రోజు,
హృదయానికి హత్తుకొనే సంభాషణలతో, మీ కోసం, మీ కోసం, మీ ఆనందము కోసం.......
మరో రోజు,
ఒక నిజమయిన హీరో తనకు జరిగిన అన్యాయాన్ని ఎంత నిబ్బరముగా ఎదుర్కొన్నాడో  చూడాలంటే..
ఇలా రోజుకు ఒక ప్రకటన.
ఈ ప్రకటనలను చూచే ప్రేక్షకులకు ముందే పిచ్చి ఎక్కుతున్నాది. నెల రోజుల ప్రకటనల తరువాత సీరియల్ మొదలయింది.
          ఈ సీరియల్ లో అయిదు మంది నాయకులు, రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిదు మంది నాయికలు.
అందులో కథా నాయకుడికి కాస్త ఆవేశము పాలు ఎక్కువ. ఒక ఊత పదము కూడా పెట్టినారు, అతడి మాటలకు. నది రోడ్డు లో అతడిని ఒకరు అవమానిస్తారు. అప్పుడు అతడు మాట్లాడిన ఆవేశ పూరిత డైలాగులను చూచి, అంటే అతడి వాచికమును చూచి ఒకతడు ఆశ్చర్య పోతాడు. తను తీయ బోయే సినీమా లో నాయకుడి పాత్రకు సరిపోతాడని అనిపించి, అక్కడే అతడిని నాయకుడిగా బుక్ చేస్తాడు. ఆ సినీమా సూపర్ హిట్ అవుతుంది. దానితో అతడు తిరుగు లేని నాయకుడు అవుతాడు. అతడి ఊత పదము జనం నోట్లో నాని పోతుంది. ఆడికి అవకాసము ఇచ్చిన దర్శకుడి రేంజ్ కూడా బాగా పెరిగి పోతుంది.
రాజకీయాలలో  ఎదగాలని అనుకున్న ఒక యువకుడు ఈ సినీమా ను చూచి స్ఫూర్తి పొందుతాడు. ఆ కథా నాయకుడితో పరిచయము, స్నేహము, అనుబంధము పెంచుకుంటాడు.
ఈ దర్శకుడు, నాయకుడు, రాజకీయ నాయకుడు, ముగ్గురు కలిసి భారీ పరిశ్రమలతో ఒక ప్రాంతాన్ని అభి వృద్ధి చేయాలని అనుకుంటారు. అంటే కాక ఆ పరిశ్రమల ద్వారా ఏంటో మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటారు. ఆ ప్రాంతములో ఒక యువకుడు వీరి పరిశ్రమల వలన వాళ్ళ పంట పొలాలన్నీ పోతాయని గొడవ చేస్తాడు. అయితే ఏమీ లేని వాళ్లకు అక్కడ వాళ్లకు లభించే కూలీకి అయిదు రెట్లు ఆదాయాన్ని కళ్ళ చూపిస్తామని వీరు హామీ ఇస్తారు. వీరు నిస్వార్తముగా ( ఈ కథలో ) చేయాలనుకున్న సేవను ఎక్కువ మంది నమ్మరు. ఆ నమ్మని వారికి నాయకుడే మన నాల్గవ కథా నాయకుడు. అతడు రైతులకు ఈ ముగ్గురికి వారధి.
ఒక రైతుకు కూతురు పెళ్లి నిర్ణయము అవుతుంది. మరో వారము రోజుల్లో పెళ్లి అనగా అతడి పొలాన్ని వీళ్ళు తీసేసుకుంటారు.  గుండె ఆగి పోయి ఆ రైతు మరణిస్తాడు. ఆ పెళ్లి ఆగి పోతుంది. చివరకు పెళ్లి కూతురు అన్న ఆక్రోశము తో బయటకు వస్తాడు. అతడు అయిదవ కథా నాయకుడు. ఆ పెళ్లి కూతురు ఒకానొక నాయిక అవుతుంది.
వీరు అయిదు మందే మన నిప్పు రవ్వలు.
ఈ సీరియల్ లో డైలాగులు ఎంత తీవ్రముగా ఉంటాయంటే  ప్రతి యొక్కరు నాయకుల వలె కనిపిస్తారు. ఒక్కొక్క సారి వీళ్ళు నాయకులా, ప్రతి నాయకులా అనే  అనుమానము రాక పోదు. అయినా రోజు రోజుకూ చూచే వారి సంఖ్య పెరుగుతున్నది. ఇంకా తమకు వచ్చే అనుమానాలు తీర్చుకోవడానికి నిప్పు రవ్వలు అభిమాన కమిటీలు ఏర్పడినాయి. ఇంకా వాళ్లకు రోజంతా ఇందులోని మలుపుల మీదే చర్చ.
కంప్యూటర్ గేమ్స్  ఆడే వాళ్ళ మత్తు కంటే  ఈ మత్తు మరీ ఎక్కువగా ఉందని  సామాజిక వేత్తలు గమనించి,దీని మీద పితూరీలు(కంప్లైంట్స్ )పెట్టినారు. ఇది అన్యాయమనీ వ్యక్తిగత స్వాతంత్రానికి భంగకరమని మానవ హక్కుల సంఘాలు ఆ పితూరీలను ఎదుర్కొన్నాయి.  ఇంకా ఈ కేసు జరుగుతున్నంత కాలము ఈ సీరియల్ కు ఎలాటి భయము లేదు.
ఇంకా ఈ విషయములో వస్తున్న కంప్లైంట్స్ మీద ప్రభుత్వానికి ఎలా స్పందించాలో తెలియటము లేదు. కుల ద్వేషము పేరు చెప్పి దీనిని ఆపేయాలంటే, ఇందులో కులాంతర వివాహాలున్నాయి. మత ద్వేషము పేరు చెప్పాలంటే  ఇందులో మతాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఏ ఇతర కారణము చూపించినా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘము నుండి నోటీసులు వస్తున్నాయి.
ఈ విధముగా ఈ సీరియల్ కొన్ని సంవత్సరాలు నడిచింది. ప్రతి సంవత్సరానికి ఒకరు విలన్ అవుతాడు. ఆరు నెలలకొకసారి ఒకరు హాస్పిటల్ కు వెళ్లుతారు. ఎప్పుడెప్పుడు కోమాలోకి వెళ్ళాలి అనేది రచయిత నిర్ణయిస్తాడు. అప్పుడప్పుడు జైలుకు కూడా వెళ్ళుతూ ఉంటారు. ఇంకా అనుమానాలు, అవమానాలు, పగలు, ద్వేషాలు ఒక సీరియల్ కు తప్పనిసరే కదా. ఇన్నాళ్ళు గడిచిన తరువాత ఎవరు కథానాయకుడు అనే విషయాన్ని అందరూ మరిచి పోయినారు. ఆ సంభాషణల తీవ్రతలో సీరియల్ నడుస్తున్నంత సేపు ఆ విషయము గుర్తుకు రాదు.
కళ్ళల్లో నీరుబికిస్తూ  హృదయాన్ని తాకుతున్న ఆ సంభాషణల వలన స్త్రీ ప్రేక్షకులు ఆ సీరియల్ ను వదల లేక పోతున్నారు.
అందరూ విలువలను గూర్చి మాట్లాడే వారే కానీ విలువలను ఆచరణలో ఎత్తే వారు కనిపించుట లేదు. ప్రేక్షకులు ఒక విధమయిన  కంఫ్యూజన్  లో ఉన్నారు.
దీనికి ముగింపుగా ఒక కథ చెప్ప వలసి ఉన్నది. ఒక గురువు సత్యాన్నే పలకాలని తన ముగ్గురు శిష్యులకు పాఠము ద్వారా బోధించినాడు. మరు నాడు  ఆ ఆతము గూర్చి అడిగినాడు.
మొదటి శిష్యుడు, “మీరు చెప్పినది మొత్తము వచ్చేసింది” అని మొత్తము ఒప్ప చెప్పినాదుట. (ఆధునిక విద్యార్థి)
రెండవ శిష్యుడు,” దీని అంతరార్థము తెలిసింది.” అని చెప్పినాడుట.( మధ్యే మార్గము)
మూడవ శిష్యుడు,”గురువు గారు!నేను అన్నిటి లోను ఆలస్యమే. అసత్యము చెప్పకుండా బ్రడుకదానికి చాలా సాధన చేస్తున్నాను. అందుకే  నాకు పరిపూర్ణత ఇంకా రాలేదు.” అని, కన్నీలు పెట్టుకున్నాడు.
“ నా పాఠాలను అప్ప చెప్పే వాళ్ళ కంటే  ఆచరించే వాళ్ళే  నాకు సరి అయిన శిష్యులు. నీవే అందుకు తగిన వాడివి.”,అని ముద వాడిని ఆసీర్వదిన్చినాడుట.
గమనించండి ఈ తేడాను.