Friday, February 5, 2016

బహుమతి




తేజ ఇంటికి రాగానే ముందు అమ్మ విరుచుక పడింది.
బాగా ప్రిపేర్ అయినావు కదా. ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్ప లేక పోయినావు. మీ నాన్న వస్తే నన్నే తిదుతాడు.”
తేజ జవాబు ఈయ లేదు.
ఎంత? లక్ష రూపాయల బహుమతి. నీవెప్పుడయినా సంపాదించ గలవా? అంట మొత్తాన్ని.”
తేజ నుండి జవాబు రాలేదు.
ఏమిటి? దేనికీ జవాబు చెప్పవు.”
ముందే చెప్పాను కదమ్మా! గుర్తు రాలేదని.”
నేను నమ్మను.”
మరేమి చేసేది?”
నీవేమో ఇలా చేసేవు. మీ నాన్న నన్నే అడుగుతాడు. నేనేమి జవాబు చెప్పేది? ఇంక నీతో మాట్లాడను.” జయ విసురుగా లోపలికి వెళ్లి పోయింది.
తేజ గది లోకి వెళ్లి పండుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు కారుతుంటే ఎవరికీ కనిపించకుండా పక్కకు తిరిగి పండుకున్నాడు.
జయ కాసేపు కోపముతో ఉడికి పోయింది. తరువాత నెమ్మదిగా చల్ల పడింది.
ఇటీవల ఒక టీవీ చానల్లో మేధావి పేరు తొ ఒక క్విజ్ పోటీలు జరుపుతున్నారు. పది బృందాలుగా చేసి ప్రతి బృందాన్ని విడి విడి గా పరీక్షించి ఒకరిని తీసుకొని తిరిగి ఫైనల్లో ఆ గెలిచిన పది మందికి పోటీ పెడతారు. ప్రశ్న అడిగి నాలుగు జవాబులు ఇస్తారు. అందులో ఏది సరి అయినదో చెప్పాలి. ఇవి కూడా లాటరీ లాగా తయారయిందని విమర్శలు వచ్చేసరికి కొద్దిగా మార్చినారు. సరి అయిన జవాబు చెపితే ఓకే మార్కు, వివరణ ఇస్తే రెండు మార్కులు పెట్టినారు. ఇది కొంత మందికి ఇబ్బంది అనిపించినా లక్ష రూపాయల అంతిమ బహుమతి అనేసరికి చాలా మంది పోటీకి వచ్చినారు. తేజ నాన్న గారి తేజ ఇండస్త్రీస్ కూడా దీన్ని స్పాన్సర్ చేసినారు.
చివర్లో పోటీ రవి మరియు తేజాల మధ్య ఎక్కువగా ఉండినది. చివర్లో ఒక్క ప్రశ్న తేజ చెప్పకుండా రవి చెప్పేసరికి లక్ష రూపాయల బహుమతి రవికి వచ్చింది. తేజ అమ్మ నాన్నలకు ఇదే బాధ కలిగించినది. అందుకే తేజ అమ్మ అంట కోప పడినది.
ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉండే పిల్లాడు అలా పండుకొని ఉండే సరికి జయకు మళ్లీ జాలి వేసింది. తను అనవసరముగా తిట్టే నేమో అనిపించినది. నెమ్మదిగా తేజ దగ్గరి కి వెళ్ళింది. వాడి పక్క మీద కూర్చుంది. వాడి తలను తన వైపు తిప్పుకుంది. వాడి కళ్ళల్లో నీళ్ళు చూచేసరికి దిగులు వేసింది.
ఏం నాన్నా నిజముగా గుర్తుకు రాలేదా?” నెమ్మదిగా అడిగింది.
అమ్మా! నీవు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను.”
చెప్పు నాన్నా!”
నేను కావాలనే జవాబు చెప్ప లేదు.”
జయకు మళ్ళీ కోపము వచ్చింది. అయినా సర్దుకొని “ఏమి నాన్నా!” అని అడిగింది.
నీకు రవి తెలుసు గదమ్మా!”
ఆ మొదటి బహుమతి వచ్చిన వాడే కదా.”
అవునమ్మా! నా పుట్టిన రోజుకు పిలవడానికి వాడింటికి వెళ్లి నానమ్మా! ఇంట్లో అంతా గొడవగా ఉంది. రవికి నాన్న లేడమ్మా! అమ్మే బయట ఎక్కడో పని చేసి గడుపుతున్నాది’ రెండు నెలలుగా అద్దె కట్ట లేదట. ఇల్లు గల ఆయన బెదిరించి వెళ్ళినాడు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు. ఆ సమయములో నేను వెళ్ళడము నాకే సిగ్గు వేసింది. “
అయితే”
రవి చాలా మంచి వాడమ్మా. మేమిద్దరమూ కూర్చుంటే సైన్స్ తప్ప వేరే విషయము మాట్లాడుకోము. ఏ విషయమైనా ఎంత బాగా వివరిస్తాడనుకున్నావు. “ కా సేపు ఆగినాడు.
జయ వాడి వైపే చుస్తున్నాది.
అమ్మా! నా పుట్టిన రోజున నాన్న అంత ఖర్చు పెట్టినాడు కదా. ఒక వేయి రూపాయలు రవి కి సాయము చేస్తే మనకు నష్టము లేదు కదమ్మా.”
నాన్నను అడిగినానమ్మా! రవిని చూస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా! కానీ నాన్న సాయము చేయడానికి ఒప్పుకోలేదమ్మా!”
మళ్ళీ ఆగినాడు.
రవి కి సాయము చేద్దామని ఉంది. కాని ఎలా చేయాలో తెలియ లేదమ్మా!”
ఈ పోటీ లో గెలిస్తే మేము ఇద్దరమే గెలవాలి. కానీ రవి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేదే నన్ను ఎడిపిస్తున్నాది.”
మళ్ళీ ఆగినాడు.
అందుకనే జవాబు గుర్తు రాలేదా?” జయ అడిగింది.
అమ్మా! ఈ బహుమతి రాక పోయినా మనకు ఏ విధముగా నష్టము లేదు. అదే రవికి వస్తే ఇంట్లో ఇబ్బందులు కొంత తీరి రవి ముఖములో సంతోషము కనిపిస్తుంది. అందుకే అమ్మా! ఆఖరులో జవాబు తెలిసి కూడా ఉంది పోయాను.”
అమ్మా! నాకు గుర్తు లేదని అబద్ధము చెప్పాను. క్షమించవా? సారీ అమ్మా!”
నిజం చెప్పు అమ్మా! మనకు ఆ లక్ష రూపాయలు అంట అవసరమని అంటావా?” ఏడుపు ముఖముతో తేజ అడిగే సరికి జయ కు జాలి వేసింది.
నాన్నా! నీవు మంచి పనే చేసినావు. మీ నాన్నకు నేను చెబుతాలే. ముందు వెళ్లి ముఖము కడుక్కో.” జయ నవ్వుతూనే అనేసరికి తేజ హుషారుగా లేచి కుళాయి దగ్గిరకు పరుగెత్తాడు.
**********************************************************************************