Thursday, March 3, 2016

నిజం





మనసు లోని భావనలను మనసు లోనె దాచుకొని
వాటికి వేరే కారణమును రూపొందించుకొని
తను బలహీనుడనని మరి మరి తను తలచుకొని
కలగి పోవుటది వృధా లెమ్ము, లెమ్ము, లేలెమ్ము.

జపములు సాధనములు, ధ్యానములు, మార్గములు,
చేరుటకు తీరమ్మును,చుక్కానిగ దారి చూపు
నా దేశము తక్కువ యని పల్కు వారి నోరు మూసి,
చేర గలము తీరమ్మును, బల హీనత తరిమి వేసి.

కత్తి మొన మీద నడక జీవితమున ఇది నిజం
పూల దారి మన కొఱకు పఱవరు ఎవరు.
మన పూర్వీకులు ఋషులు, మన పురాణ వీరులు
మనకు ఎపుడు ఆదర్శము నడిపింతురు వారు.

నడవాలి నడవాలి, అలసట మనసుకు లేదు.
ఒంటరిగా లేము మనము వెంటనె యున్నారు వారు
ఒంటరి వారము కాము ఇది నిజము నిజమ్ము.

గతమున మనమెవ్వరమో ఏమి పనుల చేసితిమో
ఎఱుక చేసుకొని ఒకపరి పిరికితనము తరిమి వేసి
మాటలోని నీరసమును మూలలకు పంపి వేసి
చేయగలము మనము చూడు నిక్కమ్మిది నా మాట.