Monday, December 19, 2016

నేను దేవుడిని



“ఆత్మలన్నీ ఒక్కటే పరమాత్మకు దరి చేరు.
జీవులన్నీ ఒక్కటే  పరమేస్వరునే చేరు.”
ఎవరో గుడిలో పెద్ద స్వరముతో పాడుచున్నారు. జనమంతా ఆనందముగా వింటున్నారు. అప్పుడప్పుడు అందరూ గొంతు కలుపుతున్నారు.
          కార్యక్రమము అంటా అయింది. గోపయ్యకు కాస్త ఆవేశము ఎక్కువ. బయటికి వచ్చినాడు. బయట గట్టు మీద నారాయణ  కూర్చొని ఉన్నాడు.  గోపయ్యకు నారాయణ దగ్గిర చనువు ఎక్కువే.
          “సామే! అందరూ ఒకటే కదా! మీఋ అయినా నేను అయినా అందరమూ ఒక్కటే కదా!”
          “ఏం గోపయ్యా! ఏమంత హుషారు గా ఉన్నావు?  ఏమయిందేమిటి?” నారాయణ ఏమీ తెలియనట్లే అడిగినాడు.
          “ఏమీ లేదు సామే! మనమంటే ఎవరు? మన ఆత్మలు అంటే ఏంటి? ఆటమలన్నే ఒకటే అయితే మనమంతా ఒకటే కదా?”
          “అంటే  మీ వాళ్ళు  కిట్టయ్య, చెంచయ్య, రాముడు అందరూ ఒకటే అంటున్నావు. అంతేనా?”
          “అంటే కదా సామీ!”
          ?మరి నీ పెళ్ళాము రత్తాలు?”
          “అంతే సామీ!”
          “అయితే  రాత్తాలును, మాటి  మాటికీ  తిడుతూ, కొడుతూ ఉంటావు ఎందుకు? అలా దేవుడు చేస్తాడా?”
          “నిజమే సామీ! మరి రత్తాలు నన్ను ఎదో ఒకటి అని కోపము తెప్పిస్తుంది  ఆ....” ముఖము మాడ్చుకున్నాడు.
          “మరి దేవుడికి కోపముంటున్డా?”
          “అయితే కిట్టయ్యకు కోపము వచ్చి ఎంత మందిని చంప లేదు? రామయ్యకు కోపము వచ్చి ఎంత మందిని చంప లేదు?”
                “నీ మాట బాగానే ఉంది. కృష్ణుడు ఎవరిని చంపాడు?”
“సొంత మేన మామ కంసుడిని చంప లేదేమిటి?”
“ఎందుకు చంపేడు?”
“ఎందుకేమిటి? ఎంత చెడ్డ వాడయితే మాత్రము  మేన మామను చంపదమేనా?”
“మరి కంసుడు  ఏమి చేసేడు?”
“అమ్మను నాన్నను జైలులో పెట్టినాడు.”
“అంతేనా?”
“కృష్ణుడిని చంపాలని అప్పుడే పుట్టిన  పసి పిల్లలను అందరినీ చంపించినాడు.”
“అయినా నీకు చాలా విషయాలు తెలుసే? అంతేనా? ఇంకేమీ లేవా?”
బుర్రను గీక్కుంటూ  అన్నాడు, “ఇంకా  ఏమున్నాయి సామీ!”
“పూతన, కేశి, తృణావర్తుడు, లాంటి  రాక్షసులను తన దగ్గిర ఉంచుకొని, పోషించినాడంటే ప్రజలు అతడికి ఎటువంటి గౌరవము ఇస్తారంటావు? దుర్మార్గుల స్నేహము చేసే వాడు మంచి వాడేనా?”
“నిజమే సామీ! మరి నాదొక  ప్రశ్న. యుద్ధము పేరుతొ దుర్యోధనుడిని తమ్ములన్దరితో చంపించినాడు కదా? నెత్తుటి ఏర్లు పారినాయి. ఇదేమి న్యాయము సామీ!”
“ఎంత సేపు నిలబడతావు? రా. ఇటు వచ్చి కూర్చో.”
“మీ పక్కనా? వద్దు సామీ! మీరు చానా మంచోళ్ళు,  గొప్పోళ్ళు.”
“మరి ఇప్పుడే చెప్పావు కదా. అందరూ దేవుళ్ళేనని. ఇంకా అనుమానమెందుకు? రా. వచ్చి కూర్చో.”
గోపయ్య వద్దంటూనే బలవంతముగా అరుగు మీద కూర్చున్నాడు. చుట్టూ మరి కోన మనిచేరినారు.
“అమ్మయ్య నీకు నిలువు జీతము ఇవ్వాల్సి వస్తుందేమో అని భయ పడ్డాను. ఇప్పుడు చెప్పు యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది?”
“పాండవులు, కౌరవుల మధ్య .”
“కృష్ణుడు యుద్ధము చేసినాడా?”
“లేదు.”
“మరి పాండవులు యుద్ధము ఎందుకు చేసినారు?”
“బారాలాడి కౌరవులు  పాండవుల రాజ్యమును కొట్టేసినారు. వన వాసము, అజ్ఞాత వాసములు అయిన తరువాత రాజ్యము తిరిగి ఇస్తామన్నారు.  కానీ తిరిగి ఇవ్వ లేదు.”
“అంతేనా?”
“ద్రౌపది అమ్మను నిండు సభలో  అవమానించినారు.”
అంటే యుద్ధమునకు మూల  కారణము  ఆస్తా, ఆ ఉత్తమ స్త్రీ యొక్క ఆక్రోశమా? పైకి చెప్పే కారణము ఒకటయితే, అంతరంగములో మరొకటి ఉంటుంది. ఋషులకు  కొన్ని నియమాలున్నాయి. ఏది వ్రాసినా  మంచి వాళ్ళ చరిత్ర ఎక్కువ, దుర్మార్గుల చరిత్ర కుదించి వ్రాయడము జరుగుతుంది. లేక పోతే  దుర్మార్గులు వాళ్ళ కథా నాయకులు అవుతారు. ఒక కులమింటి స్త్రీని, అందులో యజ్ఞ పునీతురాలిని నిండు సభలో అవమానించిన వారు, ఒక సామాన్య స్త్రీని ఏ విధముగా చూచే వారో అని, చదువరులకు ప్రశ్న వేసినారు. ఒక ఆడ దాన్ని గౌరవించని సమాజము సర్వ నాశనము అవుతుంది. ద్రౌపది చేసిన ఆక్రందన కృష్ణుని  గుండెలను కలచింది. అంతరంగములో ఇదే ప్రధాన కారణమని అనిపిస్తుంది.”
“మరి సామీ! ఈ భారతమంతా ఎవరు చెప్పినా వినే వాడిని. అందుకే నాకు కథంతా తెలుసు. మరి భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని  అలా చంపేసేరేమిటి సామీ!”
“ఎవరేలాటి వారయినా ధర్మాన్ని నిలుపక పోతే ఖచ్చితముగా కూలి పోతారు. భీష్ముడు, ద్రోణుడు ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు లేచి నిలబడితే అలా జరిగేది కాదు. కానీ వాళ్ళు ఆ పని చేయ లేదు. అజ్ఞాత వాసమునుండి తిరిగి వచ్చిన పాండవులకు వాళ్ళకు ఈయ వలసిన రాజ్య భాగాన్ని ఇప్పించ గలిగి  యుండి కూడా భీష్ముడు గట్టిగా మాట్లాడ లేదు. కౌరవుల తిండి తిన్నాము కాబట్టి, వారు చెప్పిన మాట విన వలసినదే అనే దృష్టిలో ద్రోణుడు ఉన్నాడు. ఇంకా కర్ణుడి విషయము చూద్దాము.  దుర్యోధన దుశ్శాసనులతో కలిసి నిండు సభలో ద్రోపదిని అవమానించిన వారిలో కర్ణుడు కూడా ఒకడు. ద్రౌపదీ స్వయంవరములో, ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణములో ఓటమి చవి జూచిన కర్ణుడు, తను అర్జునిడి మీద గెలుస్తానని దుర్యోధనుడిలో నమ్మకము కలిగించి పరోక్షముగా కర్ణుడు యుద్ధానికి కారణము అయినాడు. ఇదీ వాళ్ళ కథ. ఇప్పుడు చెప్పవయ్యా గోపన్నా!”
“నిజమే సామీ! నేనంత ఆలోచించ లేదు.”
“మరి రాముడు సీత కోసము రావణుడి బంధు బలగాన్ని అంతా నాశనము చేసినాడు. అదే నాకు అర్థము కావటము లేదు సామీ!”
“”ఇటువంటి అనుమానాలు ప్రేరేపించే వారు చాలామంది ఉన్నారయ్యా!అడవిలో  పూజలు హోమాలు చేసుకుంటున్న వారందరి మీద దాడి  చేసే వారు వారి స్త్రీల మీద దాడి చేస్తున్న వారు, అటువంటి ఋషులు అందరూ రాముడిని వేడుకుంటే రాముడు రాక్షసులను ఎదుర్కొని వారికి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినారు. కానీ దయామయి సీతమ్మ తల్లి “ వాళ్ళు మన జోలికి రానప్పుడు వాళ్ళ మీద  దాడి చేయడము బాగుండదేమో” అని అన్నది. అందుకనే ఏమో శూర్పణఖ ద్వారా మొదటి దాడి సీతమ్మ మీదే జరిగింది. అందుకే రామ  రావణ  యుద్ధము జరిగింది. ఇందులో అంటే ఈ యుద్ధములో పైకి  కనిపించే కారణము సీతా సంరక్షణ. అసలు కారణము ధర్మ సంరక్షణ.  అందుకే గోపన్నా! గుర్తు పెట్టుకో. మహాత్ములు వ్యక్తిగత కారణాలతో ఏదీ చేయరు.”
“చాలా బాగుంది సామీ ఎవరడిగినా ఇదే మాట చెబుతా. ఇంకో ప్రసన సామీ! ఎదో సినిమా లో దేవుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పారని ఒక మతము వాళ్ళు ఆ సినిమా థియేటర్ల దగ్గిర గొడవ చేసారు కదా సామీ! ఇదేమిటి?”
“అవన్నీ మనకెందుకులే గోపన్నా! మన విషయములో సివయ్యకు పార్వతమ్మ ఉంది, నారాయనయ్యకు లక్ష్మమ్మ ఉంది, ఇంకా బ్రహ్మయ్యకు సరస్వతమ్మ ఉంది. ఇంకా ఇంద్రయ్యకు శచమ్మ ఉంది. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి కదా.”
ఈ లోపల  “ఏమిటి నారాయణా! మీకు ఈ రోజు గోపయ్య దొరికినాడా? వాడు అయిపోయినట్లే “ అంటూ రామా రావు వచ్చినాడు.
“అదేమిటి సామీ అలా అంటారు? నాకు నారాయణ బాబు గారు ఎన్ని విషయాలు చెప్పరనుకున్నారు?” అన్నాడు గోపయ్య. మళ్ళీ, “ఇంతకూ సామీ! మనము దేవుళ్ళమా?  కాదా?”అని అడిగినాడు.
నారాయణ అన్నాడు, ”నీ లాగా ఒకడు సత్య సాయి బాబా వారి దగ్గిరకు వెళ్లి, “బాబా! మీరు దేవుడత కదా!”అని అడిగినాడ ఆయన జవాబు ఇచ్చినారుట, ”నిజమే బంగారూ! నేనే కాదు, నీవు కూడా దేవుడివే. “అదేమిటి బాబా!”అని అంటే,” నేను దైవత్వాన్ని గుర్తించి ఆ అనుభూతి లోనికి వెళ్ళినాను, నీ ఉ ఆ స్థితికి వెళ్ళే వరకూ మామూలు మనిషివే.”అన్నారట.  గోపయ్యా! దేవుడు అంటే సర్వజ్ఞుడు అంటే అన్నే తెలిసిన వాడు, సర్వ వ్యాపి అంటే అన్ని చోట్లా ఉంటాడు, సర్వ శక్తి మంతుడు అంటే అన్నిటి కంటే శక్తి గలిగిన వాడు. అపరిమిత మయిన ప్రేమ కలిగిన వాడు. నేను దేవుడిని అని ప్లేటు మీద వ్రాసి మేడలో తగిలించుకోనక్ఖర లేదు. ఆ మానసిక స్థితిని అందుకున్న ప్రతి యోక్కరిని అందరూ దేవుడి వలెనె చూస్తారు. నేను దేవుడిని అనుకోవడము కంటే, నేను దేవుడిని ఎలా అవుతాను అని ప్రస్నించు కోవడము ముఖ్యము.”
“సామీ! మీ దగ్గిరకు నేను మళ్ళీ రావచ్చునా?” అని అడిగినాడు, గోపన్న.
“తప్పకుండా.” జవాబు వచ్చింది.


***************************************************************
visit  varasatvamu.blogspot.in