Sunday, June 14, 2026

 

తోట మాలి

 

(ఇవి  రవీంద్ర  టాగోర్  ఆంగ్లములో  వ్రాసిన  gardener  అనే పేరు తో ఉన్న గేయ సాహిత్యానికి తెలుగు

అనువాదము )

రవీంద్ర  నాథ  టాగోర్  ప్రకృతి మాత  ముద్దు బిడ్డల  లో నొకడు . ఆయన యొక్క గీతాంజలి కి  నోబుల్ బహుమతి కూడా ఒకటి వచ్చింది. తోట మాలి ఆయన మరొక గేయ కావ్యము. ఆ  గీతముల  సంపుటిలో నాయకుడు  పెద్ద పడవులేవీ వద్దంటూ  తోట మాలిగా చే రుతాడు. ప్రతి పూవులో  స్పందనము అందుకు యువ హృదయాలలో  అనుభూతి , విరహాకీర్ణ  హృదయము    రచనల  ద్వారా  అందిస్తాడు.

 

1.     తోటమాలి

 

సేవకుడు : కరుణతో  నను  చూడవమ్మా

            మహ రాణీ | కోరినది నాకీయవమ్మా

రాణి :    ముగీసేను  నేడు  సమా వేశము

           అను చరు లందరు  వెడలి పోయిరి

            కారణమున    వెళలలో

           తోటకు వచ్చితీవు

సేవకుడు: పలువురు కోరిన కోర్కెల  నేను

            కొరను  నమ్ముము మహారాణీ |

             చివరకు  మిగిలిన  పనులన్నీటిలో

             నొక  దానిని  వేడగ  వచ్చితిని.

రాణి:  ఆయెను  నేడు  ఆలశ్యము

         ఆలశ్యపు  వేళలందు

         ఏమి చేయ  గలను  నేను

సేవకుడు :నీదు  తోటలో  మాలిగ 

                చేర  దలచితిని  నేను 

రాణి :    ఏమిటి  నీ తెలివి లేమి 

             కోరితి  వింత  చిన్న  కోర్కె  నా 

             ఏమి లాభ  మా శించితీ 

           విందులోన  నీవు ఇచట 

సేవకుడు :పదును తేలిన కత్తులతో 

                   కదన రంగమున  నాడను  నేను 

                  రాయ బారిగా పొరుగు  రాజ్యముల 

                 రాచ  కార్యముల  చక్క బెట్టను 

                 తోట మాలిగా  పూల తోట  లో 

                 ఆట  పాటల  నేర్వగ తలచితి 

రాణి   :నీ  విధులేవో తెలుసా ?

సేవకుడు: నీ నడ యాడే  బాటల  లోన 

                  పసిమి  నిండిన  పచ్చిక  బయలుల 

                 పెంచేదను  నేనో  మహా రాణీ | నే 

                  పనులే  లేని  రోజుల లోన 

                  పలు పలు  రంగుల   విరుల  గుచ్ఛములు  నీ 

                  ప్రతి అడుగుకు  స్వాగత మిచ్చేను 

                  ఏడాకుల  వృక్షము నూ యల  లూ గ 

                  పూల  ఊయల  నేర్పరచెద   నే 

                  ఊయల  లూగే  మథుర  క్షణ ముల 

                  చంద మామ  నిను  తొంగి చూచుచు 

                 ఆకుల  చాటున  నుండి  దేహమును 

                 చుంబించగ  నే చూచెదను 

               శయన ము  దగ్గిర  దివ్వె లకు  

              విరుల  నూనెను  తెచ్చి  ఇచ్చె దను  

              చందన మ్ముతో  పాద  పీఠికను 

                రంగుల నలం కరిం చెదను. 

రాణి   : ఇందుకు  బహుమతి  ఏమి  కోరెద వు ?

సేవకుడు : తామర మొగ్గల పోలు నీ పిడికిలి 

                    నలం కరించె ద  విరుల  సరము ల 

                    నీ పాదమును  అశోక  రసము తో 

                   నలంక రించేద  నో  రాణీ 

                     నీ పద  ధూళిని  చుంబించు టకై  అనుమ తించుమ  మహా  రాణీ 

రాణి        :అనుమతించితి  నీవు  ఇక  పై 

                నాదు  తోటకు  మాలి  వి  గా .

               

 

 

Saturday, June 13, 2026

  

క్రొత్త రోజు

ఉదయించే  అరుణ రాగ

మెల్లప్పుడు స్మృతి  మధురము

బ్రదుకు దెరువు కొరకవే

 బయలు దేరు శకుంతములు

 

కలకలకల   కల రవములు

మంజీర  స్వరము  పోలు

ఆమని నూహించు కొని

ముదురాకుల నయిన  తిని

తీయని  స్వరమల   పిలిచే    

కోయిలమ్మ  మధుర గళము

 

విరిసీ  విరియని  అంద  చందముల

పరిమళ  ముల  వెద  జల్లుచు

ఊదయా ర్కు ని కెదురు చూచు

పద్మిని  మృదు  హృ దయమ్ము

 

హేమంతుడి  విజృం భణ

దళ దళముల  హిమ పూరిత  

కమనీయ  దృశ్య మాయే

పొదల  మధ్య  తొంగి  చూచు

పూర్వ భాను కిరణ మ్ముల

వేల వేల  రంగులతో 

నేత్ర పూర్వ  దృశ్య  మాయే

 

అరుణ  రాగ మతిశయించి

కొలను కొలను పరవశించి

పది దిక్కులు పరవశించే

కానీ  మానవుడి ఉదయము

మనుగడకు అపాయము

ఏమి చేయ తలచినాదో

ఏమి చేయ గల వాడో

క్రొత్త  రోజు కొత్త రోజు

కొత్త కొత్త సమస్యలకు

పునాది వేసి తరలి పోవు.                        

 

 

 

 

Sunday, September 25, 2022

వ్యాధి

 

                                       

         వ్యాధి  అంటే  అలవాటు భాషలో  ‘” రోగము” గా పిలువ బడుతుంది. రోగము మనిషి కి కాక మొక్కకు  కు వస్తుందా ? అనేది ప్రశ్న. ఈ ప్రశ్నను కొందరు వేస్తారు. అయితే రోగము వచ్చి చచ్చి పోయే  మొక్కలను కోవస్తూనే ఉన్నాము. అత్యంత ప్రాచీన కాలము నుండి రోగ్యములను  కొని ఏకచ్చి పెట్టు కొనే  వారిని చూస్తూనే ఉన్నాము.

              ఇంతకూ  రోగము/వ్యాధి అంటే  ఏమిటి? మనిషి తన సహజ స్థితి లో లేక పోవడమే రోగము. ఇంతకూ సహజ స్థితి అంటే ఏమిటి?  ఆనందము లేదా సంతోషము. ఏ రోగ్యమూ లేని వాడు అటువంటి స్థితి లో ఉంటాడు. ఏ దేహ భాగము లోనేయినా బాధను అనుభవిస్తున్న వాడు, సంతోషముగా ఉందా లేదు. ఏ పనినీ చేయ లేడు .

              భారతీయ సాంప్రదాయములో మనిషి దేహములో వాతము, పిత్తము, కఫము అనే మూడు లక్షణములు ఉండేటట్లు, వీటిలో తేడాలు వచ్చిన వారికి ఆ యా దోషము వచ్చినట్లు చెప్పేవారు. ఏ లక్షణము అయినా ఉండ  వలసిన దాని కంటే తేడాగా ఉన్నపుడు రోగ్యమున్నట్లుగా భావించే వారు. మణి కట్టు దగ్గిర నాడీని పట్టుకొని  పరీక్ష చేసే వారు. సామాన్య వ్యాధులకు మూలికలు, చూర్ణాలు,  లెహ్యాలు  లాటి వాటిని మందుగా వాడే వారు. వ్యాధి తీవ్రతను బట్టి  పాద రసము, వెండి, బంగారము లాంటి లోహాలను  రస భస్మములు  లేదా   మందులను తయారు చేసి రోగి రోగానికి అనుగుణముగా వాడే వారు.  ధన్వంతరి, వాగ్భటుడు, అగ్ని వేశుడు  మున్నగు వారితో బాటు రసాయన  విద్యలో నిష్ణాతుడయిన నాగార్జునుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులలో కొందరు.

                   ఈ వైద్య విధానాలలో  ఎక్కడా వ్యాధి  సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చునట్లు  చెప్పబడ  లేదు. అంతే  గాక ప్రయవరణము మీద ప్రభావము చూపించే  రసాయనాలు ఎక్కడా వాడి  నట్లు లేదు.

                    ఈ పద్ధతులను అలవాటు చేసుకోని  ఐరోపా  దేశాలలో  లూయీస్  పాశ్చర్   పేరు గల వ్యక్తి  మలేరియా , కలరా లాంటి  వ్యాధులకు సూక్ష్మ క్రిములే  కారణమని సిద్ధాంతీకరించి  అందుకు తగ్గ క్రిమి నిరోధకాల వాడుక ద్వారా  ఈ రోగాలను నీయంత్రించ  వచ్చునని సిద్ధాంతీ కరించినాడు . అయితే పాశ్చర్ యొక్క  సమ కాలీనుడయిన  బే చాంప్  ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ  క్రిముల వలన వ్యాధి  రాదని, వ్యాధి వచ్చిన దేహ భాగాలలో  ఈ క్రిములు చెరతాయని సిద్ధాంతీ కరించినాడు. ఆ నాటి శాస్తరజనులు  బే చాంప్  ప్రతిపాదనను అంగీకరించ లేదు. ఈ విధముగా  సూక్ష్మ క్రిమి నిరోధకాలు లేదా  యాంటీ బయోటిక్స్  ఉపయోగము పెరిగింది. ఇది ఎటువంటి సమస్యలకు దారి  తీసిందొ  చెప్పనవసరము  లేదు.

                    ఈ సందర్భములో  సంస్కృత భాగవత శ్లోకాలు  గుర్తుకు వస్తాయి.

          ఆమయో  యశ్చ  భూతానాం  జాయతో యేన సువ్రత

          తదేవ  తదేవ హ్యా మయో  ద్రవ్యః    సః పునాటి చికిత్స తమ్ .|

          ఏవం  నృ ణాం  క్రియా యో గాః  సర్వే సం సృతి  హేత వః

            ఏవాత్మ  వినాశాయ  క ల్ప న్తె కల్పితాః  పరే ||

         ఏ పదార్థము వలన జీవులకు వ్యాధి కలుగుతుందో  అదే ద్రవ్యము (కొద్ది మార్పులతో) చికిత్సను అందిస్తుంది. ఇదే విధముగా మనము చేసుకున్న కర్మలు బంధాలకు దారి తీస్తాయి.  భాగవత్సమర్పణ  వలన  ఈ కరమలే మన విడుదలకు తోడ్పడుతాయి. ఇందులో మొదటి మాటను మనకు బాగుగా తెలిసిన విషయముగా అంగీకరించి  వేదాంత సూత్రీ కరణను  చేసినారు.

             ఇందులో మొదటి మాటనే  సిమిలా సిమిలర్  క్యూ రాటర్  గ్రీకు గ్రంథాలలో చెప్పబడినది. ఈ సూత్రమునే శామ్యూల్  హానే మాన్  విస్తృతముగా పరిశోధనలు  చేసి, హోమియో పతి  వైద్య విధానాన్ని అందించినారు.  ఆయన వ్రాసిన మూల సూత్రముల సంపుటి ఆర్గనాన్ లో నొక సూత్రము వైద్యము చేయ వలసినది రోగానికి కాదు, రోగికి.

              ఆయుర్వేదము, హోమియోపతిలలో రోగికి ప్రాధాన్యము నిస్తే ఆలోపతి లో రోగానికి ప్రాధాన్యతని ఇచ్చి,సూక్ష్మ క్రిమి హంతకులకు ప్రాధాన్యతను యిచ్చినారు. ఇంతకంటే లోతుగా వెళ్లడము మంచిది కాదు.

 

Wednesday, August 24, 2022

సంస్కారము

 


జ్ఞానము రెండు రకాలుగా వస్తుంది. మొదటిది పరంపరాను గతముగా లేదా శిక్షణ ద్వారా వస్తే  రెండవది పరిశీలన ద్వారా వస్తుంది.

ఒక కథ ఉంది. ఒక ఏరు చాలా వేగముగా ప్రవహిస్తున్నాది. నీటిలో అర్ఘ్యము వదులుతున్న ఒక యోగి నీటిలో కొట్టుకొని పోతున్న ఒక తేలును చూచి, దాన్ని ఎత్తి గట్టున పడేద్దామని అనుకున్నాడు. చేతితో ఎత్తి  దాన్ని గట్టు మీద పడ వేయ పోతూ అది తనను కుట్టగానే వదిలి వేసినాడు. మళ్ళీ దానిని తీసి అది తిరిగి కుట్టినా జాగ్రత్తగా గట్టు మీదికి విసిరి వేసినాడు.

ప్రక్కనే యున్న ఒక కుర్రాడు,”స్వామీ! అది మిమ్ములను కుట్టుతున్నా కూడా దానిని  రక్షించాలని  ఎందుకు అనుకున్నారు?”,అని అడిగినాడు. అందుకు ఆ యోగి ,”ఎరా! అంత భయముతో కూడా అది తన కుట్టే స్వభావాన్ని మానుకోలేక పోయింది. మరి నా స్వభావాన్ని ఎలా మానుకొనేది?”  అని జవాబిచ్చినారు.

ఈ కథ చాలా మందికి తెల్సిందే.

ఇటీవల శ్రాద్ధ కర్మము అయిన తరువాత అన్నపు పిండాలను చెరువులో కలుపుటకు ఒక స్మార్త విద్యార్థిని తోడు తీసుకొని చెరువు దగ్గిరకు వెళ్ళినాను. వదిలిన పిండాలతో బాటు దర్భలు కుడా నీళ్ళలో వేసినాను. ఆ విద్యార్థి వెంటనే దర్భలను తీసుకొని గట్టు మీద పడి వేసినాడు.అడిగితె చెప్పాడు,”నీటిలో చేపలు, ఇతర జీవులు ఆహారముతో బాటు, అది మామూలు గడ్డి యని కొరికితే వాటి నాలుకకు గాయమవుతుంది.”

మన మురికినంతా ప్రక్క వారి స్థలాలలో వేసే ఈ రోజులలో, మన పరిశ్రమల మురికినంతా కాలువల్లో, నదుల్లో వేస్తూ త్రాగు నీటిన్ కలుషితము చేస్తున్న ఈ రోజుల్లో  ఆ కుర్రాడి సంస్కారము ఎటువంటిది? మన సంస్కారము నేల కు దగ్గిరగా యుంటే, అతడి సంస్కారము ఆకాశముకు దగ్గిరగా ఉంది. అందుకే ప్రతి యెక్కడి నుండీ మనము పాఠాలను నేర్చుకొన వలసి యుంది.

ఒక సారి పండరి నుండి తిరిగి వస్తూ షోలాపూర్ బస్ నిలయములో యున్నాము. బయట అరటి పండ్లు కొని బస్ నిలయంలో ఉన్నాను. సన్నగా, పొడుగ్గా యున్న యొక పేద కుర్రాడు బిచ్చ మెత్తుకుంటూ నా దగ్గిరకు వస్తే డబ్బుకు బదులుగా రెండు అరటి పండ్లు అతడి చేతిలో పెట్టాను. వెంటనే ఆ కుర్రాడు సాష్టాంగ నమస్కారము చేసినాడు. పాపము ఎంత ఆకలిగా ఉన్నాడో? నాకు చాలా ఆశ్చర్యము వేసింది. అక్కడే నిలబడి యున్న ఒక ఆవుకు అరటి పండు పెట్ట బోతే అది తల తిప్పెసుకుంది. అంటే ఆ ఆవుకు అరటి పండ్లు అఖ్ఖర లేదుట. మరి ఏ తిండి కావాలో? చాలా ఆశ్చర్యము వేసింది.

 

 

వాసు దాసు గారు.

 


ఈయన గుంటూరు జిల్లా కు చెందిన ఒక రామ భక్తుడు. ఒక యోగి. ఈయన మనుమడు (పేరు రామ ప్రసాదు గారు) భీమవరము ఒక కాలేజి లో పని చేసి పదవీ విరమణ చేసినాఋ. నాకు బాగా పరిచయమున్న వారు. ఈయన వాసు దాసు గారి జీవితములో కొన్ని సంఘటనలను నాకు చెప్పినారు. మన సమర్పణ భావముతో నే భగవంతుడు అంతా చూచు కొంటారని చెప్పటానికి ఇవి మంచి ఉదాహరణలు.

వాసు దాసు గారి పూర్తీ పేరు వావిల కొలను సుబ్బారావు గారు. వాల్మీకి రామాయణాన్ని యథా తథముగా తెలుగు లో మంథరము అన్న పేరుతొ పద్య కావ్యముగా వ్రాసినారు. ఈయనకు చాలా శిష్య బృందముంది. ఆశ్రమములో  రాముడి పేరు మీద ఎదో యొక కార్యక్రమము జరిగేది.

ఒక రోజు  వాసు దాసు గారు “రేపు రాముడి పేర సంతర్పణ జరగాలి రా.” అని యన్నాదుట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సరుకులు లేవు. అప్పటికప్పడు అనుకుంటే ఎలా జరుగుతుంది? ఆశ్రమములో అందరి బుర్రలలో ఇదే  ప్రశ్న. మర్నాడుదయాన్నేఆశ్రమము ముందు ఎడ్ల బండ్లు ఆగినాయిట.వాటి నిండా బియ్యము, పప్పులు, కూర గాయలు వచ్చినాయి.అప్పుదందరికీ అర్థమయింది, ఆయన మాటలకు అర్థము.

ఒక సారి ఆయనకు భద్రాచలము వెళ్ళాలనిపించి  తన శిష్యులతో చెప్పినారుట.వారు బాగా హడావిడి పడి పోతూ  ఇంటికి వెళ్లి డబ్బాల నిండా జన్తికలూ తిను బందారాలూ చేయించి ఆశ్రమానికి తీసుకొని వచ్చినారుట.  వాటిని చూచి వాసు దాసు గారు పగలబడి నవ్వినారుట. “అదేమిటి గురువు గారూ!” అంటే, “మనము వెళ్ళేది ఒక చక్రవర్తి దర్శనానికి. మన అవసరాలు ఆయన చూచు కోరా ఏమిటి? ఇంత కంగారెందుకు?” అంటూ చుట్టూ పక్కల పాకలలో ఉండే వారి పిల్లలను పిల్చుకొని రమ్మని చెప్పి వారి చేతుల మీదుగానే మొత్తము తిను బండారాలన్నీ అ పిల్లలకు పంపకము చేయించినారుట.

ఇంకా వారి భజన యాత్రలో దారిలో భోజన వేళకు ఎవరో ఒకరు వచ్చి ఇంటికి పిల్చుకొని వెళ్లి భోజనాలు పెట్టించే వారుట. అందుకే సమర్పణ భావమున్న చోట లోటుండదని చెబుతారు.

ఒక సంఘటన

 


ఇది  అమెరికా లో కొన్న నెలల క్రిందట జరిగినది. ఒక కంప్యూటర్  సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అమెరికా లో పోస్టింగ్ వచ్చింది. మొదటి సారి అయినా తను ఒక్కడే వెళ్ళకుండా భార్యతో సహా వెళ్ళినాడు.

ఒక సారి భార్యకు ఎదో రుగ్మత వచ్చింది.  స్నేహితుల సలహా మీద ఒక కార్పొరేట్ హాస్పిటల్  కు వెళ్ళినాడు. వాళ్ళు నిర్ణయించిన వైద్య పరీక్షలన్నీ చేయించినాడు. ముందు జాగ్రత్త కై ఎంత ఖర్చు అవుతుందని అడిగినాడు. వాళ్ళు ఇచ్చిన లెఖ్ఖ చూచి డీలా పది పోయినాడు.

ఈ సమస్య అందరికీ వస్తుంది కదా!

నిజానికి అమెరికా లో ఇది ఒక సమస్య కాదు. అందరూ మెడికల్ ఇస్యూరన్స్ నుండి ఈ బిల్లు కడతారు. వెళ్ళిన వ్యక్తీ ఇటీవలే ఇన్స్యూరన్స్ తీసుకున్నాడు. వెంటనే డబ్బు తీసుకొనుటకు అర్హత లేదు. మరి కొత్త పాలసీ దారు కదా! ఉన్న డబ్బు వైద్య పరీక్షలకు అయి పోయింది. వేరే మార్గాలు ఏమయినా ఉన్నాయేమో తెలియదు. అందుకని వైద్యము చేయించకుండా గుట్టుగా ఇంటికి వచ్చేసినారు.

రెండు రోజులలో అతడికి లీగల్ నోటీస్  వచ్చింది. భార్యకు బాగు  లేక పొతే వైద్యము చేయించ కుండా వచ్చేసినాడు అన్నది ఆరోపణ. ఆ తరువాత ఏమి జరిగిందో మన వార్తా పత్రికలూ వ్రాయ లేదు, వ్రాయవు కూడా.

దీనికి ఈ క్రింది మలుపు ఉంటె బాగుంటుందని అనిపించింది.

ఈ విషయానికిది మరో మలుపని ఊహించుకుందాము. ఈ విధము గానే జరగాలని  కాదు.

జడ్జి గారి ముందుకు ఈ కేసు వచ్చింది. జడ్జి గారు “డబ్బులు లేనపుడు ఇది ఎలా వీలవుతుంది? అని అడగ లేదు. భార్యకు వైద్యము చేయించక పోవడము నేరము” అని అన్నాడు.

నిందితుడయిన ఉద్యోగి తన పరిస్థితి అంటా వివరించి చెప్పినాడు. జడ్జి గారు అంగీకరించ లేదు. చివరగా నిందితుడు ఒక విజ్ఞప్తి చేసినాడు. “మీరు జడ్జిమెంట్ చెప్పే ముందు మా ఇద్దరికీ అంటే  భార్యా భర్తలకు మీ చేంబర్ లో విడిగా మాట్లాడుటకు ఒక అవకాశము ఇస్తారా?” అని అడిగినాడు. ముందు ప్రాసిక్యూటర్ అందుకు అభ్యంతరము పెట్టినా , చివరకు ఒప్పుకున్నాడు. ఆ సెషన్ అయిన తరువాత ఓ పది నిముషాలు అవకాశము ఇవ్వడానికి జడ్జి ఒప్పుకున్నాడు.

సెషన్ పూర్తీ అయింది. భార్యా భర్తలు ఇద్దరూ జడ్జి గారి చేంబర్ కు వెళ్ళినారు.

జడ్జి గారి ముందు ఇద్దరూ నిలబడినారు.

“మై  లార్డ్! ఇప్పటి వైద్యము గురించి చెప్పే ముందు మీ ఆరోగ్యము గురించి మాట్లాడుటకు అనుమతి ఇస్తారా?”

“ఈ  నాన్సెన్స్  ఏమిటి? అసందర్భము గా ఉంది. అయినా నాగురించి నీ కేమి తెలుసు? వెంటనే చీప్పాలి”’

“ మై లార్డ్!  మీకు కొంత కాలముగా అనారోగ్యముగా ఉంది కదా, దానిని గుండె జబ్బుగా వైద్యులు నిర్ధారించి ఉండాలి. కాని, అది గుండె జబ్బు కాదు.”

“నీవు కంప్యూటర్ సైంటిస్ట్ వు. నీకు రోగాల గురించి ఏమి తెలుసు?”

“మై లార్డ్! నేనొక హీలర్ ను. నాకు వైద్య శాస్త్రము లో దేహ తత్వము గూర్చి తెలిసిన వాడిని. మా ఇండియా లో చేయి మణికట్టు పట్టుకొని రోగాన్ని స్పష్టముగా నిర్ధారించ గలిగిన ఆయుర్వేద వైద్యులున్నారు. చూడగానే రోగాన్ని పసి గట్టె యోగులున్నారు. వీరు దేహములో  శక్తి గమనాన్ని బట్టి రోగ నిర్ధారణ చేస్తారు ఎక్కడా ఎ యంత్రమూ అవసరముండదు. నేను కాస్త యోగ తెలిసిన వాడిని. అందుకే మీ పరిస్థితిని చూడగానే తెలుసుకున్నాను. ముందు మీ విషయము చెబుతాను. మీరు కొన్ని రోజుల క్రిందట ఎక్కడిఅనా విందు భోజనము చేసి ఉంటారని అనుకుంటాను. అది మీ పొట్టలో గాస్త్రిక్ సమస్యను తీసుకొని వచ్చింది. దానిని గుర్తించనండు వలన గుండె క్రింద  దయాఫ్రము మీద ఒత్తిడి పెరిగి మీకు గుండె నొప్పిగా అనిపిస్తున్నది. పరీక్షలో అది గుండె నొప్పిగానే తేలుతుంది.”

“మరి నేనేమి చేయాలి?”

“యోగ సాధనన్నా చేయాలి. అవసరమయితే హోమియోపతి ని ఆశ్రయించండి.”

“ఇన్ని తెలిసి హాస్పిటల్ కు ఎందుకు వెళ్ళారు?”

‘సదన్ గా వచ్చేసరికి మానసిక ఒత్తిడి వలన ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి. ఆ టెస్టులకు వాడిన డబ్బు వైద్యానికి సరిపోతుంది. అయనా వైద్యాన్ని నేను చేసుకో గలను. కానీ ఇప్పుడు నేను ఫిక్స్ చేయ బదినాను. మీరు ఇది అర్థము చేసుకొని నన్ను తప్పించాలి.”

“చాలు .చాలా మంచి విషయాలు హేప్పావు. నేను చేయగలిగినది ఏమయినా ఉంటె సాయము చేస్తాన్.’

కథ ఇలా ముగిస్తే బాగుంటుంది కదా. ఈ ఊహతో కూడిన కథను ఆపేద్దాము. నాకు ప్రయాణములో జరిగిన సంఘటన ను చెబుతాను.

ఒక సారి నేను చెన్నై వెళ్ళుటకై సర్కార్ ఎక్స్ ప్రెస్స్స్ ఎక్కినాను. నా పక్క బెర్త్ ల లో ఒక వృద్ధ డాక్టర్ దంపతులున్నారు. వారు కాకినాడ లో ఎక్కి సూళ్ళూర్ పేట వెళ్ళుతున్నారు. వారితో మాట్లాడుతూ ఉంటె గుడివాడ దగ్గిరకు చేరిన తరువాత ఏర్పడిన చనువుతో మగ డాక్టర్ ను అడిగినాను.

“ప్రతి రోగానికీ ఇన్ని పరీక్షలు(బాగా డబ్బు ఖర్చు చేస్తూ) అవసరమంటారా?” అని అడిగినాను.

“నా వైద్య శాల లో నేనుగా ఎవరికీ ఎటువంటి పరీక్షను వ్రాయ లేదు. నా స్టేత స్కోపు తో ఎ రోగాన్నయినా నేను ఖచ్చితముగా గుర్తించ గలను. ఒక సారి ఒక పేషంట్ అడిగితె ముందు నేను రిపోర్టు వ్రాసుకొని అతని చేత బయట ప్రయోగ శాల లో పరీక్ష చేయించి నా రిపోర్టు ను అతడి రిపోర్టు ను పోల్చి చూపించాను.” అని చెప్పినాడు. మరి ఇప్పుడు పరీక్షలకే వేల రూపాయలను ఖచు పెట్టిస్తున్నారు.

ఇదే వ్యాపారమంటే. ఖచ్చితముగా సేవ కాదు.

 

 

 

 

Monday, August 22, 2022

ఆంధ్రా పూరీ

 

                                                          

 

      పూరీ జగన్నాద్ గారు తమ అబ్బాయి నాయకుడిగా ఒక సినిమా తీసినాడు. దాని పేరు ఆంధ్రా పోరి. ఆంధ్రులలో పోరీ అనే పదము అసలు వాడరు. అది హిందీ , లేదా హైదరాబాదీ/ఉర్దూ పదము అయి ఉండాలి. విశేషమేమిటంటే ఆ పోరీ గా నటించినది ఆంధ్రా అమ్మాయి కాదు.  ఆంధ్రా తెలంగాణా  నాయకులు వైరుధ్యాలతో కొట్టుకుంటుంటే పరస్పర వైరుధ్యాలను తలపించే పేరు గల ఈ చిత్రము సామరస్యమిస్తున్దనుకున్నారేమో? లేదా ఆంధ్రా పూరీ అంటే బాగుందడనుకున్నారేమో?

`     దీని మీద తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఎలాటి  ఆసక్తి కలిగినట్లు లేదు. బహుశా కంఫ్యూజన్ లో ఉన్నాడేమో? లేదా తెలంగాణా పోరీ అనకుండా  ఆంధ్రా పోరీ అన్నందుకు ఇక్కడ రిలీజ్ చేస్తాడా, నిర్మాత నాలుక కత్తిరించి వేస్తానని అంటారేమో అనుకున్నాము.