క్రొత్త రోజు
ఉదయించే అరుణ రాగ
మెల్లప్పుడు స్మృతి మధురము
బ్రదుకు దెరువు కొరకవే
బయలు దేరు శకుంతములు
కలకలకల కల రవములు
మంజీర స్వరము పోలు
ఆమని నూహించు కొని
ముదురాకుల నయిన తిని
తీయని స్వరమల పిలిచే
కోయిలమ్మ మధుర గళము
విరిసీ విరియని అంద చందముల
పరిమళ ముల వెద జల్లుచు
ఊదయా ర్కు ని కెదురు చూచు
పద్మిని మృదు హృ దయమ్ము
హేమంతుడి విజృం భణ
దళ దళముల హిమ పూరిత
కమనీయ దృశ్య మాయే
పొదల మధ్య తొంగి చూచు
పూర్వ భాను కిరణ మ్ముల
వేల వేల రంగులతో
నేత్ర పూర్వ దృశ్య మాయే
అరుణ రాగ మతిశయించి
కొలను కొలను పరవశించి
పది దిక్కులు పరవశించే
కానీ మానవుడి ఉదయము
మనుగడకు అపాయము
ఏమి చేయ తలచినాదో
ఏమి చేయ గల వాడో
క్రొత్త రోజు కొత్త రోజు
కొత్త కొత్త సమస్యలకు
పునాది వేసి తరలి పోవు.