తోట
మాలి
(ఇవి రవీంద్ర
టాగోర్ ఆంగ్లములో వ్రాసిన
gardener అనే పేరు
తో ఉన్న గేయ సాహిత్యానికి తెలుగు
అనువాదము )
రవీంద్ర నాథ టాగోర్
ప్రకృతి మాత ముద్దు బిడ్డల లో నొకడు . ఆయన యొక్క గీతాంజలి కి నోబుల్ బహుమతి కూడా ఒకటి వచ్చింది. తోట మాలి ఆయన
మరొక గేయ కావ్యము. ఆ గీతముల సంపుటిలో నాయకుడు పెద్ద పడవులేవీ వద్దంటూ తోట మాలిగా చే రుతాడు. ప్రతి పూవులో స్పందనము అందుకు యువ హృదయాలలో అనుభూతి , విరహాకీర్ణ హృదయము
ఈ రచనల ద్వారా
అందిస్తాడు.
1. తోటమాలి
సేవకుడు : కరుణతో
నను చూడవమ్మా
మహ రాణీ
| కోరినది నాకీయవమ్మా
రాణి : ముగీసేను నేడు సమా
వేశము
అను చరు
లందరు వెడలి పోయిరి
ఏ కారణమున
ఈ వెళలలో
ఈ తోటకు
వచ్చితీవు
సేవకుడు: పలువురు కోరిన కోర్కెల నేను
కొరను నమ్ముము మహారాణీ |
చివరకు మిగిలిన
పనులన్నీటిలో
నొక దానిని
వేడగ వచ్చితిని.
రాణి: ఆయెను నేడు ఆలశ్యము
ఆలశ్యపు వేళలందు
ఏమి చేయ గలను నేను
సేవకుడు :నీదు తోటలో మాలిగ
చేర దలచితిని నేను
రాణి : ఏమిటి నీ తెలివి లేమి
కోరితి వింత చిన్న కోర్కె నా
ఏమి లాభ మా శించితీ
విందులోన నీవు ఇచట
సేవకుడు :పదును తేలిన కత్తులతో
కదన రంగమున నాడను నేను
రాయ బారిగా పొరుగు రాజ్యముల
రాచ కార్యముల చక్క బెట్టను
తోట మాలిగా పూల తోట లో
ఆట పాటల నేర్వగ తలచితి
రాణి :నీ విధులేవో తెలుసా ?
సేవకుడు: నీ నడ యాడే బాటల లోన
పసిమి నిండిన పచ్చిక బయలుల
పెంచేదను నేనో మహా రాణీ | నే
పనులే లేని రోజుల లోన
పలు పలు రంగుల విరుల గుచ్ఛములు నీ
ప్రతి అడుగుకు స్వాగత మిచ్చేను
ఏడాకుల వృక్షము నూ యల లూ గ
పూల ఊయల నేర్పరచెద నే
ఊయల లూగే మథుర క్షణ ముల
చంద మామ నిను తొంగి చూచుచు
ఆకుల చాటున నుండి దేహమును
చుంబించగ నే చూచెదను
శయన ము దగ్గిర దివ్వె లకు
విరుల నూనెను తెచ్చి ఇచ్చె దను
చందన మ్ముతో పాద పీఠికను
రంగుల నలం కరిం చెదను.
రాణి : ఇందుకు బహుమతి ఏమి కోరెద వు ?
సేవకుడు : తామర మొగ్గల పోలు నీ పిడికిలి
నలం కరించె ద విరుల సరము ల
నీ పాదమును అశోక రసము తో
నలంక రించేద నో రాణీ
నీ పద ధూళిని చుంబించు టకై అనుమ తించుమ మహా రాణీ
రాణి :అనుమతించితి నీవు ఇక పై
నాదు తోటకు మాలి వి గా .
No comments:
Post a Comment