Monday, April 8, 2013

వెలుతురులో వెతుక్కో



ఒక ముసలి అవ్వ తన గుడిసె బయట వెతుకుతున్నదట. ఆ దోవన పోతున్న కుర్రాడు “ అవ్వా! ఏమి వెతుకుతున్నావు?” అని అడిగినాడు.
 “నా సూది పోయింది నాయనా! వెతుక్కుంటున్నాను” అన్నది.
“ఎక్కడ పోయింది అవ్వా!” ఆ కుర్రాడు అడిగినాడు.
“గుడిసె లోపల పడిపోయింది నాయనా!” జవాబిచ్చింది.
“మరి ఇక్కడ వెతుకుతున్నవేమిటి?”
“లోపల చీకటి కదా. కనిపించదు.”
“మరి ఇక్కడ పడ లేదన్నావు కదా!” ఆ కుర్రాడు అడిగినాడు.
“ఏదయినా వెలుతురులో వెతుక్కోమన్నారు బాబూ! మా పెద్ద వాళ్ళు” వెంటనే జవాబు ఇచ్చింది.
ఇంకా ఆ కుర్రాడికి ఏమి చెప్పాలో తెలియ లేదు.
ఇలానే ఉంటాయి మన నాయకుల పనులు.
ఒక project  కు ఎవరూ అనుమత కాకుండానే వేల కోట్లు పెట్టి కాలువలు తవ్విన్చేసినారు. అయిదేళ్ళు దాటింది. ఇంకా దానికి అనుమతి రాలేదు.


No comments:

Post a Comment