Friday, February 13, 2015

మొదటి ఆధునిక విమాన నిర్మాత


అంతు తెలియని ఒక రహస్యము

ఇది ఒక రహస్యంగా ఉండి పోయిన విషయము.  ౧౯ వ శతాబ్దము యొక్క చివరి భాగములో బొంబాయిలో శ్రీ శివ శంకర తలవడే ఒక విమానాన్ని నిర్మించి ప్రదర్శించి నాడని, అది ౧౫౦౦ అడుగులు పైకి ఎగిరిందని ఒక కతనమున్నది. ఇది ౧౮౯౫ లో రైట్ సోదరుల  విమాన ప్రయోగానికి ౮ సంవత్సరాల ముందు  జరిగిందని శ్రీ వాసు దేవా విష్ణు దయాళ్ వ్రాసిన హిందూ స్క్రిప్చర్ అనే గ్రంధములో యున్నది.
శ్రీ తల్వడే ముంబాయి  లో చైనా బజార్ లో జీవించే వాడు. వైదిక వాజ్మయములో విద్వాంసుడు. జే జే ఆర్ట్సు స్కూల్ లో అధ్యాపకుడు. నిరంతరమూ దామోదర్ సాత్వలేకర్ అనే వేదం పండితుడితో చర్చిస్తూ ఉండే వాడు. కొన్ని వేద మంత్రాల ఆధారముగా విమానాన్ని నిర్మించి దానికి మరుత్సఖి అని పేరు పెట్టినాదుట. దానిని బాంబే ఆర్టు సొసైటీ ఆధ్వర్యములో టౌన్ హాల్ లో ప్రదర్శించినాడు. ఇందులో ఆయన పాద రసాన్ని సూర్య శక్తిని వాడినాడు. ముంబాయి చౌపాత్తి మైదానములోపలువురు ప్రేక్షకుల సమూహములో అది ప్రదర్శించ బడినది. ఆ నాడు దీనిని చూచిన వారిలో మహా దేవ గోవింద రానడే , బరోడా  మహా రాజు కావలసిన లాలాజీ రాయంజీ కూడా యున్నారు. మరాఠీ లో తల్వడే “ప్రాచీన విమాన విద్యే చాసోద” అనే గ్రంథాని వ్రాసినారు.
తన భార్య చని పోయిన తరువాత  తలవడే తన ప్రయోగాలని మాని వేసినారుట. ఆ తరువాత ఆయన వారసులు దానిని ఒక బ్రిటిష్ కంపెనీకి అమ్మి వేసినారుట.(ఆచారాలు శాస్త్రీయత గ్రంథమునుండి)
ఇటీవలే బయట పడిన మరొక రహస్య సమాచారము.అమెరికన్ సైనికులు ఆఫ్ఘని స్తాన్ లోని బాల్క్ నగరానికి సమీపములో యున్న కొండ గుహలలో ఒక యంత్రాన్ని చూచినారు.అది యొక పురాతన విమానముగా గుర్తించినారు.దానిని వారు ఎంత రహస్యము ఉన్చాలనుకునా బయట పడినది ఇది రష్యా దృష్టి కి వెళ్ళినది. దానిని అక్కడినుండి తరలించాలని చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫల మయినాయి.ప్రముఖ అమెరికా అధికారులందరూ వెళ్లి ఆ విమానాన్ని సందర్శించినారు. ఇది ఈ నాటి నిర్మాణానికి అనుగుణముగా లేదని, ఎన్నో విధ్వంసక ఆయుధాలతో యున్నాదని, దాని సాంకేతికత ముందు ప్రస్తుతపు విమానాల సాంకేతికత ఎందుకు పనికి రాదనీ నిర్ధారించినారు. అంటే గాక అది భారత దేశానికి సంబంధించినదని చెప్పినారు. దాని నిర్మాణము చిత్రములో చూస్తే ఇప్పటి విమానాలకు ఎ విధముగా పోలిక లేదు. (ఆంద్ర భూమి లో ఒక వ్యాసము ఆదారము)  


Thursday, February 12, 2015

ఉడత 2

                       కావలి లో అన్ని కాలేజీల మధ్య ఒక డిబేట్ (చర్చా కార్య క్రమము)  ఏర్పాటు చేయ బడినది.దీనిని కొంత మంది ఔత్సాహిక జనము ఏర్పాటు చేసినారు. దీనికి విద్యార్థినీ, విద్యార్థులందరూ ఆహ్వానించ బడినారు.  “దేవతల  రాక్షసుల  యుద్ధాలలో ఎప్పుడూ రాక్షసులకే అన్యాయము జరుగుతున్నది” అనేది చర్చ విషయము. ఈ చర్చ చివరలో దళిత వాద సాహిత్యము లోనికి వెళ్ళవచ్చు, అని నిర్వాహకుల ఆశ. ఇటువంటి దానికి మధ్యవర్తిగా నుండుటకు పెద్ద వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ప్రిన్సిపాల్ అభ్యర్ధన మీద  ఆదిత్య మధ్యవర్తిగా ఉండడానికి అంగీకరించినాడు.
ఇందుకు ఆసక్తిగా ఆకాంక్ష కూడా వచ్చినది. మొదట జరిగిన వాద ప్రతివాదనలు ఆమెకు అంత ఆసక్తి కరముగా లేవు, సంతోషము కూడా కలిగించుట లేదు. జనము మధ్య అంతరాలు పెంచి చీల్చడానికి చేసే ప్రయత్నమూ మాదిరిగా అది అనిపించినది. గతములో ఆంగ్లేయులు ‘ఆర్యన్ దాడులు’ అనే పేరుతొ ఇటువంటి వివాదాన్నే సృష్టించినారు. ఆ ఉచ్చు నుండి ఇప్పటివరకు ఎవరూ బయట పడ లేదు.  దైత్యులనబడే రాక్షసులకు  నిరంతరాయముగా అన్యాయము జరగాబడినదని, అందు వలన వారు తిరగ బడితే దానిని ఒక కుట్రగా మన ప్రాచీనులు చిత్రీకరించారన్నది చర్చాంశము గా మారినది.
వాదనలన్నీ ముగిసినాయి. ఇంక మాడరేటర్ లేక మధ్య వర్తి పాత్ర మొదలయింది.  ఆదిత్య లేచి   “నేనేమీ ఉపన్యాసము ఇవ్వటము లేదు.  అద్దము మీద మరక బడితే ఏమి చేస్తారు?” , అని అడిగినాడు.

జవాబు వచ్చింది,”తుడిచి వేస్తాము.”
“గీత పడితే?”
“వేరే అద్దాన్ని పెట్టుకుంటాము.”
“భాషలో పదాలకు అర్థాలు మారి పొతే?”
“వాటిని సరి చేయాలి.”
“ఇప్పుడు మనము అదే పని చేయాలి”, అని ఆదిత్య అన్నాడు.
“దైత్యులంటే  ఎవరు?”
“రాక్షసులు “, అని అందరూ అన్నారు.
“అయితే రాక్షసులని అనకుండా దైత్యులని ఎందుకన్నారు?”
“ఎందుకంటే వారంతా దితికి పుట్టినారు కాబట్టి” కొద్ది మంది జవాబిచ్చినారు. చాలా మందికి ఈ విషయమే తెలియదు.
“దితి, అదితి అనే పదాలకు ప్రాచీన భాషలో ఎవరికయినా అర్థము తెలుసా? తెలిస్తే చెప్పండి.”, అడిగినాడు, ఆదిత్య. ఆకాంక్ష జవాబు చెప్పాలని చేతులేత్తింది కానీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.
“దితి పరిమితత్వానికి సంబంధించిన పదము.”
“అంటే?”
“అంటే, తను, తన కుటుంబము, తన సంపద, తన సుఖాలు,.......ఇంతకూ మించి ఏవీ లేవని, ఒక సారి తను చని బోతే ఇవన్నీ పోతాయని, తనూ చని పోతానని, అంతే కానీ,తన  జీవితమూ అనంత కాలము కోన సాగుతుందన్న  భావన అతడికి ఎవరు చెప్పినా అర్థము కాదు. ఎందుకంటే దానిని అనుభవము లోనికి తెచ్చుకోడానికి తను సిద్ధముగా లేదు.”
అక్కడున్న వారిలో ఈ ఆలోచన , ఈ భావన, అంటే తమకు అనంత కాలాన్నుండి జీవితమున్నదన్న మాట ఎవరికీ అర్థము కాలేదు. కొంత మంది సభా మర్యాద తెలియకుండా ధైర్యముగా అనేసినారు,” కథలు చెప్పకండి సార్!”
వెంటనే  ఆదిత్య అందుకున్నాడు.
“అబ్బే, ఇదసలు కథలు చెప్పే సమయము కాదు. నేను నిజమే చెబుతున్నాను. ఒక రావి గింజను తీసుకుందాము. దానిలో చెట్టు ఉంటుందా?”
“ఎందుకుంటుంది?నేల మీద పడి,నీరు తగిలితే మొలకెత్తుతుంది.”
“మరి ఆ గింజ ఎక్కడినుండి వచ్చింది?”
“చెట్టునుండి “
“మరి, ఆ చెట్టు...... ఇంక నేను  అడగను. కానీ, ఇది అనంతముగా జరుగుతూనే ఉన్నది. ఒక చెట్టుకే ఇంత పరంపర ఉంటే, మనము మనుషులము తక్కువ తిన్నామా ఏమిటి? మనకూ ఉండవా?
ఎవరూ నోరెత్తి మాట్లాడ లేదు.
“పరిమితత్వానికి  అలవాటు బడిన దితి పుత్రులు, అంటే దైత్యులు , అపరిమితత్వానికి అలవాటు బడిన ఆదిత్యులు  లాగా అన్నీ కావాలనుకున్నారు. అపరిమితత్వాన్ని అంగీకరించిన ఆదిత్యులు తమంతట తాము అన్నీ అందుకున్నారు. “
“”మాకు ఈ పరిమితత్వము, అపరిమితత్వములు ఆంటే అర్థము కాలేదు.”, ఒకరు అడిగినాడు.
“ఈ భౌతిక దేహమే పరమార్థమని, కళ్లకు కనిపించేది యథార్థమని, అంతకు మించి ఏమీ లేవని భావించుట పరిమితమవడాన్ని చూపిస్తుంది.”
“మరి అది నిజమే కదా!”
“అక్కడే నూతి లోని కప్పకు, సముద్రము లోని కప్పకు తేడా తెలిసే ది. ఇలా వెళితే సమస్య నుండి చాలా దూరము వెళ్ళాలి. ఒక చిన్న ఊరిని పాలించే వ్యక్తికి దేవుడు కనిపించి వరమిస్తానంటే ఏమని కోరుకుంటాడు?”
“చిన్న రాజ్యానికి రాజునూ కావాలనుకుంటాడు.”
“చిన్న  రాజ్యాన్ని పాలించే రాజు ఏమిటో కోరుకుంటాడు?”
“చక్రవర్తి కావాలనుకుంటాడు.”
ఇలా జవాబు లు వచ్చినా యి. చాలా మందికి ఈ ప్రశ్నలు ఏమిటో ,ఎందుకు అడుగుతున్నా రో, అర్థము కాలేదు. ఒకరో  ఇద్దరో జవాబిస్తున్నారు.
“చిన్న బొచ్చెతో బిచ్చము ఎత్తుకొనే బిచ్చగాడు ఏమని  కోరుకుంటాడు?”
ఎవరినుండీ ఏ జవాబు రాలేదు.  ఏమని జవాబు చెప్పాలో తెలియ లేదు.
“తనకు బిచ్చము ఎత్తుకోవడానికి పెద్ద బొచ్చె కావాలనుకుంటాడు. “, ఆదిత్యే జవాబిచ్చినాడు.
“ఒకరి మానసిక స్థాయిని బట్టి వారికి వసతులు , సంపదలు అందుతున్నాయన్న విషయము  చెప్పినా అందరికి అర్థము కాదు. ఇంక యుద్ధాలు ఎందుకో తెలుసా?”
ఎవరూ జవాబు చెప్ప లేదు.
“ఎదుటి వాడు నిరంతర సాధన తో సంపాదించిన దానిని వాడి నుండి కొట్టేయ వచ్సునన్న భావన. తమే  ఎందుకల్లా చేయ కూడదు అనుకొని ఉప క్రమించిన దైత్యులు ఆదిత్యులు అవుతారు. దేవ దానవ సంగ్రామము అంటే అపరిమితత్వానికి ,  పరిమితత్వానికి జరిగే నిరంతర పోరాటము. నాతొ అంగీకరించని వారు ప్రశ్నించ వచ్చును.”   ఆదిత్య ముగించినాడు. నిర్వాహకులు తమ వాదన ఇలా నిర్వీర్యము అవుతుందని అనుకోలేదు. ఈ చర్చ నడిపిన తీరు ఆదిత్య వాక్చాతుర్యము  ఆకాంక్షను కట్టి పడేసినట్లు అనిపించింది.
“మరి ఈ యుద్ధాల మధ్య అధికార దేహము, అహంకారము లేవంటారా?”
“దేవతలు అంటే ప్రకృతి శక్తులు. మనకు ఈ నాడు ప్రకృతి నుండి అన్నీ సమృద్ధిగా లభిస్తున్నాయి. మరి దానవులు అంటే అన్నీ తమకే కావాలనుకున్న వారు. ప్రకృతి నుండి తను అన్నీ తీసుకొని, తిరిగి ప్రకృతికి ఏమీ ఇవ్వని వారు మొదటి తరగతి దొంగలని కృష్ణుడు అర్జునుడికి యుద్ధ రంగములో చెప్పినాడు. కానీ ఇప్పటికీ మనము అదే పని చేస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నా యుద్ధాలన్నీ దేవతలా దానవుల మధ్య కంటే  పెద్ద దొంగల మధ్య జరుగుతున్న విగా చెప్ప వచ్చును. “
ఇంకా ఎవరూ మాట్లాడ లేక పోయినారు. 

Thursday, January 15, 2015

ఉడత1

                     
“ఐ లవ్ యూ....”
“ఎవర్నిరా? “
“నేను పూర్తిగా చెప్ప లేదమ్మా! అటు చూడు”
సీతమ్మ అటు వైపు చూచింది. అక్కడ ఏ అమ్మాయీ కనిపించ లేదు. గోడ మీద ఒక ఉడత మెతుకులు తింటున్నాది.ఒక్కొక్క మెతుకును నాలుగు సార్లుగా నోట్లో వేసుకున్తున్నాది.
“నేను ఇంకా పూర్తీ చేయ లేదు , ఉడతా అని,మధ్యలో నీవు వచ్చావు. చూడు అది ఎంత ముచ్చట గా ఉందో?”
“ఇన్ని రోజులుగా చూస్తూనే ఉన్నావు. అయినా అది తినడము నీకు కొత్తగానే ఉన్నాది. “
“అంతే కాదమ్మా! చిన్నప్పటినుండి తింటున్నాను. అయినా నీవు పెడితే ప్రతి రోజు చాలా రుచి గా ఉంటుంది కాదమ్మా!”
“నిన్ను మాటలలో ఎవరూ ఓడించ లేరు పోరా.”
          ------------------------------------------------------
గోడకు అటు వైపు ఉలిక్కి పడిన వారు మరొకరు ఉన్నారు.
హాయిగా కుర్చీలో కూర్చొని  ఒక పుస్తకము చదువు కుంటున్నాది.తనకు తెలిసిన వాళ్ళింట్లో ఒక చిన్న పిల్లల పుస్తకము ఒకటి దొరికినది. దాని పేరు “ఉడతా ఉడతా హుత్”.ఇది చాలా ఏళ్ల క్రిందట ఆంధ్ర ప్రభ వార పత్రికలో ధారా వాహికగా వచ్చిందట. అదే సమయములో  “ ఐ  లవ్ యూ “ అని వినిపించి ఉలిక్కి పడింది. అది ఎవరో కాదు ప్రక్కింట్లో ఆదిత్య. ఆ తరువాత చెప్పిన ఉడత తనకు వినిపించ లేదు.
అందుకే అతడు తనను గూర్చి అన్నాడేమో అన్న భావన క్షణ కాలము కలిగినది. అయినా అతడిని తను ఎప్పుడూ దగ్గిరగా గమనించ లేదు. ఎదో ఒకటి రెండు సార్లు దూరముగా చూచింది. అప్పుడు తనకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.అయినా తాను ఆ విషయాన్ని పూర్తిగా వదిలి వేసింది. కానీ ఆ మాటలు తనలో కలవరాన్ని రేపినవి. అయినా తననే అన్నాడని నమ్మకమేమిటి? వాళ్ళింట్లో  ఇంకెవరయినా తెలిసిన అమ్మాయి ఉందేమో? తన కలవరానికి ఇంకో కారణముంది. అదేమిటి?
         ------------------------------------------------------------------
ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష.  ఈ రోజుల్లో కొద్ది మందే అటువంటి పేరు పెడతారు. పెట్టినా పూర్తి పేరుతొ పిలిచే వారు చాలా తక్కువ మంది. రమేష్ అని పేరు పెట్టి రమ్మీ అని, లేదా సుమ అని పేరు పెట్టి సుమ్మీ అని పిలిచే ఈ రోజుల్లో ఆకాంక్ష అనే పేరు పెట్టి పూర్తీ పేరుతొ పిలుస్తున్నారంటే వాళ్లకు భాష మీద ఎంత మమకారమో  తెలుసు కోవచ్చును.
అటువంటి సాంప్రదాయ కుటుంబములో పుట్టిన ఆ అమ్మాయిని తన స్నేహితురాండ్రు పేరు కుదించాలని ప్రయత్నించే వాళ్ళేమో కానీ ఇంట్లో వాళ్ళు నోరారా పూర్తీ పేరుతొ పిలిచే వారు. అలా అలవాటు పడిన ఆ అమ్మాయికి మరొక రకముగా ఎవరూ పిలిచినా నచ్చేది కాదు.
చిన్నప్పటినుండి తెలుగు భాష అంటే చాలా మక్కువ ఉండేది. తెలుగులో పంచ కావ్యాలు చాలా శ్రద్ధగా చదివింది. మరి పోతన భాగవతాన్ని అసలు వదిలి పెట్టేది కాదు. గొంతు చాలా శ్రావ్యముగా స్పష్టముగా ఉన్నందు వలన తన నాయనమ్మ ప్రత్యేకముగా ఆకాంక్ష చేత చదివి వినిపించుకొనేది.
అయినా చదువులో చాలా ముందుండేది.తనకు ఇష్టమయిన గణితము, భౌతిక  శాస్త్రము(ఫిజిక్సు) లో డిగ్రీ(పట్టా) తీసుకుంది. ఈ చదువంతా గూడూరు లో జరిగింది.  ఆ సమయములో తను నానమ్మ తాతయ్యల దగ్గిరే ఉండేది.తరువాత ఫిజిక్సు లో పిజి చేయడానికి తను కావలి లో చేరింది.  వాళ్ళ నాన్నగారు కావలి జవహర్ భారతి లో పని చేసే వారు.
తను గూడూరులో యున్నప్పుడు ఎందుకో చదవాలనిపించి శ్రీ నాథుడి శృంగార నైషధము పదే పదే చదివింది.  దీక్షగా ఆపు లేకుండా చదివి నిద్ర పోయే ముందు అనుకున్నది.”దమయంతిని పెళ్లి చేసుకోబోయే నిషధ రాజు నలుడు కలలో కనిపించడము లాంటివి నిజముగా జరుగుతాయా?” అనుకొని అనుకోని అలసటతో నిద్ర పోయింది. ఆ రోజే తనకు రాత్రి ఒక కల వచ్చింది. అందులో ఒక యువకుడు, చాలా అందముగా యున్నాడు. అతడికి తనకు పెళ్లి అని అందరూ అనుకుంటున్నారు.
ఈ విషయము తను ఎవరితో అయినా చెబితే తనకు పెళ్లి పిచ్చి పట్టిందని అనుకుంటారు.  అందుకే ఈ కల గురించి తను ఎవరికీ చెప్పకుండా, నిశ్శబ్దముగా ఉండి పోయింది. ఇది జరిగి రెండేళ్ళు అయింది. తరువాత తను కావలి వచ్చేసింది. నాన్న గారున్న ఇంట్లో పక్క వాటాలోమరొక కుటుంబమున్నది. వెనుక వైపు సందులో కుర్చీలో కూర్చుంటే వాళ్ళు పూర్తిగా కనబడుతారు.
ఆ రోజు పక్క వాళ్ళు తమ ఇంట్లో తాళాలు ఇచ్చి వెళ్ళినారు. సాయంత్రమయేసరికి ఒక యువకుడు  “ఆంటీ! తాళాలిస్తారా?”అంటూ లోపలికి వచ్చినాడు. అమ్మ వెంటనే తాళాలను ఇచ్చింది. ఆ యువకుడి ముఖమును చూడగానే  తనకు ఎదో షాక్  (అఘాతము) తిన్నట్లు అనిపించినది. ఎందుకంటే రెండేళ్ళ క్రిందట తనకు కలలో కనిపించినది అతడే. అమ్మ వచ్చే లోపల , తను “మీరా?”అని అన్నది. వెంటనే తను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చి నాలుక కరుచుకొని వెనుకకు వెళ్లి పోయినది. ఆ యువకుడు కూడా తన మాట విని, తనను వింతగా చూచి వెనక్కు వెళ్లి పోయినాడు. అప్పటినుండి అతడిని బాగా పరీక్షగా చూడాలని అనిపించేది. కాని, తను పెరిగిన వాతావరణము  తనను ముందుకు అడుగు వేయనీయ లేదు.
“అమ్మా! ఆయనెవరే?”,అని అడిగింది.
“ఆయన ఏమిటే?  చిన్న పిల్లాడే. ఇంకా పెళ్లి  కాలేదు. జవహర్ భారతి లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. చాలా తెలివి గల వాడు.”
“మరి ఏ యునివర్సిటీ లోన చేరకుండా ఈ కాలేజి లో ఎందుకు చేరేడు?”
“ఎవరి అవసరాలు వారివి. వాళ్ళ నాన్నకు కొంత అనారోగ్యము. ఇంటి పట్టున యుండి తండ్రిని కూడా చూచుకోవాలని ఇక్కడ చేరేడు. లేక బోతే పెద్ద లేబరేటరీ లో  ఉద్యోగము వచ్చిందిట. ఇంక యూనివర్సిటీ లో  పోస్టులే ఇవ్వటము లేదు.”

ఇప్పుడు తనకు చదువు కంటే ఆ అబ్బాయిని గూర్చి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అలా అని చదువులో అలక్ష్యము చూపించుట లేదు.  ఇంక వీలున్నపు డల్లా పోతన  పద్యాలను చదువుకుంటూ ఉండేది.
















Saturday, April 26, 2014

కుప్ప కూలింది

                                               
                                                       లేదా
                                            (we) share (your) market


        అది మధ్య తరగతికి చెందిన ఆవాసము(కాలని). ఉదయాన్నించి చాలా గందర గోళముగాఉన్నది. ఒక్కొక్కరింట్లో చాలా మంది చేరి, దీర్ఘముగా ఆలోచిస్తున్నారు. కొందరు, నిజానికి వచ్చే ఏడుపును అపేసుకుంటున్నారు. చాలా మందికి రేపు ఎలా చేయాలనేదే ప్రశ్న.
          ఒక ఇంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు అలోచించి పెట్టాలి. ఉన్న డబ్బులంతా  ఊ డ్చి తగలేసినారు. నెలలో  కూతురు పెళ్లి ఉన్నాది. భార్య చాలా ఆవేశముగా ఉన్నది.
          మరొక ఇంట్లో నెలలో యజమాని పదవీ విరమణ చేయ బోతున్నారు. కాస్త  జాగ్రత్తగా ఉండండి అని మొత్తుకుంటే విన్నారు కాదు., ముక్కులు ఎగ బీలుస్తున్నది.
          మరొక ఇంట్లో , నాకు కాసు బంగారము కొనమంటే, చూడు, ఒకటేమిటి, పది కాసులు కొని పెడుతాను చూడు. అన్నారు. ఏదీ, ఆ పది కాసులు అఖ్ఖర లేదు. ఆ ఒక్క కాసు కొని పెట్టండి చాలు., అన్నది ఇంటావిడ.
          వార్తా పత్రికలలో కొన్ని ఆత్మ హత్యల సమాచారము వచ్చినది. కానీ, రేడియో మరియు దూరదర్శన్ లలో ఆర్ధిక మంత్రి సుదీర్ఘమయిన ఒక ఉపన్యాసమిచ్చి, మీ పెట్టుబడులకు  మేము హామీ, అన్నీ పరిస్థితులు చక్క బదేతట్లు చూస్తాము అన్నారు. అయినా మార్కెట్ లో ఒడిదుడుకులకు మేము భాధ్యులము కాము అన్న హామీ ఆ యా కంపెనీల నుండి ఉన్నాది కదా.
          ఇప్పటికి అంతా అర్థమయిందనుకుంటాను, సమస్య ఏమిటో? ఆ రోజు ఒక్క సారిగా షేర్ మార్కెట్ వెయ్యి పాయింట్ల మీద కూలి పోయిందట. ఈ దెబ్బతో బాగా విలువ యున్న షేర్లను కుడా అమ్మి వేయడము మొదలు పెట్టినారు. అమ్మకాలకు డిమాండ్ పెరిగేసరికి సూచిక ఇంకా పడిపోతుందని అందరూ భయ పడుతున్నారు.  బ్రోకర్ల దగ్గిర , స్టాక్ మార్కెట్ దగ్గిర విపరీతముగా జనము చేరి పోయినారు.
          షేర్ మార్కెట్ ను ఆర్ధిక రంగములో ఒక అద్భుత మయిన ప్రక్రియ గా భావించే వారు చాలా మంది యున్నారు. కానీ, అది మానసిక ప్రపంచములో నడిచే సైకలాజికల్ గేమ్ గా అర్థము చేసుకో లేక పోతున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టె చాలా మందికి ఇది ఎలా నడుస్తుందో తెలియదు. తెలిసిన వారికి కావలసినంత తెలివి తేటలు చూపించి, ఎప్పుడూ ఏరును దాటేస్తుంటారు.
          మరి ఈ ప్రక్రియ ఎలా ప్రారంభమయిందో  నాకూ తెలియదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు.  కానీ, లోపల జరుగుతున్నదేమిటో మాత్రము తెలుస్తూనెఉన్నది.
          భౌతిక శాస్త్రములో ఎంట్రపి అనే పరిమాణము ఉన్నది. ఇది భౌతిక ప్రపంచములో జరిగే గందరగోళమునకు సూచిక. ఈ విశ్వము నడుస్తున్నంత సేపూ అది పెరుగుతూఅన్నా ఉంటుంది, లేదా స్థిరముగా ఉంటుంది.  మరొక మాటలో చెప్పాలంటే, ఈ విశ్వములో ప్రతి భౌతిక చర్య ఎంట్ర పి పెరిగే దిశలో నడుస్తుంది.  దీనినే ద్వితీయ ఉష్ణ గతి సూత్రము గా చెబుతారు. భౌతిక శాస్త్ర పరముగా ఇది ఖచ్చితమయినది. అయితే, తరువాత కాలములో కొన్ని చర్యలలో ఇది తగ్గుతుంది కొంత మంది సూత్రీకరించినారు. భౌతిక శాస్త్ర వేత్తలు దీనిని పూర్తిగా అంగీ కరించక పోయినా అది ఏమిటో ఈ వ్యాసములో కానీ తదుపరి వ్యాసాలలో దానిని గూర్చి చర్చిద్దాము.
          ఉష్ణ గతి భౌతిక విజ్ఞానములో ఎంట్రపి కి  దీటు వచ్చేది  వాణిజ్య ఆర్థిక విజ్ఞానములో షేర్ మార్కెట్ యొక్క సూచి. లేదా ఇండెక్స్. న్యాయము ప్రకారము ఇది కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి, లేక పొతే ఆ దేశము ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలినట్లే.  ఇది నిజమేనా?
          మాస్టారూ! మీరు పొరపాటు పడుతున్నారు,  ఎంట్రపి పెరగడమేమిటి, ఈ ఇండెక్స్ పడిపోవదమేమిటి? .ఇది ఒక  నిజముగా వివరించ వలసిన ప్రశ్న. కానీ దీనికి జవాబు రావాలంటే చాలా విషయాలు తెలియాలి. ఇక్కడ ఒక చిన్న కథను చెప్పుకుందాము.
          రంగయ్య, రాజయ్య మరియు రామయ్య మంచి స్నేహితులు.. ముగ్గురికి వ్యవసాయపు భూములు ఉన్నాయి. వరిని పండిస్తారు. వాళ్ళ ఊరిలో ధాన్యాన్ని బియ్యముగా మార్చే మర ఏమీ లేదు. ప్రతి దానికి ఎడ్ల బండి మీద పక్క ఊరికి వెళ్ళాలి.  ఒక రోజు రంగయ్య ఆలోచించినాడు. స్వంత ఊరిలొనె బియ్యపు మర ఉంటే బాగుంటుంది అని. బయట విచారిస్తే పదిహేను లక్షలు పెట్టుబడి అవసరమవుతుందన్నారు. మరి తన దగ్గిర అంతా సొమ్ము లేదు.  ఇద్దరు మిత్రులతో తన ఆలోచన చెప్పగానే చెరో అయిదు లక్షలు ఇస్తామన్నారు. వచ్చిన లాభాన్ని ముగ్గురూ సమానముగా పంచుకోవాలి అని, అనుకున్నారు.  చివరకు ఊరిలో ఒక బియ్యపు మర ఏర్పడింది. ఊరిలో ప్రధాన వృత్తి వ్యవసాయము కనుక లాభాలు బాగుగానే వస్తున్నవి. ముగ్గురూ సంతోషముగా ఉన్నారు. ఇక్కడే కొత్త సమస్యలు మొదలయినాయి.
          వీళ్ళ పరిస్థితిని చూచిన తరువాత మరికొంత మంది ఇంకొక బియ్యపు మరను పెట్టాలనుకున్నారు. తము కూడా ఉన్న వారితో కలిస్తే శ్రమ తగ్గుతుంది, లాభాలను పంచుకోవచ్చు అనుకున్నారు. తమ ఉద్దేశ్యాన్ని వారికి చెప్పినారు. ఇంతలో రామన్న కూతురు పెళ్లి నిశ్చయ మయినది. ఇందుకోసమై చేతిలో ఉన్న సొమ్ముకు అదనముగా మరో రెండు లక్షలు కావలసి వచ్చినది. ఆ సొమ్ము బియ్యపు మరలో తను పెట్టిన పెట్టుబడి లో తీసుకోవాలనుకున్నాడు. అలా తీసుకుంటే వచ్చిన ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి? అప్పుడు ఉన్న పెట్టుబడుల నిష్పత్తి లో పంచుకోవాలి అనుకున్నారు. అయినా పంపకము సులభము గా ఉండాలంటే పది రూపాయలను ఒక యూనిట్ క్రింద మార్చి, దానిని షేర్ అని అన్నారు. అంటే పదిహేను(౧౫) లక్షల రూపాయలు ఒక లక్షా పదిహేను వేల షేర్ లు అన్న మాట.
          ఇక్కడే పాశ్చాత్య సంస్కృతి ప్రభావము ఏర్పడింది. భారతీయ సంస్కృతి న్యాయమైన లాభాల గురించి మాట్లాడితే, పాశ్చాత్య సంస్కృతి గిరాకీ ని బట్టి లాభాలను గురించి మాట్లాడింది. అంటే గిరాకీని బట్టి ప్రజలు ఎంత ధరకు కొనడానికి సిద్ధ బడుతారో అంతకు అమ్మడము అన్న మాట. దీనినే వారి భాషలో మార్కెట్  ఎకనమి (వ్యాపార ఆర్దికత )అని అన్నారు. ఈ విధముగా ఎక్కువ డబ్బు పెట్ట గల వారికే మంచి సరుకు దొరుకుతుంది. మనిషికి అత్యవసర మయిన వైతే ఎంత ధర కయినా అమ్మ వచ్చు. ఉదాహరణకు రైల్వే ప్లాట్ ఫారమ్ లపై మంచి నీరును లీటర్ ఇరువది అయిదు రూపాయలకు అధికారికముగా అమ్మినా అడిగే దిక్కు లేని సంస్కృతి మనకు వచ్చినది. పకృతి ఇచ్చిన సంపద  పై వ్యాపారము పెరగడానికి వారు పెట్టె లక్షల రూపాయల ఖర్చు కూడా మనమే ఇచ్చుకోవాలి కదా! పది రూపాయల లోపు అమ్మబడే విక్స్ కోసము ఎన్ని లక్షల రూపాయలు ప్రకటనలకు ఖర్చు పెడుతున్నారో గమనిస్తే తెలుస్తుంది.
          కాపిటల్  లేదా పెట్టుబడి రెండు రకాలుగా లెఖ్ఖ కట్ట వచ్చును.మన పద్ధతిలో అక్కడ నికరముగా యున్న సంపద విలువను బట్టి లెక్క కడుతాము. ఇది న్యాయమైన మార్గము. వాటాలు తీసుకొనే వారు ఎంత విలువకు కొన్నారో, దాన్ని అనుసరించి లెఖ్ఖ కట్టడము ఇప్పుడు అనుసరిస్తున్న పధ్ధతి. దీనిని ప్లావిత విలువ లేదా ఫ్లోటింగ్ వాల్యు అని అనాలి. ఇది ఇప్పుడు అనుసరించ బడే పధ్ధతి. అంటే ఇప్పుడు పది లక్షలున్న వ్యాపారము రేపు వాటా లేదా షేర్ విలువ పడి పొతే పది వేలు గా లెఖ్ఖ కట్ట బడ వచ్చును. ఇటువంటి మార్పులు వచ్చిన తరువాత మానవ విలువలు పడి పోవడము మనము స్పష్టముగా గమనించ వచ్చును. ఈ నాదు కొన్ని ప్రాంతాలలో జనము కొనక పండ్లు కుళ్ళి పోయినా వదిలి వేస్తున్నారు, కానీ, ధర తగ్గించి అమ్ముట లేదు. అమెరికా లో ఒక సారి, పంటలు ఎక్కువ పండితే మార్కెట్ లో ధరలు పడిపోఆయని పంటను సముద్రము పాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది మార్కెట్ ఎకనమి ప్రభావము. భారత దేశములో దీనిని మహా పాపముగా భావించే వారు. కానీ ఆ సంస్కృతి ప్రభావము ఇప్పుడు మన రక్తములో కూడా కలుస్తున్నది.
          మన కథలోనికి తిరిగి వెళ్దాము.  సీనన్న కొంత పెట్టుబడి పెట్టాలని అనుకున్నాడు. దీనితో బాటు మరికొందరు షేర్లు కొనాలనుకుంటున్నారు.  అంటే షేర్ కు డిమాండ్ లేదా గిరాకీ పెరిగింది. అప్పుడు పడి రూపాయల షేర్ ముప్పది రూపాయలకు అమ్ముతామని అంటారు.  అంటే పదిహేను లక్షల ఆస్తి నలుబది ఐదు లక్షల ఆస్తిగా మారి పోతుంది. దీనినే షేర్ మార్కెట్ లో లాభము వచ్చిందని అంటారు.
          ఇక ధాన్యము మిల్లును వదిలి వేద్దాము. ఒక ఎలెక్ట్రానిక్ పరిశ్రమ కు వెళు తాము.  పోటీ  వలన వ్యాపారములో  ఒడిదొడుకులు సహజము గా వస్తాయి. లాభము బాగా వచ్చినపుడు తగిన నిష్పత్తిలో పంచుతారు. లేదా అధికారికము గా షేర్ విలువ పెంచు తారు. ఈ విధముగా షేర్ విలువ రెండు రకములుగా పెరుగ వచ్చును, ఒకటి, వచ్చే లాభాల వలన లేదా ఆ  షేర్  లకున్న గిరాకీ వలన. ఇక్కడే మానసిక ప్రవర్తన ప్రభావము కనిపిస్తుంది.  పది రూపాయల షేర్ వంద రూపాయలకు అమ్మినపుడు సంస్థలలో మనకు పంచ బడే లాభాలు అవే నిష్పత్తిలో ఉండవు.  అంటే  తక్కువ రేటు కు కొన్న షేర్ ఎక్కువ రేటు కు అమ్మితేనే లాభాలు, అందు వలన షేర్ విలువ పెరిగితేనే ఆదాయము మరియు లాభము. అందువలన షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె వారు  ఎక్కువగా  వ్యాపారములో లాభము కంటే షేర్ అమ్మి లాభము సంపాదించాలనే అనుకుంటారు. అంటే లాభాలు రావాలంటే షేర్ విలువ పెరుగుతూనే ఉండాలి. అది ఆగి పోయిందా పెట్టుబడులు పోతాయి.
          మరి ఇక్కడ జనము ఎలా మోస పోతారు? ఒక వ్యక్తీ ఎక్కువ పెట్టుబడి పెట్టి నాలుగు రోజులు తన మనుషుల చేత వరుసగా షేర్ లు కొనిపిస్తాడు. ఈ విధముగా ఆ షేర్ విలువ పెరుగుతుందన్న అభిప్రాయము అందరికి కలిగిస్తాడు.  దీనితో జనము ఎగ బడి ఆ  షేర్ లు కొంటారు.  దీనితో ఆ షేర్ విలువ విపరీతముగా పెరుగుతుంది. ఇదే అదునుగా తీసుకొని మొదట షేర్ లు కొన్న వ్యక్తి తను కొన్న షేర్ లు ఎక్కువ గా అప్పుడున్న రేటు కు అమ్మి వేసి లాభాలు తన ఖాతా లో వేసుకుంటాడు. ఎప్పుడయితే ఈ వేగము తగ్గుతుందో షేర్ విలువ పడి పోవడము మొదలవుతుంది. ఈ విధముగా తరువాత షేర్ లు కొన్న వారి కి నష్టము వస్తుంది. ఈ విధముగా  హర్షద్ మెహతా మొదలుకొని ఎంతో మంది స్టాక్ మార్కెట్ ను మోసగించినారు. ఈ విధముగా మధ్యలో షేర్ లు కొన్న వారంతా నెత్తిన గుడ్డను వేసుకుంటారు. ఇటువంటి మోసాలను నియంత్రించడానికే  సెబి ఏర్పడింది. ఇది చైన్ స్కీమ్ లేదా గొలుసు పధ్ధతి లో జనాన్ని ఆకర్షించే లానే ఉంటుంది.
          ఈ సంస్థలలో వచ్చే లాభాలలో కొంత మూల ధనానికి వెళితే సహజముగా షేర్ విలువ పెరుగుతుంది.  ఇదే కారణము వలన నష్టాలలో నడుస్తున్న సంస్థలలో షేర్ విలువ పడి పోతుంది. ఒక్కొక్క  షేర్  మార్కెట్  లో కొన్ని సంస్థలు తమను నమోదు చేసు కుంటాయి. ఈ సంస్థల సగటు ఆదాయమును బట్టి ఆ మార్కెట్ యొక్క సూచి మారుతుంది. సూచి మరీ పడి పోతే షేర్ మార్కెట్ నష్టాలలో పడి పోతుంది. నిజాయితీ లోపించి నప్పుడు కృత్రిమముగా షేర్ విలువ పెంచాలని చూస్తారు. ఈ ప్రయత్నాలు తాత్కాలికముగా ప్రయోజనాన్ని ఇచ్చినా తరువాత ఆర్ధిక వ్యవస్థ మీద గట్టి దెబ్బ కొడుతుంది.
          సామర్థ్యము లేని డబ్బున్న ప్రతి వాడికి పరిశ్రమలు పెట్టడానికి అనుమతి ఇస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆర్ధిక వనరులు, స్థలము, మూల వసతులు అత్యంత ప్రధానమయినవి. అటు తరువాత బయటకు వచ్చే పరికరాలకు బయట పోటీ ఉత్పత్తి ఏమయినా యున్నదా? ఆ పోటీ కి తాము తట్టుకొన గలరా,  తమ పోటీ గా తయారవుతున్న పరికరాలలో తమ వాటి కంటే ప్రత్యేకతలు ఏమయినా ఉన్నాయా, ఇటువంటి వాటిని పరిశీలించాలి.  ఇందులో వాడే ముడి పదార్థాలు అందు బాటులో ఉన్నాయా, వ్యర్థ పదార్థాలు ఏర్పడుతాయా, వాటి వలన పర్యావరణానికి ఏమయినా హాని యున్నదా, ఇటువంటి వాటికి సమాధానము రాబట్టు కోవాలి. విలువయిన నీటిలో తమ మురికిని వదలి ఎంతో మిగుల్చుకో వచ్చును. కానీ అదే నీరు లీటర్ పాతిక రూపాయలు పెట్టి బయట జనము కొనుక్కోవాలన్న విషయాన్ని  విస్మరించ కూడదు. కొన్ని ఎలెక్ట్రానిక్ పరిశ్రమలలో ఆర్సెనిక్ లాంటి విష పదార్థాలు వాతావరణము లోనికి వెళుతున్నవి. వీటి వలన పరిసరాలలో యున్న జనానీకము మీద దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడా వచ్చును.  అందు వలన చుట్టు ప్రక్కల జనాలలో వ్యతిరేకత వచ్చి  ఆ పరిశ్రమను మూసి వెయ వలసిన పరిస్థితులు రావచ్చును.
          మరొక విషయము గుర్తు పెట్టుకొన వలసి యున్నది. తమ ఉత్పత్తుల వినియోగములో ప్రధాన భాగము ఆ దేశము లో యుంటే మంచిది. లేక పొతే అమెరికన్ మార్కెట్ కొఱకు ఉత్పత్తి చేసిన చైనా ఉత్పత్తులు అమెరికన్ ఆర్ధిక స్థితి పడిపోగానే తను నష్ట పోతుంది. ఇదే పరిస్థితులు ప్రతి యొక్కరికి రా వచ్చును.
          సత్య సాయి బాబా గారు ఒక విషయాన్ని స్పష్టము చేసే వారు. వ్యాపారము ధర్మము ఆధారముగా జరగాలి. ఇదే విషయాన్ని ఆయన తన భక్తులకు నొక్కి చెప్పే వారు. ధర్మానికి వ్యాపారానికి పొత్తు కుదరదని ఎక్కువ మంది చెబుతున్న ఈ రోజుల్లో ఆయన ఆలోచనను అనుసరించిన వారు ఖచ్చితమయిన విజయాన్ని సాధించినారు. ఇందులో స్వదేశీయులు  మరియు విదేశీయులు కూడా ఉన్నారు. మన వ్యాపారము వినియోగ దారుడి నమ్మకము మీద ఆధార పడాలి. అంతే కాని మన గుప్పించే ప్రకటనల మీద కాదు.
          ఒక సోనీ సంస్థలో ఒక ఉత్పత్తిలో నాణ్యము తగ్గినది. పరికరము అప్పటికి పని చేస్తుంది. కానీ సోనీ యజమాని ఒక మాట చెప్పినాడు. ఎంత నష్టము వచ్చినా ఆ ఉత్పత్తులు మార్కెట్ లోకి ప్రవేశించ కూడదు,అని. ఎందుకంటే సోనీ ఉత్పత్తులు అత్యున్నత ప్రమాణాలతోయున్నాయన్న నమ్మకాన్నిపొగొట్టు కొనకూడదు. ఇటు వంటి నియమాలతో కూడిన సంస్థలు స్టాక్ మార్కెట్ ప్రవేసిస్తే సూచీ ఎప్పుడూ పైకే ఉంటుంది.
          విలువలు లేనపుడు స్టాక్ మార్కెట్ పడి పోతూనే ఉంటుంది, ఎంత లేపినా సరే.


Wednesday, April 9, 2014

బుడగ తామర

                                                       

 నా పేరు బుడగ తామర. బహుశా మీరు తెలుగు పదాలను మరిచి పోయి ఉంటారు. అందరూ నన్ను వాటర్ హేసెన్త్ అని అంటున్నారు. ఇప్పటి ఆధునిక ప్రపంచములో నా మీద చాల ఆరోపణలు మరియు నిందలు వస్తున్నాయి. ఎప్పుడూ నీటిలో ఉండే నేను నీటి ప్రవాహానికి అడ్డు వస్తున్నానుట. నా వలన నీటి ప్రవాహము ఎక్కువయి  వరదలు వచ్చే పరిస్థితులు వచ్సినాయిట. ప్రతి సారి నన్ను తొలగించడానికి చాలా ఖర్చు పెట్ట వలసి వస్తున్నాదిట. ఇంతకూ ముందు అలా తీసి పడేసే వారు. ఇప్పుడు ఏవో విష పదార్థాలు చల్లి నన్ను చంపేస్తున్నారు. లూయీస్ పాశ్చర్ ఏమి మాయ చేసాడో కానీ, ప్రతి దానికి విష పదార్థాలు వాడి భూమిని విష పూరితము చేయడము బాగా అలవాటు అయింది. ఇపుడు మీరు ఉన్న వేగములో నేను ఏమి చెప్పినా మీకు వినే ఓపిక ఉన్నదని నేను అనుకోను, అయినా చెప్పడము నా భాద్యతగా భావించి విషయము చెప్పాలని అనుకుంటున్నాను.
          సుమారు ముప్పది లేక నలువది ఏళ్ల క్రిందట, మేము  ఎక్కడో చెరువులలో, నూతులలో, ఒక మూల ఉండే దాన్ని. అసలు మేమున్నామన్న విషయము మాకు తప్ప మరొకరికి తెలిసేది కాదు. క్రమ క్రమముగా  నగరాలు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు వచ్చినవి. పల్లెలకు నగరాలు పాకిన తరువాత  పంట కాలువల పక్కనే పెద్ద భవనాలు వచ్చినాయి. అప్పుడు ఆ నీరు పొలాలకు పోవడమే కాదు. దారిన పోయే వారు ఎవరయినా దాహము వేస్తె నేరుగా కాలువలో నిరు త్రాగే వారు. ఆ పని ఇప్పుడు మీరు చేయండి, మీరు వైద్యుడి దగ్గిరకి వెళ్ళాలా, కాటికి వెళ్ళాలా అనే విషయము మీకే తెలియదు.  ఇప్పుడు సమస్య మరో రకముగా వచ్చినది.  ఈ పంట కాలువల  ప్రక్కన వచ్చిన భవనాల నుండి వచ్చిన నిషిద్ద మల మూత్ర పదార్థములతో కూడిన నీరు నేరుగా ఈ కాలువల లోనికి వదలుట మొదలు పెట్టినారు. ఈ విధముగా ఒకప్పుడు అందరు త్రాగే నీరు అపరి శుభ్రము అయినవి.
          వృక్ష జాతికి చెందిన మేము ఎప్పుడూ ప్రకృతిని శుభ్రము చేయుటకే ప్రయత్నమూ చేస్తున్నాము. మీకు గుర్తు ఉంటే ఒక చిన్న తామర జాతికి చెందిన చిన్ని మొక్కలను నూతిలో నీళ్ళలో వేసే వారు. వాటి వలన నీరు శుభ్ర పడడమే కాదు, నీరు ఎంతో తియ్యగా తయారు అయేది. సీసాల్లో నీళ్ళు తప్ప వేరే నీరు తాగని మీకు అవి ఎక్కడ గుర్తు ఉంటాయి లెండి? మరొక విషయము చెప్పాలి. ఇది కొన్ని దశాబ్దాల క్రిందట జరిగినది. ఈ సంఘటన హిందు అనే ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసముగా వచ్చినది. కాస్త జ్ఞాపక శక్తి యున్న వారికి ఈ విషయము గుర్తుండే యుంటుంది. ఒక విదేశీ యాత్రికుడు ఉదక మండలము కొండల పైన వాహ్యాళి చేస్తున్నాడు. బాగా దాహము వేసినది. అంతా చూచినాడు. ప్రక్కనే కొండ పై భాగము నుండి జల ధార వస్తున్నది. చేతులతో పట్టుకొని త్రాగినాడు. నీరు చాలా రుచిగా ఉన్నది. త్రాగిన  తరువాత అనుమానము వచ్చినది, ఇప్పుడు వర్షా కాలము కూడా కాదు కదా! ఈ నీరు ఎక్కడినుండి వచ్చినది? అని. ఆ నీటి ధార ప్రక్కనే నెమ్మదిగా కొండ పైకి ఎక్కినాడు.  కొండ పైకి చేరిన తరువాత ఆశ్చర్య పోయినాడు. ఎందుకంటే ఆ నీరు పైన యున్న అతిథి గృహము నుండి బయటికి వస్తున్న మురికి నీరు . అక్కడ భయంకరముగా దుర్వాసన వేస్తున్నది. తనకు ఏ జబ్బు వస్తుందో అని భయము వేసినది. వెంటనే తను నీరు త్రాగిన చోట నీరు సీసాలో పట్టి  రసాయనిక విశ్లేషణ కు పంపించినాడు. అది ఏ దోషము లేని మంచి నీరు అని వారు తేల్చి చెప్పినారు. అంటే ఆ నీరు ఆ వాలులో గడ్డి పైన దిగుతున్నపుడు  శుభ్ర పడినాయన్న మాట.
                   మ ళ్ళీ చెబుతున్నాను, మా వృక్ష జాతి వలన మీకు మేలు జరుగుటున్నదే కాని, కీడు జరుగుట లేదు. ఈ నాడు పట్టణాలు పల్లె ల లోకి పెరిగిన తరువాత పంట కాలువల ప్రక్కన భవనాలు బాగా పెరిగినవి. ఆ భవనాల లోని
మురికి నీరు అంతా పంట  కాలువల లోనికి వదులుతున్నారు. ఈ విధముగా పంట కాలువల లో మురికి ఎక్కువగా చేరినపుడు, మేము అక్కడ చేరుతున్నాము. మీరొక సారి పరీక్ష గా చూడండి. మా ఆకుల క్రింద నీరు  మా వెలుపల యున్న నీరు పరీక్ష గా చూడండి. మా క్రింద నీరు ఎంత శుభ్రముగా యుందో  మీకు తెలుస్తుంది. అంతే కాదు, కొన్ని రకాల విష మూలకాల నుండి భూమి పై  మట్టిని మేము శుభ్రము చేస్తాము. నీరు శుభ్రము చేయడములో మా సంఖ్య సరి పోవుట లేదు. అయినా మా సంఖ్య ఎక్కువయి వరదలు వస్తున్నాయి అని అంటున్నారు. రహదారులు పూర్తిగా జనముతో నిండి పోయినపుడు మీరు వేగముగా ఆ దారిలో వెల్ల గలరా?
          మిమ్ములను గూర్చి నేను చెబితే మీకు చాలా కోపము వస్తుంది. అయినా చెబుతాను. నేను చెప్పేవన్నీ మీకు తెలియనివి కాదు.
          ఒకప్పుడు ధర్మము నాలుగు పాదాలలో నడిచే రోజులలో ఒక ఋషి యాత్ర లోయున్నాడుట. విపరీతముగా ఆకలి వేసినది. భిక్ష కోసము చూస్తే పరిసరాల్లో ఎవరూ లేరు. ఎదురుగా ఒక మామిడి తోట కనిపించినది.  బాగుగా పండిన మామిడి పండ్లు చెట్లకు వ్రేలాడుతున్నవి. వాటితో ఆకలి తీర్చుకోవాలని చుట్టు పక్కల తోట మాలి కోసము వెదికినాడు. ఎవరూ కనిపించ లేదు. ఆకలి భరించ లేక ఒక పండు కోసుకొని తిన్నాడు. కాస్త ఆకలి తీరగానే తనలో  తప్పు చేసినానన్న భావన విపరీతముగా పెరిగినది. ఎవరి అనుమతి లేకుండా తను తిన్న పండుకు తను ఎంత దుష్కర్మను అనుభవించ వలనో అని అనిపించినది.
          వెంటనే ఆ ప్రాంతమును ఏలుతున్న రాజు దగ్గరికి వెళ్ళినాడు.  యజమాని అనుమతి లేకుండా పండు కోసుకొని తిన్నందుకు, ఆ దొంగ తనానికి తనను శిక్షించ వలసినదిగా కోరినాడు. ఆ రాజు ఇతడిని చూచినాడు, గొప్ప తపస్విలా కనిపిస్తున్నాడు. ఇతడిని శిక్షింప గలిగిన శక్తిమంతుడు కాదు తను. అదే మాట అన్నాడు. అతడు మరీ బలవంతము చేస్తే తన ఆస్థానములో పని చేస్తూ ధర్మ శాస్త్ర కోవిడుదయిన బ్రాహ్మణుడిని పిలిపిస్తాడు. ఆ తపస్వి ఇతడి తమ్ముదేనని అప్పుడు తెలిసినది. అతడి సలహా మీద తపస్వి పండు కోసిన చేతిని ఖండించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అన్న తన తమ్ముడిని దగ్గిరలో యున్న ఒక నది లో మునిగి లెమ్మని చెబుతాడు. అతడు అలా చేసేసరికి ఆని చేయి తిరిగి వస్తుంది.  
ఆ నదిని తరువాత బాహుదా నది పేరుతొ పిలిచినారు. బాహుదా అంటే చేతులను ఇచ్చినది అని అర్థము. అది యొక పవిత్రమయిన నదిగా పేరు కన్నది. అదే నది ఈ నాడు చిత్తూరు పట్టణము మధ్యలో ఒక మురుగు కాలువ వలె పారుతున్నది. వాయు పురాణములో ఒక పవిత్ర మయిన నదిగా పేరు కన్న గోస్తని నది ఇప్పుడు పరిశ్రమల మురికిని భారముగా మోసుకొని వెళుతున్నది. మీరే చెప్పండి, నేను నేను చెప్పేది నిజమే కదా!
          ఒకప్పుడు ఇంటి చుట్టు చెట్లుంటే చాలా మంచిదను కొనే వారు. ఇప్పుడు ప్రాకారము లోపల చెట్లుంటే రోజు వాటి ఆకులను చిమ్మాలిట, ఇది చాలా శ్రమతో కూడిన పని అట. మరి మీరు వాడే ప్లాస్టిక్ మురికి కంటే మా మురికి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నదా? మా వృక్ష జాతి వదిలే ఆకులు మట్టిలో కలిసి కరిగి పోతాయి. మరి ప్లాస్టిక్ అలా కలుస్తుందా? మా చెట్లు మీకు ప్రాణ వాయువు ను ఇస్తున్నది, వేసవిలో చల్లని నీడను ఇస్తున్నది, పండ్లు, కాయలు ఇస్తున్నది. అంతే కాదు, మీకు బాగా నీరసముగా యున్నపుడు యాచిస్తే ప్రాణ శక్తిని కూడా చాలా సంతోషముగా ఇస్తుంది. ఇదే మా జాతి యొక్క ప్రత్యేకత.
          ఇంత వఱకు నా గురించి చెప్పుకున్నాను. మీ గురించి చెప్ప వలసినది చాలా యున్నది.
          చెట్లను నరకి వేస్తున్నారు. అడవులు తగ్గిపోతున్నాయి. అందువలన సక్రమమయిన వర్షాలు తగ్గి పోయినాయి. మురికినంతా నీటి ప్రవాహాలలో వదిలి వేస్తున్నారు. కీటకాల పేరు చెప్పి పొలాలన్నీ విషమయము చేస్తున్నారు. నీటిని మురికి చేయకుండా యుంటే మీకు నీటి కరువు ఎక్కడున్నది? ఇంట్లో మురికిని కాలువలలో కల్పి వేసి చేతులు విదిలించి వేసుకుంటున్నారు. కానీ, తము మురికి చేసే నీళ్ళకు బదులుగా త్రాగే నీటిని లీటర్ ఇరువది రూపాయలకు అమ్ముతున్నారన్న విషయాన్నీ మఱచి పోయినారు. ఇన్ని నదులు కలిగి యున్న మన దేశములో మంచి నీటిని అమ్మే స్థితికి తీసుక వచ్చిన పాలకులు దేశాన్ని సిగ్గు పడే స్థితికి తీసుకు వచ్చినారు. ఈ నాడు ఆన కట్టలను కట్టడానికి అయే ఖర్చులో కొంత భాగము మురికి నీరు శుభ్రము చేయడానికి కాక నీరు మురికి చేయకుండా చేసే మంచి పద్ధతుల కొఱకు పరిశోధనలు చేస్తే దేశము బాగు పడుతుంది.
          మేము నీటిని శుభ్రము చేయాలని ఎంత ప్రయత్నము చేసినా మురికిని తాయారు చేసే మీ వేగాన్ని అందుకోలేక పోతున్నాము. అయినా మీ చేత శత్రువులుగా భావించ బడుతున్నాము.  మీరు శుభ్రతను నేర్చుకొని మన భూమికి సహకరిస్తారన్న ఆశతో-----------మీ బుడగ తామర.

         



Sunday, March 23, 2014

గీతాంజలి ౨౦


కుసుమించినదది కమలమ్మని
నే గుర్తించగ లేదు.
ఎదలో రగిలే మథనము లో నే
విరులను చేర్చగ లేదు.
మెల మెల్లగ సోకెను దక్షిణ గాలులు
చల్లగ మేల్కొలుప
వ్యథ తో నిండిన హృది నది లేపెను
తీయని విరి తావి
తవి తీరని కోర్కెలు రేపెను నాలో
చల్లగ పూ తావి
గ్రీష్మర్తువు యొక్కచవరి దశ
దరి చేరినదని తెలియకనే మది
మాధుర్యము సోకె

ఎదఅంచుల తాకె. 

Monday, March 17, 2014

దోమ

                                                                                      
ఏమండోయ్ నేనే, దోమను. కొందరు నన్ను మశ్చికం అంటారు. వాళ్లకు కొంత భాషాభిమానము ఎక్కువ లెండి. సింపుల్ గా నన్ను దోమ అంటే చాలు. మా జాతి మీద మీకు చాలా కోపముగా యున్నది. ఆ విషయము మీకూ  తెలుసు. అది సహజము కూడా. ఎందుకంటే మేము రక్త పిశాచ జాతికి చెందిన వాళ్లము. అంటే అన్ని రకాల జీవుల రక్తము మీద జీవిస్తాము కాబట్టి. అయినా మేము మానవ జాతి యొక్క దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నామంటే మీరు ఆశ్చర్య పోతారు. కానీ, నిజాము మాత్రమదే.
సుమారుగా ఏబది ఏళ్ల క్రిందట  పల్లెటూళ్ళలో ఆరు బయట చల్లని గాలిలో  మంచాలు వేసుకొని పండుకొనే వారు. ఎందుకంటే అప్పుడు మా జనాభా అంతగా పెరగ లేదు. ఇప్పుడలా పండుకోంది చూద్దాము. మా జనాభా మిమ్ములనలా పండుకోనిస్తున్దేమిటి? మాకు మీ రక్తముతో బాటు మురికి పదార్థాలు అన్నా ఇష్టమే. అందుకీ మా గుడ్లను మురికి గుంటల లోనే పెడుతాము. ఆ రోజుల్లో నత్తలు కప్పలు నేరుగా వచ్చి మాగుడ్లను తిని వేసేవి. వాటిని తప్పించుకొని పగిలిన గుడ్లే మా జాతిని నిలిపేవి. ఆ సమయములో మా జాతి అందుకే వేగముగా పెరిగేది కాదు.
ఈ విషయము లోనే మేము మేము మానవ జాతికి ఏంటో ఋణ పడి యున్నాము. ఎందుకంటే వాళ్ళు పరిశోధనలకనీ, వంటల కనీ కప్పలను ఖాళీ చేయించేసినారు. అంతే కాక చేపల చెరువుల్లో ఆహారము గా వేయుటకై నత్తలన్నిటినీ ఏరి, చితగ కొట్టి వేసేస్తున్నారు. దీనితో మాకు ప్రాథమిక శత్రువులు పోయినారు.
పాత రోజుల్లో ఇళ్ళల్లో సాంబ్రాణి లాంటి ధూపాన్ని తరచుగా వేసే వారు. ఆ వాసన మాకు అసలు పడదు. అందుకని మేము లోపలి ప్రవేశించే వాళ్లము కాదు. ఇప్పుడు బొగ్గులు పొడి చేసి అందులో సాంబ్రాణి వేసి ధూపము వేయాలంటే మీకు బాగా బద్ధకము వచ్చేసింది. దీనితో మాకు బాగా స్వాతంత్రము వచ్చేసింది.
          మా వలన మలేరియా లేదా చలి జ్వరము వ్యపిస్తున్నాడని తెలిసిన తరువాత మేమంటే జనానికి భయము పెరిగినది. ఆ తరువాత వ్యాధుల పట్టీలో డింగీ బర్డ్ ఫ్లూ లాటి విష జ్వరాలు చేరిన తరువాత  మమ్ములను నియంత్రించుటకై బజారులో పొగ చుట్టాలు, కిరసిన్న్ పొగ డబ్బాలు చాలా వచ్చినాయి. వాటి దెబ్బకు మా దోమలు చాలా చని పోతున్నాయి. అయితే ఇప్పటికీ జనానికి అర్థము కానిదొకటి యున్నది. దోమ నివారణ రసాయనాలు  పెరిగినాయి, దోమలు కూడా చాల చని పోతున్నాయి, అయినా మా సంఖ్య పెరుగుతూనే యున్నది.అది మీకు పూర్తిగా అర్థము కావుట లేదు.
అంతకంటే గమ్మత్తయిన విషయమున్నది. దోమలకు రోగ నిరోధక శక్తి కూడా పెరిగినది. ఇంతకుముందు కొద్ది మోతాదుకు చని పోయే దోమలు ఇప్పుడు ఎక్కువ మోతాదుల విషాన్ని కూడా తట్టుకొన గలుగుతున్నవి. ఈ విషయములో నా చిన్న బుఱ్ఱకు తోచినదొకటే. విష ప్రయోగము వలన కొన్ని బలహీనమయిన దోమలు చని పోయిన కొలదీ మిగిలిన దోమలకు దొరికే ఆహారము పెరిగి వాటి శక్తి కూడా పెరుగుతున్నది.మరొకటేమిటంటే మీ లోని కొంత మంది శాస్త్ర వేత్తలు చెపుతున్న దాన్ని బట్టి, (మ్యుటేషన్  అనబడే జీవ లక్షణమును అనుసరించి ) మా యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతున్నది. అందుకనే మీ విష పదార్థముల ప్రభావము తగ్గిపోతున్నది. మీ ఓర్పు మరీ తగ్గి పోయి మమ్ములను పూర్తిగా నాశనము చేయాలన్న కసి కొద్దీ  మీరు భూమిని విష పదార్థములతో నింపి వేస్తున్నారు.
ఒక మహర్షి చెప్పినారు, మీరు మరొకరిని పరోక్షముగా నిందించుట వలన ఏర్పడే శక్తి మాకు బలాన్ని చేకురుస్తున్నాదని. అది, నిజమో కాదో నా చిన్ని బుఱ్ఱకు అర్థము కాదు, కానీ,భౌతిక వాదముతో కొట్టుక పోతున్న మీకు ఈ విషయాన్ని అంగీకరించే శక్తి లేదన్న మాట మాత్రము నిజము. 
మధ్యలో మరొక సరాగము. ఇటీవల ఈగ అనబడే పేరుతొ సినీమా వచ్చినది. చని పోయిన కథానాయకుడు ఈగ దేహములో చేరి పగ తీర్చుకుంటాడు. అంత పగను పెంచుకొని ప్రతి నాయకుడిని గుర్తుంచుకొనే శక్తి ఈగ మెదడుకు ఉందా? నాకు అర్థము కాలేదు. అది వీలయితే రేపు నేను కూడా అలాటి పనులు చేయ వచ్చును .
మళ్ళీ ఎపుడో కలుద్దాము.

మీ చిన్ని దోమ.