Saturday, October 3, 2020

ప్రేమ కథ

 


అందరికీ ప్రేమ కథలు అంటే ఆసక్తి. విఫల మయిన ప్రేమతో పాత్రలు బాధ పడుతుంటే చూచే వాళ్ళు కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తుంటారు. మన పురాణాల లో కూడా చాలా ప్రేమ కథలున్నాయి. వాటిని గురించి ఎక్కువ మందికి పూర్తిగా తెలియదు. వాటిని గమనిస్తాము. అందు లో రురువు ఒకరు.

చ్యవన మహర్షి యొక్క మనుమడు రురువు. ఈ  చ్యవనుడే ఆరోగ్య వర్ధకము అయిన చ్యవన ప్రాసకు మూల పురుషుడు. స్థూల కేశ మహర్షి యొక్క దత్త పుత్రిక అయిన ప్రమద్వరను రురువు ప్రేమిస్తాడు. రురువు యొక్క కోరికను అంగీకరించి స్థూల కేశ  మహర్షి వివాహ ముహూర్తమును నిర్ణయిస్తాడు.

ప్రమద్వర పెళ్ళికి ముందే తన స్నేహితురాండ్రతో ఆటలలో ఉన్నపుడు పాము కాటుకు గురి అవుతుంది. కళను కోల్పోయి విష ప్రభావముతో ప్రమద్వర మరణిస్తుంది.

ప్రమద్వర మరణము తో విలపిస్తూ రురువు రేయింబవళ్ళు పిచ్చి వాడిలా తిరుగుతాడు. రేయింబవళ్ళు విలపిస్తాడు. అప్పుడు ఒక దేవత రురువుకు కనిపించి తన ఆయుస్సులో సగము ఆయుస్సును ధార పోస్తే ప్రమద్వర జీవిస్తుందని చెబుతుంది. దీర్ఘాయుష్కుడు అయిన రురువు తన ఆయుస్సులో సగమును ప్రమద్వరకు ధార పోస్తాడు. యమ ధర్మ రాజు అందుకు అంగీకరించి ప్రమద్వరను జీవింప చేస్తాడు.

మరొక కథ సావిత్రిది. అల్పాయుష్కుడు అని తెలిసి కూడా తను సత్యవంతుడ్ని ప్రేమించి పెళ్లి చేసు కుంటుంది. అదీ తల్లి దండ్రుల అభిప్రాయానిక్ వ్యతి రేకముగా.  అడవిలో ఒకరోజు సత్యవంతుడు మరణిస్తాడు. భర్త ప్రాణాల కోసము యమ ధర్మ రాజు వెంట బడి, భర్తను బ్రదికించుకుంటుంది. మానవాళికి ఆరాధ్య దేవత అవుతుంది. ఈమె కథనే అరవింద రిషి ఆంగ్లములో అద్భుతముగా వ్రాసినాడు.

మన పురాణాల్లో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నల దమయంతులు, శకుంతలా దుష్యంతులు మొదలయినవి. వీరందరూ ఎన్నో కష్టాలు పడినారు, ఓటమిని అంగీకరించ కుండా పోరాడి విజయాన్ని సాధించినారు. చరిత్రలో నిలబడి పోయినారు.

ఇక లైలా మజ్నూ, రోమియో జూలియట్ లాటివి విదేశాలలో, ఇక మన దేశములో కృత్రిమమముగా కల్పించ బడిన అనార్కలీ, ముంతాజ్ మహల్ లాటి వారు. లైలా మజ్నూ లు ఏడుస్తూ మరణిస్తారు. ఇంకా అనార్కలి అసలు మరణించ లేదని నుర్జేహాన్ పేరుతొ సలీమ్ నే పెళ్లి చేసుకుందని కొన్ని కథలున్నాయి.

ఇంక  షా జెహాన్ కు ఉన్న పెద్ద జనాభా కలిగిన భార్యలో ముంతాజ్  ఒకరు. ఆమె తను రాణిగా ఉన్న కొద్ది కాలములో అవిశ్రాన్తముగా సంవత్సరానికి ఒకరు చొప్పున పదునాలుగు మంది పిల్లలకు తల్లి అయి ఆఖరి కాన్పులో భరించ లేని బాధతో మరణిస్తుంది. షా జెహాన్ కు ఆమె అంటే అంత ప్రేమ. మేవాడ్ రాజుల రాజ మహల్ ను తాజ్ మహల్ గా మార్చి, ఆమె సమాధిని అందులో ఉంచారన్నది నిర్వివాదాంశము. దానిని అమర ప్రేమగా, కొన్ని సంవత్సరాను కష్ట బడి తాజ్ మహల్ నిర్మాణము చేసినారని కొంత మంది కథలు చెబుతారు.

వీటి ప్రేరేపణతో వచ్చిన మరొక ప్రేమ కథ దేవదాసు.,బెంగాలీ రచయిత శరత్ చేత వ్రాయ బడినది. ఇందులో నాయక నాయికా  పత్రాలు బాగా బలహీనమయినవి. వాటిని చూచిన వారి మనస్సులను బలహీన పరుస్తాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావము వారిని అమర ప్రేమికులుగా మార్చింది.

మనిషిలో ప్రేమ తొటి జీవులను బ్రదుకనిస్తుంది. ప్రేమికుల ప్రేమ కూడా ఓటమిని అంగీకరించదు. మరి ఈ ఆధునిక ప్రేమ జీవుల  కథలు వారి అభిమానులను ఎందుకూ పనికి రాని బలహీనులుగా మారుస్తాయి. ఇది నా అభిప్రాయము మాత్రమె.

ఒప్పుకుంటారా?

Monday, May 11, 2020

ఆంధ్రా పూరీ


                                                            

          పూరీ జగన్నాద్ గారు తమ అబ్బాయి నాయకుడిగా ఒక సినిమా తీసినాడు. దాని పేరు ఆంధ్రా పోరి. ఆంధ్రులలో పోరీ అనే పదము అసలు వాడరు. అది హిందీ , లేదా హైదరాబాదీ/ఉర్దూ పదము అయి ఉండాలి. విశేషమేమిటంటే ఆ పోరీ గా నటించినది ఆంధ్రా అమ్మాయి కాదు.  ఆంధ్రా తెలంగాణా  నాయకులు వైరుధ్యాలతో కొట్టుకుంటుంటే పరస్పర వైరుధ్యాలను తలపించే పేరు గల ఈ చిత్రము సామరస్యమిస్తున్దనుకున్నారేమో? లేదా ఆంధ్రా పూరీ అంటే బాగుందడనుకున్నారేమో?
`         దీని మీద తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఎలాటి  ఆసక్తి కలిగినట్లు లేదు. బహుశా కంఫ్యూజన్ లో ఉన్నాడేమో? లేదా తెలంగాణా పోరీ అనకుండా  ఆంధ్రా పోరీ అన్నందుకు ఇక్కడ రిలీజ్ చేస్తాడా, నిర్మాత నాలుక కత్తిరించి వేస్తానని అంటారేమో అనుకున్నాము.
         


Friday, March 27, 2020

అగ్గిపుల్ల/సోనా



 కథ ఇలా మొదలయింది. నేను సోనా అగ్గిపెట్టేలను కొనాలని కిరాణా  కొట్టుకు వెళ్లాను. నేను ఎప్పుడూ డజన్  కట్టగా కొంటూ ఉంటాను.  ఇంట్లో అవి అయి పోవచ్చినాయి. మొదట్లో చెక్కనుండి చీల్చ బడిన అగ్గి పుల్లలను వాడే వాడిని. కానీ వర్షాలు బాగా  కురిసి , ఆర్ద్రత పెరిగినపుడు  అవి అంటుకునేవి కాదు. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ ఇది నా వ్యక్తిగత అనుభవము. ఒక పుల్లకు బదులు నాలుగు పుల్లలు ఖర్చు అయేవి. కానీ సోనా  మైనపు/వాక్స్ పుల్లలతో అటువంటి సమస్యలూ వచ్చేవి కాదు. ఆ విధముగా అవి అలవాటు అయినాయి.

కిరాణా కొట్టుకు వెళ్లి సోనా అగ్గి పెట్టేలకోసము అడగగానే ,”మేము వాటిని అమ్మమండీ! అవి పొట్టిగా ఉంటాయి. అంటుకోనేటప్పుడు వేళ్ళు  కాలతాయి కూడా.” అని అన్నాడు.

“అబ్బే ! నేను జాగ్రత్త గానే వెలిగిస్తాను. వాటికి అవి నెమ్మదిగా మంట పైకి  వస్తుంది. ఏమీ కాలదు “ అని చెప్పాను.

‘అయినా, చెక్కతో ఉన్న పుల్లలు వాడ వచ్చు కదా!” అన్నాడు. పక్క కొట్లలోలో కూడా ఇదే జవాబు. అంటే వాళ్లకు అనుకూలమయిన వస్తువులే అమ్ముతారన్న  మాట. వస్తువులు కొనడానికి వచ్చే వారడిగినవి కాదు. అవసరమయితే తమ సరుకే మంచిదని ఒప్పిస్తారు. ఇదంతా కల్పితము కాదు. నిజంగా జరిగింది. వెంటనే మా పాత విద్యార్థి మామ గారిది ఒక కొట్టు ఉంటె అక్కడకు వెళ్లి ఒకటి కాదు, రెండు డజను అగ్గి పెట్టెలను కొని ఇంటికి వెళ్లాను.

మా వీధి చివర ఒక కిరాణా కొట్టు ఉంది. అక్కడ కూడా ఇదే తంతు. నేను అక్కడికి వెళ్లి గాడ్రెజ్  షేవింగ్ క్రీం కావాలని అడిగాను. “అబ్బే! అదెవరూ వాడటము లేదండీ! మా కొట్టులో ఎవరూ దానిని కొనరు. మా దగ్గిర జెల్ క్రీం ఉంది తీసుకొండి” అని యన్నారు. ఇంచు మించు నాలుగు లేక అయిదు ఐటమ్స్ కు నేను ఇదే రకపు జవాబు వచ్చింది. ఇంక అక్కడికి వెళ్ళడము తగ్గించేశాను. కొంత మంది చేసే వ్యాపారము ఇలా ఉంటున్నది. ఇది పెద్ద వ్యాపార సంస్థల నుండి నేర్చుకొని ఉంటారు.

ఇంక టూత్  పేస్టుల సంగతి చూద్దాము. కొంత వినోదానికి తెలుగు పదాలు ఉంటె ఎలా ఉంటుందా అని వాటిని వాడాను.  ఏదో ఒక కంపెనీ. దానిని XX అని అందాము. మన దేశములో పాత కాలములో బూడిదతో, లేదా ఉప్పు పొడి కలిపినా బూడిదతో , మరి కాస్త ఓపిక ఉన్న వారు కానగ లేదా గానుగ పుల్లతో, ప్రముఖముగా అయితే వేప పుల్లతో దంత ధావనము చేస్తారు. ఇది రోజూ ఖచ్చితముగా చేయుట అలవాటయిన పని. ఇంక విదేశాల్లో వాళ్ళు (అక్కడ స్థిర పడిన మన వాళ్ళు కాదు) అసలు పళ్ళు తోముకోరని ఏదో సిరప్ తో నోటిని కడుక్కుంటారని విన్నాను. ఇది తప్పయితే నన్ను క్షమించండి.

ఇంక కొన్ని వ్యాపార సంస్థలు మన పళ్ళ మీద దృష్టి పెట్టినాయి. మన  సెంటిమెంటును డబ్బుగా మార్చు కోవాలనుకున్నాయి. మీరు మా టూత్ పేస్టూ లేదా దంత లేహ్యాన్ని వాడితే మీ పళ్ళు తళ తళా మెరిసి పోతాయి లేదా వాడక పొతే అవి జల జలా రాలి పోతాయి అనే నినాదముతో మొదలవుతుంది. అంతే కాక ప్రకటనలలో ఒక తెల్ల కోటున్న వైద్యుడు ఇవన్నీ చెప్పి మనకు మంచి సలహా ఇస్తున్నట్లే చెబుతాడు. అంతా ఎగబడి కొన్నారు. ఇంక రెండవ మెట్టు ఉంది. “మేరు మీ వేలుతో తోమితే మా దంత లేహ్యము దంతాలంతా పాకటము లేదు. అందుకని మీకు పూర్తీ ప్రయోజనము కలుగుట లేదు. అక్కడంతా బాక్టీరియా/సూక్ష్మ జీవులు చేరి పళ్లకు తొర్రలు పోడుస్తాయి “ అని మరో ప్రచారము మొదలు పెట్టినారు. “ఇప్పుడు మీరేమి చేయాలంటే ఇదుగో మీకోసము మేము ఎంత కష్ట పడుతున్నామో గమనించండి. మీ దంతాల కోసము ప్రత్యేకముగా చేయ బడిన దంతపు దులుపుడు పుల్ల వాడండి.”అని అన్నారు.ఏ విధముగా మరొక వ్యాపారము ప్రారంభ మయింది. ఇదే నా వరకు వేలును అంటి  ఒక కంపెనీ మా దంత లేహ్యమును వాసన చోస్స్తే చాలు... అంటూ అబ్బాయిలను, అమ్మాయిలను కలిపి చూపించే వరకూ వచ్చినారు.

ఇప్పుడు దంత వైద్య  శాలల ప్రకరణము మొదలయింది.  దంతపు లేహ్యాలు, దంతపు దులుపుడు పుల్లలు వచ్చిన తరువాత కూడా దంత వైద్య శాలల వ్యవస్థ బాగా పెరిగింది. దంత వైద్యులు అమెరికా లో పై స్థాయి వైద్యుల జాబితా లో చేరుతారు. ఇంక భారత దేశములో కూడా అదే స్థితి  వస్తుంది.

వ్యాపారము పెరిగింది, వసూళ్లు  పెరిగినవి. ఇంక పోటీ కూడా పెరిగింది.ఇంక పోటీ తట్టుకోనడానికి ఒకే కంపెనీ ఎక్కువ బ్రాండులు తయారు చేయడము మొదలు పెట్టింది. ఒకటి బాగా లేదంటే మరొకటి లేక పొతే మరొకటి, అదే సంస్థ ది అంటే వర్తకము తన గుప్పిట్లోనే ఉండాలి. మైళ్ళలో పాత కాలములో ఉప్పుతో పళ్ళు తోమే వారంటే, ఇదిగో xx ఉప్పు  వేప పుల్ల మంఛిది కదా అంటే ఇదిగో xx వేప, మంచి సువాసన కావాలంటే ఇంకొకటి , దానితో తోమగానే వీధి లొ అమ్మాయిలూ పరిగెత్తుకొని వచ్చేస్తారు, అందరూ ఆయుర్వేదము కూర్చి మాట్లాడుతున్నారంటే ఇదిగో  xx వేద.  దీనికి బలి అయ్యే  బకరాల సంగతి చెప్ప వలెనంటారా?

కొన్ని సంవత్సరాల క్రిందట ఒక బ్రాండ్ దంత లేహ్యము పూర్తిగా vegetarian అని ప్రకటించినాడు. అంటే మిగిలిన బ్ర్రండ్ల సంగతేమిటి?కొందరు ఖంగు తిన్నారు.బాగా పరి శీలించిన తరువాత తెలిసిన దేమిటంటే,ఆయా దంత లేహ్యాలలో మూల పదార్థము ఎముకల పొడి యని. శాకాహారులమని చెప్పుకొనే వారి కి ఈ సంగతి తెలిస్తే ఏమవుతుంది?

అంతే కాదు నా స్నేహితుడు ఒకరు చెప్పినాడు. ఈ ఎముకల పొడి కారణముగా నే ఆ దంత లేహ్యమును వాడిన వారికి దంతాల పై ఉన్న గార తొందరగా పోతున్న దట. ఈ విషయాన్ని వ్యాపారస్తులు ఒప్పుకుంటారా? పొతే ఎవరు పోతారు? బకరాలే కదా.

          మీ ఉత్పత్తికి ఏమి కలిపినారు? అని అడిగే దమ్ము ఎవరికయినా ఉన్నదా? అ కంపెనీలు అన్నీ పేటెంటు హక్కులను నమ్ముకున్నాయి కదా!

          ఈ దంత వేదాంతము ఎందుకు చెప్పండి? తవ్వుకొనే కొద్దీ తల నొప్పులే కదా! ఈ విషయాలన్నీ బయట పడితే మా పరువు ఏమి కావాలి? ఇది కొంత మంది బాధ. వదిలి వేసేయండి. ఇంకొకరికి చెప్పే ముందు మీరు మారండి.

ఒక్క అగ్గి పుల్ల కథ ఎంత వరకూ వెళ్ళింది? అతి సర్వత్ర వర్జయేత్.

ఓం స్వస్తి.