Friday, November 22, 2019

మన వైద్య శాస్త్రాలు



ఆ సంవత్సరము 1977. నా జీవితములో పెను మార్పులు మొదలయిన సంవత్సరము. ఒక  వర్క్ షాప్ లో పాల్గొంటున్నాను. ఆ సమయములో ఒక రోజు నాకు ఉష్ణోగ్రత వచ్చి లెవ లేక పోయినాను. నా స్నేహితులు నన్ను వైద్య శాలలో చేర్పించినారు. అక్కడ కారణము నాకు తెలియదు కానీ, నగరములో యున్న అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అన్నీ వాడినారు. నాల్గు రోజులకు నా జ్వరము తగ్గింది . కానీ హాస్టల్ లో నా రెండవ అంతస్తులో నున్న గదికి వెళ్ళుటకు శక్తి చాల లేదు. అప్పటినుండీ నేనొక నిర్ణయానికి వచ్చినాను. ఆధునిక/అలోపతీ మందులను వాడకూడదని. ఇప్పటి వరకు (నలువది సంవత్సరాలుగా) నేను ఆ నియమాన్ని పాటిస్తున్నాను.

1997 లో నా  మోకాళ్ళు పట్టి వేసినాయి. కూర్చుంటే నిలబడ లేను. అటువంటి స్థితిలో నన్ను నా స్నేహితులు  చాలా భయ పెట్టినారు. 15రోజులలో   నేను మామూలు స్థితికి వస్తానని చేపినాను. అలాగే జరిగింది. అప్పుడు నేను అలోపతి/ఆయుర్వేదము మాత్రలు వాడ లేదు.

2001 సంవత్సరములో   నాకు చత్వారము వచ్చినది. చదవడానికి చాలా కష్ట పడుతున్నాను. నా స్నేహితుల బలవంతము మీద కంటి వైద్యుడి దగ్గిరకు వెళ్ళినాను. అన్ని పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చినారు. వాటిని వాడడము మొదలు  పెట్టిన తరువాత  చూపు బాగుంది, కానీ తలలో నదురుగా ఏదో నొప్పిగా ఉంటున్నది. కళ్ళద్దాలు వాడే నా మిత్రులు  మొదట్లో అలాగే ఉంటుందన్నారు.  అంతే కాక కళ్ళద్దాలు వాడక ముందు నేను చదవ గలిగిన అక్షరాలను ఇప్పుడు అవి లేకుండా  నేను చదవ లేక పోతున్నాను. అంటే నా కళ్ళ సున్నితత్వము కూడా తగ్గుతున్నది. అప్పుడే  Better Eyesight Without Glasses  పుస్తకాన్ని తెప్పించుకున్నాను. అందులో ఈ నాడు మనము చేస్తున్న పొరపాటు కళ్ళద్దాలను వాడటమే అని వివరించినారు.

నాకు అంతా సమస్య గానే ఉండినది. అందుకని కళ్ళద్దాలను పక్కన పడి వేసినాను. ఆరు నెలల పైన పుస్తకాలను చదువుట మాని వేసినాను.యోగ, ప్రాణ విద్య, రేకి లాటి వన్నీ కళ్ళ విషయములో వాడటము మొదలు పెట్టినాను. సంవత్సరము లోపల నా దృష్టి లో మార్పు వచ్చింది. ఆ తరువాత అన్నీ కళ్ళద్దాలు లేకుండా చదవ గలిగినాను.

నా అనుభవాల కారణముగా నాకు ఆయుర్వేదము, హోమియోపతి, యోగ, ప్రాణవిద్య, రేకి లాంటి వాటిని ఎక్కువ విశ్వసించినాను.

ఏ సమస్యకూ వెంటనే పరిష్కారము లభించదు. లేదా లభించిన పరిష్కారము తాత్కాలికమే.  వ్యాధి  లక్షణాలకు వైద్యము చేస్తే సరి పోదు. హోమియోపతి సూత్ర గ్రంథము ఆర్గనాన్ ను అనుసరించి, వైద్యము చేయ వలసినది రోగానికి కాదు, రోగికి.  అందుకు రోగము యొక్క లక్షణములు ఉపయోగ పడుతాయి. ఇంకా ఆయుర్వేదాన్ని అనుసరిస్తే మరో మెట్టు ఎక్క వలసి వస్తుంది. ఆయుర్వేదము స్వస్థ వృత్తముతో మొదలవుతుంది. తనలో తను ఉంటే స్వస్థత తో ఉన్నారని అంటారు. అంటే మనస్సు నియంత్రణ లో ఉండటము. ఈ విధముగా ప్రతి రోగానికి మనస్సు మూలము అని తెలుస్తుంది. అలోపతి వైద్యము ఈ నాటి వరకు ఈ విషయాన్ని గుర్తించే స్థితికి ఎదగ లేదు. ఇందులో రోగము రావడానికి మన చుట్టూ  ప్రకృతిలో యున్న సూక్ష్మ జీవులే కారణమని ప్రతిపాదించి, అందరి చేత అంగీకరింప చేసి, ఆ సూక్ష్మ జీవులను నాశనము చేయుట అన్ని రకాల విష పదార్థాలన్ ఉపయోగించుట మొదలు పెట్టినారు. వాతావరణములో పెద్ద మార్పులకు కారణ మయినాడు.

  సందర్భములో ఇద్దరు వైద్య పరిశోధకులను గురించి ప్రస్తావించ వలసి యుంది. ఇద్దరూ ఫ్రాన్స్ దేశము వారే.  అందులో మొదటి వాడు సూక్ష్మ జీవుల ప్రభావము గురించి ప్రస్తావించిన  లూయిస్ పాశ్చర్. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి, మన వ్యాధులకు కారణము మన మీద దాడి  చేసిన సూక్ష్మ క్రిములు. వాటినుండి మనలను రక్షించుకోవాలి. ప్రతి  వ్యాధికి ప్రత్యేకమయిన సూక్ష్మ క్రిములు కారణము. వీటి కారణముగా వ్యాధి ఎవరికయినా రావచ్చును.

రెండవ వాడు పాశ్చర్ కు సమ కాలీనుదయినా బెచాంప్. ఈయన  సిద్ధాంతము పూర్తిగా వ్యతిరేకముగా ఉంటుంది. దీనిని అనుసరించి మన దేహములోనున్న సూక్ష్మ క్రిములు మన దేహములో జరిగే చర్యలకు తోడ్పడుతాయి. రోగానికి కారణము మనలో ఏర్పడిన అనారోగ్య పరిస్థితులు. సూక్ష్మ క్రిములు రోగానికి కారణమని బెచాంప్ ఎప్పుడూ అంగీకరించ లేదు.

కానీ పాశ్చర్ యొక్క సిద్ధాంతము ఎక్కువ మంది చేత అంగీకరించ బడినది. మనకు వస్తున్న వ్యాదులన్నిటికీ సూక్ష్మ క్రిములే కారణమని నమ్మి, వాటినుండి రక్షణ కొరకు విష పదార్థములను మందుల రూపములో మింగుటకు అలవాటు చేసినారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ దీనినే అంగీకరించినాయి. విశ్వ వ్యాప్తముగా ఈ వైద్యము అంగీకరించ బడినది. వేర్వేరు రోగాలకు వేర్వేరు మందులు తయారు చేయ బడినవి.

ఈ విధముగా వైద్య శాలలు, వైద్యులు,.........ఎన్నో వచ్చినవి. వచ్చిన ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఈ విధముగా ప్రకటించింది. 1999లో వంద  సంవత్సరాల అలోపతి వైద్యము కొనసాగించిన తరువాత “ప్రపంచములో అంటు రోగాలు పిల్లలను, యువకులను మింగి వేస్తున్నవి. సంవత్సరానికి 1.3 కోట్ల సంఖ్యకు చావులు చేరినవి.” అంతే కాదు, ఉన్న మందులు సూక్ష్మ జీవుల మీద పని చేయని స్థితి వచ్చింది. వాటి మీద యుద్ధము కొన  సాగుతూనే ఉంది. కొత్త రోగాల ఒత్తిడి పెరుగుతూనే ఉంది.”

“గత రెండు దశాబ్దాలుగా  ముప్పయి వ్యాధులు కొత్తగా వచ్చినాయి. పాత రోగాలు  ప్లేగు, డిఫ్తీరియా,ఎల్లో జ్వరము, డెంగీ, మేనిన్జిటిస్ లాంటి పాత రోగాల్ బల పడినాయి.”

ఇక్కడే బెచాంప్ మాటలన గుర్తుంచుకోవాలి. “ఈ సూక్ష్మ క్రిములు మన శత్రువులు కాదు. మనలో చేరిన మురికిని తిని అవి బ్రదుకుతాయి. అందు వలన మనకు వాటి వలన మేలే జరుగుతుంది.” “మనకు రోగాలు అనారోగ్య పరిస్థితుల వలన వస్తాయి. సూక్ష్మ క్రిముల వలన కాదు.”

ఇంకా చాలా మంది ఒప్పుకుంటున్నారు.”ఆరోగ్యవంత మయిన దేహాలలో కూడా సూక్ష్మ క్రిములున్నాయి. వాటి వలన ఎటువంటి హానీ జరుగదు. కానీ వాడిన మందుల వలన అవి కూడా నశిస్తున్నాయి.”

“ఇంక ఇతర వైద్య శాఖలను గురించి తెలుసుకుందాము. ఆయుర్వేదము ప్రకారము మన దేహములో వాత, పిత్త, కఫములనబడు మూడు తత్వాలున్నాయి. అవి సమముగా లేనపుడే వ్యాధులు వస్తున్నాయి. వాటికి సమత్వాన్ని ఏర్పరిస్తే వ్యాధి మాయమవుతుంది. ఇంకా హోమియోపతిలో ఇదే విధముగా సోరా, సిఫిలిస్, సైకోసిస్ తత్వాల వలన వ్యాధులు వస్తాయి. యోగ శాస్త్రము లో మనలో నున్న చక్రాలలో శక్తి క్షీణత వలన రోగాలు వస్తాయి. ఇవి  అన్నీ విజయాన్ని సాధించినవే. ఇవేవీ సూక్ష్మ క్రిములను గురించి మాట్లాడవు.

ప్రకృతిలో ప్రతి జీవి భగవంతుడి స్వరూపమే. అందుకే సూక్ష్మ జీవుల వలన మనకు ఎటువంటి వ్యాధి రాదు. వ్యాధికి కారణము మనలో ఏర్పడిన అనారోగ్య పరిస్థితులే.

మరొక విషయము. ఆరోగ్యవంతుడి మందు ఆహారము. అనారోగ్యవంతుడి  ఆహారము మందు.

డాక్టర్ ఫ్రెంకేల్ చెబుతాడు.” నాజీల నిర్బంధము లో నుండి బయట పడిన వాళ్ళలో ఎక్కువ మంది నిర్దిష్టమయిన జీవితలక్ష్యమున్న వారే. అది యున్న వారిని ఎటువంటి పరిస్థితులు హాని చేయ లేవు.”

మసనోబు ఫుకువోకా తన పొలాలను దున్న లేదు. ఎరువులను వాడ లేదు. పురుగు మందులను చల్ల లేదు. కలుపు మొక్కలను తీయ లేదు. ప్రకృతిని పూర్తిగా అనుసరించి  ఆధునిక వ్యవసాయ పద్ధతులలో అందుకొనే పద్ధతులలో ఫలితాలను అందుకున్నాడు.

అందుకే మన అనారోగ్యానికి కారణము మన మనసు మీద ఉన్న ఒత్తిడి, మనము చూపే ప్రేమ వలన .......ఏ సూక్ష్మ జీవులు మనకు హాన చేయ లేవు.

ఆ సూక్ష్మ జీవుల పేరు చెప్పి, ఫాక్టరీల ద్వారా పొలాల ద్వారా భూమిని విష పదార్థాలతో నింపకండి. భూమిని కాపాడండి.

*****************************క్ష్***********************


Thursday, November 21, 2019

విత్తనము



భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అందుకే ప్రతి జీవిని దైవము యొక్క ప్రతిరూపముగా భావించాలని భారతీయ ఆధ్యాత్మికత చెబుతుంది.ఆచరణ అనేది తరువాత సంగతి.

మరి కొన్ని మత సాంప్రదాయాలు  భగవంతుడు అన్నిటిని సృజించి వాటి పై మానవుడికి అధికారము ఇచ్చినాదని (అంటే పరోక్షముగా మానవుడి వలన వాటికి  బాధ కలిగినా తప్పు కాదని అర్థము వచ్చేటట్లు) చెబుతారు. ఇందులో నిజానిజాలు నాకు తెలియవు.

ఈ నాడు మానవుడి ద్వారా వృక్ష జాతికి వచ్చిన ముప్పు సామాన్యమయినది కాదు. ఇది వేర్వేరు దశలలో జరిగింది.

తన కలప కోసము బ్రహ్మాండమయిన వృక్షాలను నరికి వేసినాడు. వాటి స్థానములో తిరిగి వృక్షాలను పెంచాలన్న విషయాన్ని మరచి పియినాడు. అందుకే పచ్చని ప్రదేశాలు ఎడారులుగా మారినాయి.

బ్రహ్మాండమయిన  వృక్షాలను తన కోసము, తన ప్రజ్ఞను చూపించుట కొరకు  మరుగుజ్జు వృక్షాలుగా (బోన్సాయ్) మార్చి పెంచుతున్నాడు. అది తన ప్రజ్ఞకు తార్కాణముగా భావించినాడు. ఆరడుగుల మనుషుల మధ్య మూడడుగుల మరుగుజ్జు యువకుడుంటే  అతడి మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి.

ముఖ్యమయిన పండుగలు లేదా కలయికలలో మొక్కలను వేర్వేరు డిజైన్లు గా కత్తిరించి తమ ప్రతిభగా చూపించుకున్నా అందులో జరిగిన హింస కనిపించదేమో?

చెట్ల ఎదుగుదలకు వాటి ఏర్పాట్లు వాటికున్నాయి. అందమయిన పూలను, రుచికరమయిన పండ్లను ఇస్తాయి కాబట్టి వాటిని మనమే పెంచి పోషిస్తాము. ఇంకా అడవులలో వాటి పండ్లను తిన్న పక్షులు, జంతువులూ వాటి విత్తనాలను వేరే చోట పడేస్తాయి. అందుకే వృక్ష జాతి విస్తరిస్తుంది. మరి కొన్ని విత్తనాలు నీటి ద్వారా లేదా గాలి ద్వారా వేర్వేరు చోట్లకు విస్తరిస్తాయి. వాటికి సహకరించే కీటకాలకు రక్షణ ఉంటుంది. అని కలిగించే వాటిని పక్షులు భక్షిస్తాయి. ఈ పనులు సహజముగా జరుగుతాయి. కొన్ని తృణ ధాన్యాలు, కూరగాయలు ఆహారము కొరకు మానవుడు పందిస్తున్నాడు.

ఒకప్పుడు ప్రాచ్య/తూర్పు దేశాలు మార్గ దర్శకము చేసే స్థితిలో ఉన్నాయి  వారి ఆలోచనలో సంపద అంటే డబ్బు కాదు. కొన్ని ప్రాచ్య జాతులు ఆవుల  మందను సంపదగా భావించినారు. ధనమగ్నిః, ధనం వాయుః ధనం భూతాని  పంచచ అని వేదము చెబుతుంది. అంటే  పృధ్వీ/నెల , నీరు ,అగ్ని, వాయువు, ఆకాసము ఈ ఐదింటిని పంచ భూతాలని అంటారు. ఇందులో నేల మన స్థితిని చెబుతుంది. నీరు మన లో ద్రవాలను గురించి చెబుతుంది, అగ్ని వాయువు గురించి చెప్పనవసరము లేదు. ఆకాశము మన ఆలోచనలను నదిపీస్తున్నది. ప్రతి విషయములో దోషము లేకుండా చూడ వలసిన భాద్యత మనదే. ఇవి స్వచ్చముగా ఉంటే మన దేశము స్వచ్చ భారతము అవుతుంది.

మ్లేచ్చుల, పాశ్చాత్యుల ప్రభావము పెరిగిన తరువాత  ఆనందము కంటే సుఖ భోగాల మీద దృష్టి పెరిగి ప్రకృతి సంపద కంటే భౌతిక సుఖాల మీద దృష్టి పెరిగింది. దీని ప్రభావముతో మనము మన వసతి కోసము సృష్టించుకొన్న డబ్బు మీద దృష్టి పడింది. ఇటీవలే ఒకరన్నారు.”మనకు ఉన్న జబ్బంతా డబ్బే అని.  మనకు డబ్బు తక్కువయితే ఒక సమస్య. ఎక్కువయితే అంతకంటే పెద్ద సమస్యలు వచ్చి జీవితాన్ని అతలాకుతలము చేస్తాయి.

మణికట్టు పట్టుకొని రోగ నిర్ధారణ చేసే వైద్యులు పోయినారు. ఇంకా స్టెతస్కోప్ కూడా వాడటము చేతకాని వైద్యులు తయారయినారు. వారికి స్టెతస్కోప్ అలంకార ప్రాయముంది. రోగిని చూచి రోగ నిర్ధారణ చేసే శక్తి వైద్యులకు పోయింది. యంత్రాలు చెబితేనే రోగమున్నదని అంటాడు. తిరిగి యంత్రాలు చెబితేనే రోగము తగ్గిందంటాడు. ఆ యంత్రాలకు పెట్టే ఖర్చు రోగి భరించాల్సిందే. ఈ వృత్తిని మరింత స్వచ్చందముగా కార్పొరేట్ వైద్య శాలలు స్వీకరించాయి. రోగి విద్యాలయానికి వెళితే  ఎంత అప్పుతో తిరిగి వస్తాడో తెలియని పరిస్థితి ఇటీవల వార్తలలో ఒక మధ్య తరగతి పౌరుడికి వైద్యము పెను భారము అయిందని వ్రాసినారు.

వైద్యము తరువాత కార్పొరేట్ సంస్థల దృష్టి వ్యవసాయము మీద పడింది. మన  దేశపు రైతులలో స్వయం నిర్ణయము స్వయం పోషకత్వం ఉండేది. ఏ  నాడూ రైతు విత్తనము కొనే వాడు కాదు. ముందు పండిన పంటలో కొంత భాగాన్ని విత్తనాల కొరకు నిలువ ఉంచే వాడు. అందుకని విత్తనాలలో ప్రకృతి సహజమయిన  పరిణామముండేది. ఆ రోజుల్లో కావలసినంత పశు సంపద ఉండేది. వాటికి కొఠ్ఠాలు ఉండేవి. అక్కడ గడ్డి పరచి ఉంచే వారు. పగలంతా పొలాల్లో పచ్చిక బయళ్ళలో తిరిగిన ఆవులు రాత్రి పూట ఆ కొఠ్ఠాలలో విశ్రమించేవి. వాటి మల మూత్రాలతో తడిసిన గడ్డి మంచి ఎరువయ్యేది.

ప్రతి గ్రామానికి ఏదో ఒక చెరువుతో సంబంధముండేది. కావలసిన పొలాలకు ఏటా తామే కాలువలు త్రవ్వు కొనే  వారు. ఖర్చును సమిష్టిగా భరించే వారు. విత్తనాలను చల్లే ముందు పొలాలలో జనుము వెంపల విత్తనాలను చల్లి అవి ఎదిగిన తరువాత వాటితో కలిపి పొలాన్ని దున్నేసే వారు. ఈ విధముగా నేలకు సారమును పెంచి ఆ పొలాలను నారు మళ్ళుగా వాడే వారు. పంట కోతకు వచ్చే ముందు పెసలు లేదా మినుముల బస్తాలలో ఉంచి నాన బెట్టి మోము వచ్చిన తరువాత పొలములో చాల్లే వారు. ఇవి రెండవ పంటగా వచ్చేవి. ఈ విధముగా వ్యవసాయము చేసినపుడు  ఏనాడూ పురుగుల వలన పంట నాశనమయేది కాదు. ఇది చిన్నప్పుడు నేను చూచిన యథార్థము. ఏనాడూ విత్తనాలకు పురుగు మందులకు ఖర్చు పెట్టనందు వలన పండిన పంట అంతా రైతుదే. ఎప్పుడైనా ప్రకృతి విలయము సంభవించినా రైతు సులభముగా కోలుకోన గలిగే వాడు. రైతు చాలా ఆనందంగా ఉండ గలిగే వాడు. సంక్రాంతికి బియ్యపు బస్తా వాకిట్లో పెట్టుకొని వరుసగా వచ్చే జనానికి బియ్యము పంచె వారు.  ఇంకా వాకిట్లో ధాన్యపు కంకులు కట్టి పిచుకలు తింటూంటే ఆనందముగా చూచే వారు.

అపుడే రైతు జీవితములో పెను ముసలము ప్రవేశించింది. పంటలు ఎక్కువ పండుతాయని  సహజముగా యున్న మొలగొలకులు (వీటినే రాజనాలు అంటారు) తెల్లకేసర్లు, ఎర్ర కేసర్లు  కు బదులుగా కొత్తగా జిబి 24,          ఐ ఆర్ 8 మున్నగు పంటలను ప్రచారము చేసి ప్రభుత్వమూ ప్రవేశ పెట్టించింది. అంతే కాక ఇవి తక్కువ కాలము పంటలని వసతి ఉంటే రెండో పంట వేసుకోవచ్చని చెప్పించింది. కొత్త సమస్యలు మొదలయినాయి. ఈ పంటలసు కీటకాలు కమ్మగా చప్పరించి వేస్తున్నాయి. వాటిని నిర్మూలించుటకు కీటక నాశినిని వాడ వలసిందే. ఇంత వరకు నేల సారము గురించ రైతుకు పట్టించుకోవలసిన అవసరము రాలేదు. ఈ పంటలతో నేల యొక్క సారము భయంకరముగా పడి పోతున్నది. అందుకోసము రసాయనిక ఎరువులు సల్ఫేటులు, ఫాస్ఫేటులు లాటివి విరివిగా వాడవలసి వచ్చింది. రైతుకు ఆదాయము పెరిగింది, ఖర్చుకూడా పెరిగింది. రైతుకు అప్పులు చేయ వలసిన పరిస్ఠితులు ఏర్పడినాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ కీటకముల శక్తి పెరిగి శక్తివంతమయిన విష పదార్థాలు ఎక్కువ సార్లు కూడా పిచికారి చేయ వలసి వచ్చింది. దీనితో మధ్య తరగతి రైతు మరింత క్రుంగి పోయినాడు.

ఆశ రేపింది ప్రభుత్వ ప్రచారకులు. అలవాటు పడింది రైతులు. లాభాలు పెంచుకొన్నది ఎరువులు, పురుగు మందుల పరిశ్రమలు.

మరో ప్రమాదకరమయిన పరిస్థితి ఏమిటంటే రైతుకు క్రమనుగా విత్తనాల మీద అధికారము పోయింది. పండిన ధాన్యము విత్తనాలకు పనికి రావు. వీటినే టెర్మినేటర్ర్ విత్తనాలని అన్నారు. ఈ విధముగా రైతు ప్రకృతికి దూరముగా  అద్దములో కనిపించే డబ్బు వైపు ఆశగా చూస్తూ ఉండి పోయినాడు. అన్నీ ఇంట్లోనే సమకూర్చుకో గలిగిన వ్యక్తీ బజారున పడ్డాడు.

ఇంకా రోగ నిరోధక శక్తి పెంచాలని విత్తనాలకు సంబంధించిన మూల కణాల మీద ప్రయోగాలు చేసినారు. ఉదాహరణకు వంకాయ మూల కణములో  తేలు విషానికి సంబంధించిన రసాయనాన్ని కలిపారు. దీని వలన కీటకముల దాడి తగ్గ వచ్చును. కానీ తిన్న వారికి వెంటనే కాక పోయినా కాల క్రమేణా కొత్త  రోగాలు రావని ఎటువంటి  హామీ ఇవ్వ లేరు.  నేను చిన్నప్పుడు ఒక ఆవు  హైబ్రిడ్ జొన్న పంట తిని  చని పోయి ఉండడము చూచినాను. అదేమంటే ఆ జొన్న ఆకులలో సయనైడ్డ్దే ఏర్పడిందిట. ఇటీవలే విజయ వాడలో ఒక గోశాలలో గడ్డి తిని 80 ఆవులు చచ్చి పోయినాయని విన్నాము  ఆ గడ్డి ఏ జెనటిక్ ప్రయోగాలలో వచ్చిందో? ఇలా తయారయిన  హైబ్రిడ్ విత్తనాల ప్రభావము గురించి పూర్తిగా  తెలియదు.

ఒక పర్యావరణ వేత్త అంటాడు.”ఇలా వచ్చిన ధాన్యాన్ని తినగా వచ్చిన జబ్బులకు మందులు కూడా అవే కంపెనీలు తయారు చేస్తున్నాయని.” ఇంకో మాట కూడా ఉంది. తమ పొలములో పండిన పంటను ఎ రైతూ తినడట. ఎందుకంటే తను విష పదార్హాలు ఎన్ని చల్లినాడో తెలుసు కాబట్టి. పక్క వాడు ఎంత చల్లాదో తనకు తెలియదు కాబట్టి.
ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా మందికి నచ్చవు. మానవ జాతి పరిణామములో ప్రతి జీవికి సమున్నత స్థానముంది. విత్తనాలకు జెనెటిక్ కోడె మార్చినందు వలన దాని ఉనికికి ప్రమాదము ఏర్పడింది. ఈ సెంటిమెంట్  ఏమిటి అంటారేమో? పాశ్చాత్య సంస్కృతీ ప్రభావము లాగే అనిపిస్తుంది. మొక్కల దగ్గిర రోజూ కొద్ది సేపు కూర్చొని వాటికి మన ఆలోచనను అందిస్తే అవి స్పందిస్తాయని కొంత మంది తెలుసు.ఆలోచనలతో మొక్కలను ప్రభావితము చేసిన వాళ్ళు ఎందఱో ఉన్నారు. అందులో పరమ హంస యోగానంద శిష్యుడు ఒకరు.లూథర్ బర్బంక్ తన ఆలోచనల ప్రభావముతో రోజా ముళ్ళు లేకుండా పూచేటట్లు చేసినాడు. అతడిని న అనుసరించి అటువంటి ప్రయోగాలు చాలా మంది విజయవంతముగా చేసినారు. ఈ నాడు వ్యాపార మనస్తత్వముతో కొంత మంది మన జీవితాలతో బాటు ఇతర జీవ రాశులను కూడా హిమ్సిస్తున్నాడు.

(వృక్షాలపై జరిగిన ప్రయోగాలను ఇంకో చోట వ్రాయ వలసి ఉంది.)
**************************************************************





Thursday, November 14, 2019

విలన్లు ఎవరు?



ఈ భూమి మీద అత్యంత భయంకరులయిన ప్రతి నాయకులు(విలన్లు) ఎవరో తెలుసా?
మన ప్రాచీన ఋషులు/ రచయితలుఆదర్శముతో జీవిచిన వారు. వారి వ్రాతలలో నాయకులను గుర్తుంచుకున్నంతగా ప్రతినాయకులను గుర్తుంచుకోరు. ఎవరినో కొద్ది మందిని తప్ప ప్రతినాయకులను ఎవరూ గుర్తుంచుకోరు. ఆ మరపు సమాజానికి కొంత మేలు చేస్తుంది.
ఇప్పుడు కాలము రీతి మారింది. కాళీ ప్రభావము ఎంత పెరిగిందంటే ఇటీవలే వాట్సప్  లో ఉన్న ఒక మెసేజ్ రావణుడి స్వగతమంటూ వచ్చింది. అందులో రావణుడు తానేమీ తప్పు చేయనట్లు వివరిస్తూ అందరూ తనను అపార్థము చేసుకున్నారని అంటాడు.
అంతే కాదు. కొందరు కథానాయకులు రావణుడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని చివరకు కేచకుడిని కూడా ప్రాధాన్యత కలిగిన ఉదాత్త పాత్రలుగా చేసినారు. ఒక విషయము మాత్రము నిజాము. పాత ప్రతినాయకుడిలో కొన్ని ఉదాత్త లక్షణాలు, ఎక్కువగా దుర్మార్గ  లక్షణాలు ఉంటాయి. అయినా దుర్మార్గ లక్షణాలు సమాజానికి హానికరముగా  మారినపుడు వారిని సమాజమునుండి తొలగించ వలసి యుంది. అందుకే నాకు అనిపిస్తుంది,  అసలు విలన్లకంటే ఈ విలన్లను హీరో లు గా మార్చిన కవులు/రచయితలు ప్రధాన విలన్లు అని.
ఇటీవల వివిధ సంస్థలు తమ చానల్స్ ద్వారా ప్రవహింప చేస్తున్న ధారా వాహికలను చూస్తె నిజ జీవితములో ప్రతినాయకులు/విలన్ల కు రాని ఆలోచనలు అందులో పాత్రలకు వస్తూ ఉంటాయి. అందులో ఉండేది వినోదము కాదు, అహంకారము, క్రూరత్వము, మాత్రమె కావు, పైశాచికత్వము కూడా కనిపిస్తాయి  కొన్నిటిలో ఒక ఉదాత్త పాత్ర ఉంటె మిగిలినవన్నీ అత్యంత క్రూర పాత్రలతో, నడిపించేస్తూ ఉంటారు. హింస ఎంత తీవ్రముగా ఉంటుందంటే వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది.
ఒక్కొక్క ధారా వాహికలో ఒకే కథా నాయిక/నాయకుడు  మిగిలిన అందరూ దుర్మార్గులు ఉండటం చూస్తుంటే  మనది ప్రజా స్వామ్య దేశము  కదా, ఎవరి సంఖ్య ఎక్కువుంటే  మన ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి  వారే నాయకులు/మంచివారు/మార్గదర్సకులు లేదా దార్శనికులు అవుతారు. ఏది మంచో ఏది చెడో తెలియనీకుండా వినోదము పేరుతొ మన సమాజాన్ని నిర్వీర్యము చేస్తున్నారు. ఇటువంటి రచయితలు/రచయిత్రులు నిజమయిన విలన్లని అనిపిస్తుంది.
వీరు శక్తి వంచన లేకుండా ప్రేక్షకులలో తమలో నున్న  దుష్ట భావాలను ప్రచారము చేయడానికి ప్రయత్నము  చేస్తున్నారు.