Thursday, February 10, 2022

మన పరిస్థితి

                   

               


                        

 

 ఇక్కడ కొన్ని విషయాలను కాస్త కఠినమే అయినా చెప్ప వలసిన అవసరమున్నది. ఇందులో ఎవరినీ నొప్పించుట ఉద్దేశ్యము కాదు. ప్రతి విషయాన్నీ తమ ఆలోచనకు అనుకూలముగా మార్చి అదే సత్యముగా అనిపించేటట్లు చేయడము పాశ్చాత్యులలో ఒక వర్గము వారికి వెన్న తో పెట్టిన విద్య.(క్షమించాలి అందరూ కాదు వారిలో కూడా ఎందఱో మహాను భావులు ఉన్నారు.) వీరు తాము అనుకున్నదే సరి అయినది అని చెప్పుటకు ఎన్ని వక్ర మార్గాలయినా తొక్కుతారుఅందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయిశ్రీ మికాయో ఉసూయి షింగాన్ శాఖకు చెందిన బౌద్ధ మతావలంబి. రేకి అనే విద్యను ఆధునిక కాలములో ప్రవేశ పెట్టిన మహనీయులు. ఆయన ఏ నాడూ జపాన్ దాటి వెళ్ళ లేదు. ఇది స్పష్టముగా ఆయన వ్రాతలలో  ఇటీవల బయట పడినది. కానీ ఒక రేకి టీచర్ ను అనుసరించి ఆయన ఒక క్రిస్టియన్ స్కూలుకు అధికారి. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబు కనుక్కోవాలని చికాగో వెళ్లి వైద్య విద్యను  అభ్యసించినాడని    .. ఇంకా.. ఇంకా.. ఎన్నో కథలు ఆవిడ చెప్పినారు  ఇవి ఇప్పటికి రేకి  క్లాసులలో చెబుతారు.

ఇంక ఈ నాడు భారతీయులలో కూడా చాలా మంది తమ ఋషులు ఏమి చెప్పారో తెలుసు కోవడానికి తమ గ్రంథాల మీద కాకుండా పాశ్చాత్యులు వ్రాసిన పుస్తకాలపై ఆధార పడి వారి పాటలకు తాళాలు వేస్తున్నారు. ఇటీవల చాణక్య అనే టీవీ సీరియల్ తీసిన ఒక మహనీయుడు ఎక్కడో చదివినాడు. ఒక పాశ్చాత్య గ్రంథములో చాణక్యుడి కాలానికి భారత దేశములో తాటి చెట్లు ప్రవేశించ లేదని. దురదృష్టమేమిటంటే ఆయన అన్నీ చదివినాడు కానీ మన గ్రంథాలు పూర్తిగా చదువ లేదుభాగవతములో బాల రాముడు తాటి పండ్లు తిన్నట్లు ఆయన దృష్టికి రా లేదు. రామాయణములో ఎన్నో చోట్ల తాటి చెట్ల ప్రస్తావన వస్తుంది. అది ఆయన దృష్టికి రాక పోవడము మన దురదృష్టము.

నా కొలీగ్ ఒకరు రామాయణ విష్ వృక్షము గురించి  చెబుతుంటే నేను ఒక మాట అన్నాను. “మీరు అసలు గ్రంథము చదవకుండా ఈ వ్యాఖ్యానాలు చదివితే మీకు చర్చించే అధికారము లేదు.” అని.

ఒక నిజాయితీ గల పాశ్చాత్యు రాలు వారణాసి గురించి పరిశోధించుటకు  హార్వర్డ్ వచ్చింది ఆమె పేరు నాకు గుర్తు లేదు. వారణాసి లో ఆమె మూడు సంవత్సరాలు గడిపింది.ప్రతి ప్రాంతము అక్కడ తిరిగి విషయాలను సేకరించింది. అది ఆమె గొప్ప తనము. పల్లెటూర్లను గురించి పరిశోధించే కొంత మంది  పల్లెటూర్లకు వెళ్ళకుండానే ఏవేవో పుస్తకాలు చదివి పల్లెటూర్ల మీద విమర్శనాత్మక వ్యాసాలూ వ్రాయడము   మన దేశములో కొత్త కాదు. అది గర్హించ వలసిన విషయము.