Thursday, November 14, 2019

విలన్లు ఎవరు?



ఈ భూమి మీద అత్యంత భయంకరులయిన ప్రతి నాయకులు(విలన్లు) ఎవరో తెలుసా?
మన ప్రాచీన ఋషులు/ రచయితలుఆదర్శముతో జీవిచిన వారు. వారి వ్రాతలలో నాయకులను గుర్తుంచుకున్నంతగా ప్రతినాయకులను గుర్తుంచుకోరు. ఎవరినో కొద్ది మందిని తప్ప ప్రతినాయకులను ఎవరూ గుర్తుంచుకోరు. ఆ మరపు సమాజానికి కొంత మేలు చేస్తుంది.
ఇప్పుడు కాలము రీతి మారింది. కాళీ ప్రభావము ఎంత పెరిగిందంటే ఇటీవలే వాట్సప్  లో ఉన్న ఒక మెసేజ్ రావణుడి స్వగతమంటూ వచ్చింది. అందులో రావణుడు తానేమీ తప్పు చేయనట్లు వివరిస్తూ అందరూ తనను అపార్థము చేసుకున్నారని అంటాడు.
అంతే కాదు. కొందరు కథానాయకులు రావణుడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని చివరకు కేచకుడిని కూడా ప్రాధాన్యత కలిగిన ఉదాత్త పాత్రలుగా చేసినారు. ఒక విషయము మాత్రము నిజాము. పాత ప్రతినాయకుడిలో కొన్ని ఉదాత్త లక్షణాలు, ఎక్కువగా దుర్మార్గ  లక్షణాలు ఉంటాయి. అయినా దుర్మార్గ లక్షణాలు సమాజానికి హానికరముగా  మారినపుడు వారిని సమాజమునుండి తొలగించ వలసి యుంది. అందుకే నాకు అనిపిస్తుంది,  అసలు విలన్లకంటే ఈ విలన్లను హీరో లు గా మార్చిన కవులు/రచయితలు ప్రధాన విలన్లు అని.
ఇటీవల వివిధ సంస్థలు తమ చానల్స్ ద్వారా ప్రవహింప చేస్తున్న ధారా వాహికలను చూస్తె నిజ జీవితములో ప్రతినాయకులు/విలన్ల కు రాని ఆలోచనలు అందులో పాత్రలకు వస్తూ ఉంటాయి. అందులో ఉండేది వినోదము కాదు, అహంకారము, క్రూరత్వము, మాత్రమె కావు, పైశాచికత్వము కూడా కనిపిస్తాయి  కొన్నిటిలో ఒక ఉదాత్త పాత్ర ఉంటె మిగిలినవన్నీ అత్యంత క్రూర పాత్రలతో, నడిపించేస్తూ ఉంటారు. హింస ఎంత తీవ్రముగా ఉంటుందంటే వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది.
ఒక్కొక్క ధారా వాహికలో ఒకే కథా నాయిక/నాయకుడు  మిగిలిన అందరూ దుర్మార్గులు ఉండటం చూస్తుంటే  మనది ప్రజా స్వామ్య దేశము  కదా, ఎవరి సంఖ్య ఎక్కువుంటే  మన ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి  వారే నాయకులు/మంచివారు/మార్గదర్సకులు లేదా దార్శనికులు అవుతారు. ఏది మంచో ఏది చెడో తెలియనీకుండా వినోదము పేరుతొ మన సమాజాన్ని నిర్వీర్యము చేస్తున్నారు. ఇటువంటి రచయితలు/రచయిత్రులు నిజమయిన విలన్లని అనిపిస్తుంది.
వీరు శక్తి వంచన లేకుండా ప్రేక్షకులలో తమలో నున్న  దుష్ట భావాలను ప్రచారము చేయడానికి ప్రయత్నము  చేస్తున్నారు.



No comments:

Post a Comment