రుచిర: కల కల రవముల
కదిలే ప్రకృతి,
కిల కిల
పలుకుల కులికే చిలుకలు,
పూర్ణిమ: ఏది వసంతము,
ఎక్కడ కోయిల?
నీ
ఊహలులే నిజము కావులే,
ఆకులు
రాల అడవులు సోలె,
చూత
వృక్షముల సొగదులు పోయె.
సుందరి: రవి కాననిచో
కవి కాంచును లే,
శిశిరము
వెనుక వసంతము రాదా?
మరు
మల్లెల గాలులు ముక్కులు సోక,
తెలియగ
లేదా వసంతు పిలుపు.
చక్కని ప్రకృతి సొగసుల చూచి,
చిక్కి పోయెనోయ్ వెన్నెల రేడు,
చైత్ర పున్నమికి వెన్నెల కళలను
పుంజుక ప్రకృతినే మురిపింప.
రుచిర: ఈ కాలి బాటను
చూచితివా? చెలి,
మరు మల్లెలు
ఈశుని అలంకరింపగ,
చేయి తాకితే సోలి పోయేటి
శిరీష పుష్పములిల
సోకినవి.
ఇవి పూచే
కాలము హేమంతమని,
ఛాయా నాథుడి
తీక్ష్ణత ఉండని,
మంచు సోకు
కాలము లోనే
పెంచినాడు
ఈశుడు వీటిని.
సుందరి:అంతేనా వాటికి
ఈశుని
అనుగ్రహమ్ము
లేనే లేదా?
భుజగ భూషణుడి
సిగ పాయలలో
ఆది మాత
కను సన్నలలో
అలరు సుఖమ్ము లేని
అలరులా,
నవ సుకుమాలు
శిరీష సుమాలు?
పూర్ణిమ: దరికి చేరని
సుమ రాణులను
తలచి
కుములు శిరీష సుమాలను
తననే తలచి, పూజించే, ఈ
గడ్డి
పూవును అనుగ్రహించాడు.
సుందరి: ఎవరు?
పూర్ణిమ:ఆర్తుల పలుకుల
వినే స్వామి, ఆ
పశునాథుడు,
ఈశుడు, సర్వేశ్వరుడు.
రుచిర: చెలి,
చూచావా,అటు చూచావా?
ప్రతి
చెట్టూ,ఎదిగి,
ఎదిగి,
ప్రతి
పుష్పము వికసించి,
ఈ ప్రకృతి
సొగసులకు
శ్రీ కారము చుట్టే నే.
ఈ సుమ
వసంత వీధిలో,
ఈ వని
వెల వెల పోయెను.
ప్రతి
పుష్పము పరిమళాల
పఱచే
గాలుల వడిలో
పఱవశించు నీ వేళల
కన రావే
కోయిలలు.
ఏదీ వసంత
మిచట?
సుందరి ఇదిగో నొక పర్ణ శాల
లేదే సుమ
వర్ణ మాల?
ఎవరో గృహస్థు ఇచట?
ఏమిటో ఈ వింత
కథ?
రుచిర: ప్రకృతి లాస్యము,
వైపరీత్యములు,
నుదుటి వ్రాతలు
తిరుగు లేనివి.
సుందర హర్మ్య నివాసము
కోరిన
సతి కోరికనీశుడు
తీర్చ గలిగెనా?
భూమండలమును ఏలిన
నలుడు,
శని బారికి ఎదురుగ
నిల్వ గలిగెనా?
విధాత ముద్దుల
సూతి అహల్య
విధి విలాసముకు
లొంగి పోయెను.
పూర్ణిమ:నే చెబుతా వినవే.
సురపతి
గౌతము రూపును దాల్చి,
సుర లోకపు
రీతుల భూమికి నడచి,
గౌతము
సతినే మోసగించెనే,
భూలోకపు
కట్టడినుటంకించెనే.
అనుమానించిన
పతిని కనుగొని,
తన దోసము
లేదని తెలుపుటం మాని,
సతి దాల్చెను
వెంటనె శిలా రూపము,
సరి స్థితికై
తాను ఎదురు చూచుచు.
ఎఱుపు దిరిగిన కన్నులతో తను
చూచిన గౌతము చూడ
జాలక
దేహమంతట కన్నులు
మొలిచే
సుర నాథుడి కంతట
వణకు పుట్టెను.
శిలా సదృశత చెందిన
సతి గని,
వగచెను యా ఋషి విధి గతికి,
తరలి వచ్చు శ్రీ
రామ చంద్రుడి
పద స్పర్శతో క్షితి
పులకింపగ
ఏల అహల్య వెలికి
రాదు అని,
వేరొక చోట్కి
వెళ్ళె ఋషి వరుడు.
No comments:
Post a Comment