Tuesday, March 13, 2018

ప్రస్థానము 4




ఈ లోపల కొత్తగా స్థాపించా బడే ఒక పరిశ్రమ విషయములో  సలహా కోసమని  ఒకరు వచ్చినారు. అందులో చాలా రసాయనాలు బయటికి పంప వలసి వస్తుంది. వాటిని ఎలా వదిలించుకుంటావని అడిగినాను.
“ఏముందీ పక్కనే యున్న ఏటిలో కలిపి వేస్తాను.”
“ఏటిలో నీరు ఎవరూ క్రింద జనాలు వాడుట లేదా?’
“అవన్నీ అనుకుంటే పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఈయ లేము?”
అతడి జవాబుకు నివ్వెర పోయినాను. ఒక్క విషయము మాత్రము అర్థమయింది. ప్రభుత్వాలు పరిశ్రమల ప్రతిపాదనలను బాల పరుస్తున్నాము. అందు వలన ఏంటో మందికి ఉద్యోగమూ, ఉపాధి దొరుకుతుందని చెప్పడము, ఈ మాటలన్నీ ఈ వచ్చిన వ్యక్తీ బుఱ్ఱకు బాగా ఎక్కినాయన్న మాట. లీటర్ నీళ్ళ సీసా పదిహేను రూపాయలకు అమ్ముతున్న పరిశ్రమలకు, కొన్ని లక్షల నీటిని త్రాగడానికి ఎవరధికారమిచ్చినారు?
ఒక్క సారి భరతుడు కౌసల్యకు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. “రాముడు  అరణ్యానికి వేల్లదములో నా పాత్ర యుంటే, త్రాగుతకనువయిన జలములను మురికి చేయు వానికి    పాపము వస్తుందో ఆ పాపము నాకు చుట్టుకుంటుంది.”
(పానీయ దూషకే పాపం  తదైవ  విషదాయకే   యత్తదేకః    లభతాంయస్యాs ర్యోs నుమతే  గతః”-అయోధ్య కాండ, వాల్మికి  రామాయణము )
మరొక్క సారి మనుషుల ప్రవర్తనను  గురించి ఆలోచించి బాధ పడినాను. ఇంకా ఇటువంటి విషయాలలో చేయ గలిగితే  చేయడము తప్ప బాధ పడకూడదని అనుకున్నాను.
ఆ రాత్రి తిరిగి తాతగారి దైనందిని ని చదువ సాగినాను.
పంటలు  వేసే ముందు  పంట కాలవలను  ఒక సారి త్రవ్వి  నీటి పారుదలకు అనువుగా చేయడము ఆనవాయితీ.  అందు కొరకు ఎకరానికి ఒక మనిషి వెళ్లి సమిష్టిగా త్రవ్వుకొనే వారు. మొదట్లో ఈ విధముగానే జరిగేది. పంచాయతీ నుండి ఒక ప్రతిపాదన వచ్చింది. ఎకరానికి కొంత సుంకము చెల్లిస్తే తామే కాలవలను త్రవ్వించి  వేస్తామని. అంటే  ఇంకా రైతులు  తమంత తాము కాలువలు త్రవ్వే  బాధ్యతలను  వదలి వేస్తున్నారని అర్థము. ఈ విధముగా రైతులకు పని తప్పినట్లు అనిపించా వచ్చును. మధ్యలో దళారీలు ప్రవేశిస్తారు. సగము పని చేసి డబ్బు తీసుకుంటారు. వ్యవస్థ పతనానికి ఇది మొదలు.
రేడియో లాటి ప్రసార సాధనాల ద్వారా  రసాయనిక ఎరువులు వాడితే పంటలు ఇబ్బడి ముబ్బడి గా పండించా వచ్చునని ప్రచారము మొదలు పెట్టినది. దీనిని పాత తరము వారు ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లో వంగ తోటలో సల్ఫేట్ ఎరువుగా వేసినారు. పిడికిలంతా వంగ కాయ తలంత సైజుకు ఎదిగింది. ఇంట్లో పచ్చడి చేద్దామని  కాలిస్తే నీరు కారి పోయి పిడికిలంతా మాత్రమె మిగిలింది. సల్ఫేట్ కాపు అంటే జనానికి అర్థమయింది.
ఇంకా వారి చాలా ఎత్తుకు ఎదిగేది.పంట రావడానికి నాలుగు నెలలకు పైనే పట్టేది.అందు వలన పశువుల మేతకు ఇబ్బడి ముబ్బడి గా గడ్డి వచ్చేది. ఇంకా గడ్డి మరీ ఎక్కువగా ఉంటే పాకాల మీద కప్పే వారు. గడ్డిని కొని వాటిని శుభ్రము  చేసి, ఒత్తిడితో అట్టలుగా మార్చే వారు. దీని వలన రైతుకు ఆదాయము పెరిగింది, కొంత మందికి ఉద్యోగాలు వచ్చినవి, వచ్చిన నష్టమేమిటంటే పశు  గ్రాసము తగ్గి పోయింది.
ఇంత వఱకు రైతులకు పొలాలు దైవ క్షేత్రాలు. అందుకనే ఆరోజుల్లో పొలాన్ని కూడా క్షేత్రము అని పిలిచే వారు. ఖాళీ సమయాల్లో రైతు పంటల మధ్య పైరును చూస్తూ నడిచే వాడు.అప్పుడు పంట పొలానికి రైతుకు మధ్య ఏంటో అనుబంధము కనిపించేది. ఇంటికి వస్తే పశువులు రైతుకోసము  ఎదురు చూస్తూ ఉండేవి. పశువులు కుటుంబ సభ్యులయితే పంట పొలాలు దివ్య క్షేత్రాలు. మంచి పంట పండాలని కోరుకొనే వాడు. కానీ ఎంత పండినా తృప్తి గా జీవించే వాడు.
శాకుంతలము లో కాళిదాసు వ్రాసినారు,శకుంతల కాలు తగిలితే పూల మొక్కలు త్వరగా వికసించే విట. దీనిని నమ్మ లేని వారికి, ఇటీవల  కాలములో  పరమ హంస యోగానంద యొక్క శిష్యుడు లూథర్ బర్బాంక్ చేసిన ప్రయోగాలు తప్పకుండా గమనించ  దగినవి. ఆయన ముళ్ళ  మొక్కలయిన కాక్టస్  మొక్కలకు వాటి రక్షణ గురించి భరోసా ఇచ్చి, అవి ముళ్ళు లేకుండా ఎదిగే టట్లు చేసినాడు. అంతే కాదు, వాల్నట్ మొక్కలలో వంద ఏండ్లలో వచ్చే ఎదుగుదలను పన్నెండు  సంవత్సరాలలో చూపించినాడు. ఆయన వేసిన ఎరువల్లా అపరిమితమయిన ప్రేమ.. అంటే మొక్కలతో మానసిక బంధము పెంచుకుంటే వాటిలో ఏడుగు డలను, రోగ నిరోధక శక్తిని పెంచ వచ్చునని నిరూపించినాడు.
క్రమముగా ప్రభుత్వమూ ప్రజల ఆకలి తీర్చుటకై ఎక్కువ పండే వంగడాలను తయారు చేయాలని సంకల్పించినది. అందుకని ప్రకృతిలో సహజముగా ఉన్న విత్తనాలపై ప్రయోగాలు చేయించింది వాటి కేంద్రకాలలో మార్పులు తీసుకొని వచ్చి సరి కొత్త విత్తనాలను ప్రయోగ శాలల నుండి బజారుకు తెప్పించింది.  అయితే ఇవి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడితే తప్ప ఎక్కువ పంటలను ఈయ లేవు. అందుకని రసాయనిక ఎరువులను వాడమని ప్రోత్సహించినది. దీని వలన దిగుబడి బాగా పెరిగింది. పంట పెరిగిందన్న సంతోషములో తను గోతిలో పడుతున్నానన్న విషయాన్ని రైతు గమనించ లేదు. ఇంట వఱకు రైతు విత్తనాలకు ఎరువులకు ఎవరి మీదా ఆధార పద లేదు. ఎక్కువ దిగుబడి  కోసము రైతులు విత్తనాలను కొనుటను  మొదలు పెట్టినాడు.
రసాయనిక ఎరువులు నెలలో శక్తిని కూడా పీల్చి వేస్తున్నాయి. గత సంవత్సరము వేసిన ఎరువులే వేస్తె పంట దిగుబడి తగ్గిపోతున్నది. అదే పంట రావాలంట్ఎరువులు ఎక్కువగా వెయ వలసి వస్తున్నది. ఎక్కువ ఎరువు వేసి పండించిన పంటలు క్రమముగా పురుగుల తాకిడికి గురి కా సాగినవి. పాత కాలములో ఇంతగా పురుగుల తాకిడి  ఉండేది కాదు. ఏ మాత్రమున్నా కాస్త వేప పిండి చల్లే వారు. దీనితే మొక్కలు పురుగు తాకిడికి తట్టుకో  గలిగేవి. ఈ విధముగా వేల సంవత్సరాలనుండి ప్రకృతి సహజముగా పరిణామము చెందినా పంటలు  క్రమముగా ప్రక్కకు పోయి, DNA  మార్పిడితో  ప్రతి క్షణము antibiotics  వేసి పిల్లలను పెంచినట్లు  పురుగు మందులు వేయ వలసి వస్తున్నది. పాత పద్ధతిలో నెలలో స్థిరముగా ఉన్న సారము , ఇప్పుడు బాగా తగ్గి పోతున్నది. అంటే గాక ఈ పంటలలో గడ్డి తగ్గి పశు గ్రాసము కు కొరత వచ్చినది.
ఈ విధముగా వస్తున్నా మార్పులను తాత గారు దైనందినులలో  వ్రాసుకుంటూ వచ్చినారు. ఇది దిన చర్య అనే కంటే వ్యాసాల సంపుతిలా అనిపించినది.
ఒక విషయము మాత్రము తెలుస్తున్నది. ఈ ప్రవాహములో  కొట్టుకొని పోకుండా ఆపుటకై  తాత గారు చాలా ప్రయత్నాలు చేసినట్లున్నది. కానీ ఆయనను ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఒక చాదస్తపు వ్యక్తిగా ఆయనను తోటి రైతులు పరిగణింఛినట్లున్నది.
ఆయన ఒక చిన్న రైతు.ఆర్థికముగా చెప్పుకో దాగిన వ్యక్తీ కాదు. అయినా ఊళ్ళో ఒక పోస్టు ఆఫీసు, ఒక ప్రాథమిక  పాఠశాల చాలా తిరిగి సాధించినాడు. అందుకే అందరి దగ్గిరా గౌరవమును పొందినాడు.
త్వరలోనే  ఆయన ఆలోచనా విధానానికి మరొక గట్టి దెబ్బ తగిలింది. హరిత విప్లవము (పంటలు) , శ్వేత విప్లవము(పాడి)తో బాతుకొట్ట ప్రభుత్వ విధానాలు నీలి విప్లవాన్ని ప్రోత్సహించినవి. ఇక అందరు వ్యవసాయము మాని వేసి చేపల చెరువులు త్రవ్వడము మొదలు పెట్టినారు.  పైనాం పురము కు తూర్పుగా ఉన్న ఖాళీ స్థలాలలో  చాలా రొయ్యల చెరువులు వచ్చినాయి. వాటికి బకింగ్ హాం కాలువ ద్వారా  సముద్రపు నీరు పారించినారు. దీని వలన రెండు చెడు ఫలితాలు వచ్చినాయి.
ఎక్కువ జీతాలు ఇస్తున్నందు వలన వ్యవసాయ కూలీలు చేపల చెరువులకు వెళ్ళడము మొదలు పెట్టినారు.ఈ ప్రభావము పీడా కమతాల వ్యవసాయము మీద పడినది.అప్పటికి వ్యసాయ పనులకు యంత్రాలు రాలేదు. అందు వలన వ్యవసాయపు పనులు దెబ్బ తిన్నవి.
వ్యవసాయపు పనులు దెబ్బ తినడముతో  పొలాలకు నీరు పెట్టడము ఆగి పోయింది. పొలాలలో నీరు భూమి క్రింద భాగములో తగులుతున్న  సముద్రపు నీటి ప్రభావాన్ని తగ్గించేవి. ఇప్పుడు ఆ నీరు లేక పోవడము, పెద్ద ఎత్తున చేపల చెరువులు వచ్చినందు వలన  ఊరిలో యున్న నీటి బావులలో నీరు క్రమముగా ఉప్పగా అయినవి. అందు వలన ఊళ్ళో  వాళ్లకు క్రమముగా నీటి ఇబ్బందులు మొదలయినాయి. ఈ సమయానికి తాత గారు దేహము వదిలి వేసినారు. ఆయన ఆలోచనలకు గుర్తుగా ఈ సంఘటనల వివరాలు  అన్నీ దైనందినులలో భద్ర పఱచ  బడినవి.
ఆ తరువాత ఏమి  జరిగినదీ గోపీ వివరాలు సేకరించినాడు. త్రాగే నీరు పాదయినది.చుట్టూ ప్రక్కల ఊళ్లలో ఎన్నో బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు నిర్మాణము జరిగినాయి. ఇందు వలన గాలిలో దుమ్ము, బొగ్గు పులుసు వాయువుల సాంద్రత పెరిగినవి.ఇంకా ఊళ్లు ఖాళీ చేసి నగరాలకు వెళ్ళే వారి సమాఖ్య పెరిగినది. పీడా వాళ్ళు, బాగా మొండి వాళ్ళు అక్కడే ఉంటున్నారు.
ఒకప్పుడు ఏంటో అందముగా ఉన్న ఊరు పాదయినది. తాత గారికి ఆ ఊరంటే ఎంత అభిమానమో అనిపించినది. ఆయన కూడా నైరాశ్యము లో వెళ్లి పోయినారు.
ఎందుకో ఒక్క సారి ఆ ఊరిని చూడాలని అనిపించినది. అమ్మా నాన్నలతో చెప్పినాను.నాన్న గారే ఆ ఊరికి వీల్లదము తగ్గించినాడు. ఆయనకు కూడా ఆ ఊరితో సంబంధము తెగి పోయినట్లు అనిపించినది.


No comments:

Post a Comment