Thursday, February 12, 2015

ఉడత 2

                       కావలి లో అన్ని కాలేజీల మధ్య ఒక డిబేట్ (చర్చా కార్య క్రమము)  ఏర్పాటు చేయ బడినది.దీనిని కొంత మంది ఔత్సాహిక జనము ఏర్పాటు చేసినారు. దీనికి విద్యార్థినీ, విద్యార్థులందరూ ఆహ్వానించ బడినారు.  “దేవతల  రాక్షసుల  యుద్ధాలలో ఎప్పుడూ రాక్షసులకే అన్యాయము జరుగుతున్నది” అనేది చర్చ విషయము. ఈ చర్చ చివరలో దళిత వాద సాహిత్యము లోనికి వెళ్ళవచ్చు, అని నిర్వాహకుల ఆశ. ఇటువంటి దానికి మధ్యవర్తిగా నుండుటకు పెద్ద వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ప్రిన్సిపాల్ అభ్యర్ధన మీద  ఆదిత్య మధ్యవర్తిగా ఉండడానికి అంగీకరించినాడు.
ఇందుకు ఆసక్తిగా ఆకాంక్ష కూడా వచ్చినది. మొదట జరిగిన వాద ప్రతివాదనలు ఆమెకు అంత ఆసక్తి కరముగా లేవు, సంతోషము కూడా కలిగించుట లేదు. జనము మధ్య అంతరాలు పెంచి చీల్చడానికి చేసే ప్రయత్నమూ మాదిరిగా అది అనిపించినది. గతములో ఆంగ్లేయులు ‘ఆర్యన్ దాడులు’ అనే పేరుతొ ఇటువంటి వివాదాన్నే సృష్టించినారు. ఆ ఉచ్చు నుండి ఇప్పటివరకు ఎవరూ బయట పడ లేదు.  దైత్యులనబడే రాక్షసులకు  నిరంతరాయముగా అన్యాయము జరగాబడినదని, అందు వలన వారు తిరగ బడితే దానిని ఒక కుట్రగా మన ప్రాచీనులు చిత్రీకరించారన్నది చర్చాంశము గా మారినది.
వాదనలన్నీ ముగిసినాయి. ఇంక మాడరేటర్ లేక మధ్య వర్తి పాత్ర మొదలయింది.  ఆదిత్య లేచి   “నేనేమీ ఉపన్యాసము ఇవ్వటము లేదు.  అద్దము మీద మరక బడితే ఏమి చేస్తారు?” , అని అడిగినాడు.

జవాబు వచ్చింది,”తుడిచి వేస్తాము.”
“గీత పడితే?”
“వేరే అద్దాన్ని పెట్టుకుంటాము.”
“భాషలో పదాలకు అర్థాలు మారి పొతే?”
“వాటిని సరి చేయాలి.”
“ఇప్పుడు మనము అదే పని చేయాలి”, అని ఆదిత్య అన్నాడు.
“దైత్యులంటే  ఎవరు?”
“రాక్షసులు “, అని అందరూ అన్నారు.
“అయితే రాక్షసులని అనకుండా దైత్యులని ఎందుకన్నారు?”
“ఎందుకంటే వారంతా దితికి పుట్టినారు కాబట్టి” కొద్ది మంది జవాబిచ్చినారు. చాలా మందికి ఈ విషయమే తెలియదు.
“దితి, అదితి అనే పదాలకు ప్రాచీన భాషలో ఎవరికయినా అర్థము తెలుసా? తెలిస్తే చెప్పండి.”, అడిగినాడు, ఆదిత్య. ఆకాంక్ష జవాబు చెప్పాలని చేతులేత్తింది కానీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.
“దితి పరిమితత్వానికి సంబంధించిన పదము.”
“అంటే?”
“అంటే, తను, తన కుటుంబము, తన సంపద, తన సుఖాలు,.......ఇంతకూ మించి ఏవీ లేవని, ఒక సారి తను చని బోతే ఇవన్నీ పోతాయని, తనూ చని పోతానని, అంతే కానీ,తన  జీవితమూ అనంత కాలము కోన సాగుతుందన్న  భావన అతడికి ఎవరు చెప్పినా అర్థము కాదు. ఎందుకంటే దానిని అనుభవము లోనికి తెచ్చుకోడానికి తను సిద్ధముగా లేదు.”
అక్కడున్న వారిలో ఈ ఆలోచన , ఈ భావన, అంటే తమకు అనంత కాలాన్నుండి జీవితమున్నదన్న మాట ఎవరికీ అర్థము కాలేదు. కొంత మంది సభా మర్యాద తెలియకుండా ధైర్యముగా అనేసినారు,” కథలు చెప్పకండి సార్!”
వెంటనే  ఆదిత్య అందుకున్నాడు.
“అబ్బే, ఇదసలు కథలు చెప్పే సమయము కాదు. నేను నిజమే చెబుతున్నాను. ఒక రావి గింజను తీసుకుందాము. దానిలో చెట్టు ఉంటుందా?”
“ఎందుకుంటుంది?నేల మీద పడి,నీరు తగిలితే మొలకెత్తుతుంది.”
“మరి ఆ గింజ ఎక్కడినుండి వచ్చింది?”
“చెట్టునుండి “
“మరి, ఆ చెట్టు...... ఇంక నేను  అడగను. కానీ, ఇది అనంతముగా జరుగుతూనే ఉన్నది. ఒక చెట్టుకే ఇంత పరంపర ఉంటే, మనము మనుషులము తక్కువ తిన్నామా ఏమిటి? మనకూ ఉండవా?
ఎవరూ నోరెత్తి మాట్లాడ లేదు.
“పరిమితత్వానికి  అలవాటు బడిన దితి పుత్రులు, అంటే దైత్యులు , అపరిమితత్వానికి అలవాటు బడిన ఆదిత్యులు  లాగా అన్నీ కావాలనుకున్నారు. అపరిమితత్వాన్ని అంగీకరించిన ఆదిత్యులు తమంతట తాము అన్నీ అందుకున్నారు. “
“”మాకు ఈ పరిమితత్వము, అపరిమితత్వములు ఆంటే అర్థము కాలేదు.”, ఒకరు అడిగినాడు.
“ఈ భౌతిక దేహమే పరమార్థమని, కళ్లకు కనిపించేది యథార్థమని, అంతకు మించి ఏమీ లేవని భావించుట పరిమితమవడాన్ని చూపిస్తుంది.”
“మరి అది నిజమే కదా!”
“అక్కడే నూతి లోని కప్పకు, సముద్రము లోని కప్పకు తేడా తెలిసే ది. ఇలా వెళితే సమస్య నుండి చాలా దూరము వెళ్ళాలి. ఒక చిన్న ఊరిని పాలించే వ్యక్తికి దేవుడు కనిపించి వరమిస్తానంటే ఏమని కోరుకుంటాడు?”
“చిన్న రాజ్యానికి రాజునూ కావాలనుకుంటాడు.”
“చిన్న  రాజ్యాన్ని పాలించే రాజు ఏమిటో కోరుకుంటాడు?”
“చక్రవర్తి కావాలనుకుంటాడు.”
ఇలా జవాబు లు వచ్చినా యి. చాలా మందికి ఈ ప్రశ్నలు ఏమిటో ,ఎందుకు అడుగుతున్నా రో, అర్థము కాలేదు. ఒకరో  ఇద్దరో జవాబిస్తున్నారు.
“చిన్న బొచ్చెతో బిచ్చము ఎత్తుకొనే బిచ్చగాడు ఏమని  కోరుకుంటాడు?”
ఎవరినుండీ ఏ జవాబు రాలేదు.  ఏమని జవాబు చెప్పాలో తెలియ లేదు.
“తనకు బిచ్చము ఎత్తుకోవడానికి పెద్ద బొచ్చె కావాలనుకుంటాడు. “, ఆదిత్యే జవాబిచ్చినాడు.
“ఒకరి మానసిక స్థాయిని బట్టి వారికి వసతులు , సంపదలు అందుతున్నాయన్న విషయము  చెప్పినా అందరికి అర్థము కాదు. ఇంక యుద్ధాలు ఎందుకో తెలుసా?”
ఎవరూ జవాబు చెప్ప లేదు.
“ఎదుటి వాడు నిరంతర సాధన తో సంపాదించిన దానిని వాడి నుండి కొట్టేయ వచ్సునన్న భావన. తమే  ఎందుకల్లా చేయ కూడదు అనుకొని ఉప క్రమించిన దైత్యులు ఆదిత్యులు అవుతారు. దేవ దానవ సంగ్రామము అంటే అపరిమితత్వానికి ,  పరిమితత్వానికి జరిగే నిరంతర పోరాటము. నాతొ అంగీకరించని వారు ప్రశ్నించ వచ్చును.”   ఆదిత్య ముగించినాడు. నిర్వాహకులు తమ వాదన ఇలా నిర్వీర్యము అవుతుందని అనుకోలేదు. ఈ చర్చ నడిపిన తీరు ఆదిత్య వాక్చాతుర్యము  ఆకాంక్షను కట్టి పడేసినట్లు అనిపించింది.
“మరి ఈ యుద్ధాల మధ్య అధికార దేహము, అహంకారము లేవంటారా?”
“దేవతలు అంటే ప్రకృతి శక్తులు. మనకు ఈ నాడు ప్రకృతి నుండి అన్నీ సమృద్ధిగా లభిస్తున్నాయి. మరి దానవులు అంటే అన్నీ తమకే కావాలనుకున్న వారు. ప్రకృతి నుండి తను అన్నీ తీసుకొని, తిరిగి ప్రకృతికి ఏమీ ఇవ్వని వారు మొదటి తరగతి దొంగలని కృష్ణుడు అర్జునుడికి యుద్ధ రంగములో చెప్పినాడు. కానీ ఇప్పటికీ మనము అదే పని చేస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నా యుద్ధాలన్నీ దేవతలా దానవుల మధ్య కంటే  పెద్ద దొంగల మధ్య జరుగుతున్న విగా చెప్ప వచ్చును. “
ఇంకా ఎవరూ మాట్లాడ లేక పోయినారు. 

No comments:

Post a Comment