పూరీ జగన్నాద్ గారు తమ అబ్బాయి నాయకుడిగా ఒక సినిమా తీసినాడు. దాని పేరు ఆంధ్రా పోరి. ఆంధ్రులలో పోరీ అనే పదము అసలు వాడరు. అది హిందీ , లేదా హైదరాబాదీ/ఉర్దూ పదము అయి ఉండాలి. విశేషమేమిటంటే ఆ పోరీ గా నటించినది ఆంధ్రా అమ్మాయి కాదు. ఆంధ్రా తెలంగాణా నాయకులు వైరుధ్యాలతో కొట్టుకుంటుంటే పరస్పర వైరుధ్యాలను తలపించే పేరు గల ఈ చిత్రము సామరస్యమిస్తున్దనుకున్నారేమో? లేదా ఆంధ్రా పూరీ అంటే బాగుందడనుకున్నారేమో?
` దీని మీద తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఎలాటి ఆసక్తి కలిగినట్లు లేదు. బహుశా కంఫ్యూజన్ లో ఉన్నాడేమో? లేదా తెలంగాణా పోరీ అనకుండా ఆంధ్రా పోరీ అన్నందుకు ఇక్కడ రిలీజ్ చేస్తాడా, నిర్మాత నాలుక కత్తిరించి వేస్తానని అంటారేమో అనుకున్నాము.
No comments:
Post a Comment