Wednesday, August 24, 2022

వాసు దాసు గారు.

 


ఈయన గుంటూరు జిల్లా కు చెందిన ఒక రామ భక్తుడు. ఒక యోగి. ఈయన మనుమడు (పేరు రామ ప్రసాదు గారు) భీమవరము ఒక కాలేజి లో పని చేసి పదవీ విరమణ చేసినాఋ. నాకు బాగా పరిచయమున్న వారు. ఈయన వాసు దాసు గారి జీవితములో కొన్ని సంఘటనలను నాకు చెప్పినారు. మన సమర్పణ భావముతో నే భగవంతుడు అంతా చూచు కొంటారని చెప్పటానికి ఇవి మంచి ఉదాహరణలు.

వాసు దాసు గారి పూర్తీ పేరు వావిల కొలను సుబ్బారావు గారు. వాల్మీకి రామాయణాన్ని యథా తథముగా తెలుగు లో మంథరము అన్న పేరుతొ పద్య కావ్యముగా వ్రాసినారు. ఈయనకు చాలా శిష్య బృందముంది. ఆశ్రమములో  రాముడి పేరు మీద ఎదో యొక కార్యక్రమము జరిగేది.

ఒక రోజు  వాసు దాసు గారు “రేపు రాముడి పేర సంతర్పణ జరగాలి రా.” అని యన్నాదుట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సరుకులు లేవు. అప్పటికప్పడు అనుకుంటే ఎలా జరుగుతుంది? ఆశ్రమములో అందరి బుర్రలలో ఇదే  ప్రశ్న. మర్నాడుదయాన్నేఆశ్రమము ముందు ఎడ్ల బండ్లు ఆగినాయిట.వాటి నిండా బియ్యము, పప్పులు, కూర గాయలు వచ్చినాయి.అప్పుదందరికీ అర్థమయింది, ఆయన మాటలకు అర్థము.

ఒక సారి ఆయనకు భద్రాచలము వెళ్ళాలనిపించి  తన శిష్యులతో చెప్పినారుట.వారు బాగా హడావిడి పడి పోతూ  ఇంటికి వెళ్లి డబ్బాల నిండా జన్తికలూ తిను బందారాలూ చేయించి ఆశ్రమానికి తీసుకొని వచ్చినారుట.  వాటిని చూచి వాసు దాసు గారు పగలబడి నవ్వినారుట. “అదేమిటి గురువు గారూ!” అంటే, “మనము వెళ్ళేది ఒక చక్రవర్తి దర్శనానికి. మన అవసరాలు ఆయన చూచు కోరా ఏమిటి? ఇంత కంగారెందుకు?” అంటూ చుట్టూ పక్కల పాకలలో ఉండే వారి పిల్లలను పిల్చుకొని రమ్మని చెప్పి వారి చేతుల మీదుగానే మొత్తము తిను బండారాలన్నీ అ పిల్లలకు పంపకము చేయించినారుట.

ఇంకా వారి భజన యాత్రలో దారిలో భోజన వేళకు ఎవరో ఒకరు వచ్చి ఇంటికి పిల్చుకొని వెళ్లి భోజనాలు పెట్టించే వారుట. అందుకే సమర్పణ భావమున్న చోట లోటుండదని చెబుతారు.

No comments:

Post a Comment