Monday, April 3, 2017

రెండు చిలుకలు 4



బాధలు కలిగినపుడు  కాలము  చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతి క్షణము గతములో గడిచిన క్షణాలు  గుర్తు వస్తు ఉంటాయి.  అందుకే చెబుతారు, ఎప్పుడూ  వర్తమానములో ఉండాలని. రమ్ము తండ్రి దూరమయినపుడు  ఏంటో బాధపడినాడు. సరోజ ఎంతగానో ఓదార్చి ధైర్యము చెప్పేది. కానీ తన ఎదురుగా కాకుండా ఒంటరిగా తనలో తను కన్నీళ్లు కార్చాదము గమనించినాడు.ది చూచి తనే ధైర్యము అందిపుచ్చుకున్నాడు.
రోజూ వాని చెప్పే కబుర్లు, రాణి చెప్పే ముద్దు మాటలు వర్తమానము లోనికి తమను తీసుకొని వస్తున్నాయి.పసి పిల్లలు అప్పుడప్పుడు తాతయ్యను గూర్చి అడుగుతూ ఉంటారు. అంతకంటే  వారికి ఏమీ తెలియదు. ఇంక శ్యామలమ్మకు మంచి కాలమే దూరమయినట్లు అనిపించినది. పిల్లల కోసము గాంభీర్యము నటిస్తూ ఉంది.
ప్రక్కనే యున్న ఇంటిలో ఒక కుటుంబము చేరింది. భర్త రామాలయములో పూజారి.  ఇద్దరూ పసి వయస్సు వాళ్ళే. ఆయన భార్య లలిత రామును “అన్నయ్యా!” యని పిలిచేది. శ్యామలమ్మకు వారి వలన కొంత కాలక్షేపము అయేది. పిల్లలు కూడా వారికి బాగా మాలిమి అయినారు.
ఒక సంవత్సరము తరువాత డిల్లీ నుండి తంతి/టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికి ఫోన్ల వాడకము నగరాల్లో తప్ప గ్రామాలకు ఇంకా ప్రాచుర్యము లోనికి రాలేదు. సరోజ తండ్రి గుండె పోటుతో  మరనిన్చినారుట.  రాముకు ఏమి చేయాలో తెలియ లేదు. అమ్మము ఒంటరిగా బడలి వెళ్ళడము ఇష్టము లేదు.
సరోజకు వెళ్ళాక తప్పని పరిస్థితి. శ్యామలమ్మే  రామూ ను పిలిచింది. మామ గారు పోయినపుడు నీవు తప్పకుండా వెళ్ళాలి. సరోజ, పిల్లలు తోడూ లేకుండా వెళితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.నీవు తప్పకుండా వెళ్ళాలి. అని. ఆమె ఆదేశాన్ని కాదనడము తనకు చేత కాదు. “అమ్మా! నీవు ఒంటరిగా ఎలా ఉంటావు?” అని యడిగితే ,”ఏముంది నాయనా! పక్కన లలిత తోడుంది కదా.  మీరు వెళ్లి  రండి. మీరు ఇద్దరూ వెళ్ళక పొతే  బాగుండదు.”అని ధైర్యము చెప్పింది.  రాము నెల్లూరి వెళ్లి డిల్లీ కి  రిజర్వేషన్  చేయించినాడు. నాలుగు రోజుల తరువాత  బెర్తు  దొరికినది.
ఇంత వఱకు రాము  అత్తా వారింటికి వెల్ల లేదు.  అక్కడకు  రాము వెల్లడము సరోజకు ఎందుకో ఇష్టము  లేదు. రెండు రోజులు ప్రయాణము చేసి డిల్లీ వెళ్ళినారు. రాము ఒకటి  లేదా రెండు రోజులు ఉంది వచ్చేద్దామని అనుకున్నాడు. ఎంత సేపూ ఒంటరిగా యున్న అమ్మే గుర్తుకు వస్తున్నది. సరోజ మాత్రము ఇద్దరమూ తిరిగి వెళదాము అని యన్నది. చివరకు పడవ రోజు కర్మకు వాళ్ళు అక్కడకు చేరినారు. దిగగానే ఇద్దరూ స్టేషన్  లోనే తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్  చేసుకొని ఇంటికి వెళ్ళినారు.
ఇంటికి చేరగానే సరోజ వాళ్ళ అమ్మ  వాళ్ళను పట్టుకొని ఏడ్చేసింది. కోడలు నందిని దగ్గిరకు వచ్చి పలకరించింది. నందింకి ఒక కొడుకు ఈ రెండు ఏళ్లలో పుట్టినాడు.
కార్యక్రమాలు అయి పోయినాయి. పన్నెండవ రోజు బయలు దేరాలి. ఈ రెండు రోజులు నందిని తన వెంట “ భయ్యా! భయ్యా!” అంటూ తన అవసరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమూ చేసింది.తను కూడా మాట్లాడటానికి , జవాబు ఇవ్వడానికి ప్రయత్నమూ చేసినాడు.ఇంతకూ ఎవరికీ ఏమి అర్థము అయిందో వారికే తెలియాలి.సరోజ మాత్రము తను ఉన్నప్పుడు దుబాసిగా పని చేసింది.
ఒక సారి సరోజ అన్నయ్య వయస్కుడు నేరుగా లోపలి వచ్చి,”కంగ్రాట్యలేషన్స్ “అంటూ సరోజకు షేక్ హాండ్  ఈయ బోయినాడు. “నమస్తే!” అంటూ సరోజ అక్కడనుండి లోపలి వెళ్లి పోయింది. పదకొండవ రోజు రాత్రి  నందిని వచ్చి సరోజకు ఏవేవో చెబుతున్నది. ఆమె  ముఖములో ఎదో బాధ కనిపిస్తూ ఉంది.  ఇక్కడేదో పొరపాటు జరుగుతున్నదని  రాము కు అనిపించినది.  రాత్రి పది గంటల తరువాత హాలు బయట ఉన్న గదులలో కాస్త హడావుడిగా ఉంది. అయిదు నిముషాల తరువాత  సరోజ అన్నయ్య హడావుడిగా  లోపలి వచ్చి, “ రండి బావగారూ! కార్యక్రమాలు అయి పోయినాయి కదా. అందరం పార్టీ చేసుకుందాము .” అంటూ చేయి పట్టుకున్నాడు.
మర్యాద కోసము రాము లెవ పొతే, సరోజ, “ఉండరా అన్నయ్యా! రేపు ప్రయాణము. ఇందాకే నిద్ర వస్తున్నదన్నారు. బావగారు. ఆయన రారు.” అంటూ ఖచ్చితముగా చెప్పేసింది. “అమ్మయ్య నన్ను రక్షించినావు.” అనుకుంటూ, “సారీ “ చెబుతూ వెంటనే కూర్చున్నారు. సరోజ అన్నయ్య నిరాశ గా వెళ్లి పోయినాడు.
రాము కు ఇవేమీ అర్థము కాలేదు. తను ఇటువంటి కల్చర్ ను నిజానికి చూడ లేదు. ఉండ బట్ట లేక అడిగినాడు.”అత్తయ్య గారూ! ఏమిటిదంతా?” అని.
దగ్గిరకు పిలిచింది. “ఇదంతా మా కర్మ నాయనా!” అని చెప్పింది.
“సరోజా! ఇంకా ఏదీ దాచ వలసిన అవసరము లేదు. అల్లుడి గారికి ఇవి అంటా తెలియ వలసిందే.” అని యన్నది. సరోజ ముఖము కాస్త మ్లానమయింది.
“అల్లుడు గారూ! మా మొదటి సంతానము ఈ రఘు. కాస్త గారాబము , నా నుంచి కాదు, వాళ్ళ నాన్న నుండి ఎక్కువయింది. అదే ఆయన చేసిన పొరపాటు. దర్జాగా ఖర్చు పెట్టడము తో మొదలయింది. అంతటితో ఆగ లేదు. నందినిని పెళ్లి చేసుకుంటానని తనే ఇంటికి తీసుకొని వచ్చినాడు.పెళ్ళయిన తరువాత అయినా బాధ్యతా తెలుస్తుందని అనుకున్నాము. నందిని తండ్రి ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు.లోఅము గూర్చి ఎక్కువ తెలియదు. అందుకని మేమే పూనుకొని పెళ్లి చేసినాము. తరువాత ఎదో ప్రైవేట్ కంపెనీ లో అక్కౌంతంట్ గా చేరినాడు. కొన్నాళ్ళు కుదురుగా ఉన్నాడు.
అప్పుడే రాహుల్ అని ఆ కంపెనీ లో పని చేసే వ్యక్తితో స్నేహము కుదిరింది. కుదరడమే  కాదు, బాగా ముదిరి పోయింది. ఇద్దరూ కలిసి బార్లూ, పార్టీలు, ఇదే వినోదము. ఇంకా నందిని మా దగ్గిరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొనేది. మేము ఎంతగా చెప్పి చూసినా నాలుగు రోజులు మాత్రమే ప్రయోజనము కనిపించేది. మళ్ళీ మామూలే.
సరోజకు ఈ పరిస్థితి ఏమీ అర్థము అయేది కాదు. అన్నయ్య పరిస్థితి చూచి నలిగి పోయేది.
సరోజకు డిగ్రీ పరీక్షలు అయి పోయినాయి. ఒక రోజు రాహుల్ నేరుగా లోపలి వచ్చినాడు.” ఆంటీ నేను సరోజను పెళ్లి చేసుకుంటాను.” అని అన్నాడు. ఇలా నేరుగా నాతొ ప్రస్తావించడము చూచి నేను ఖంగు తిన్నాను. ఈ త్రాగు బోటు దృష్టి ఇలా మళ్ళిందా అని కంగారు పడినాను. వెంటనే గట్టిగా కేకలు వేసి బయటకు పంపించినాను.
మరునాడు మా అబ్బాయే  అదే ప్రతిపాదనతో నా దగ్గిరకు వచ్చినాడు.” రాహుల్ ది  కోటీశ్వరుల కుటుంబము. వాడి కేమి తక్కువ.”అంటూ వాదించడము మొదలు పెట్టినాడు. వాళ్ళ గట్టిగా కేకలు వేస్తే కాస్త తగ్గి మళ్ళీ మొదలు పెట్టే వాడు. ఇంకా సరోజ ఎప్పుడు బజారులో కనిపించినా  రాహుల్ కల్పించుకొని పలకరించే వాడు.
ఇంకా సరోజ బయటకు వెళ్ళడము తగ్గించి వేసింది. ప్రతి క్షణము  ఏమి ముంచుకొని వస్తుందో అని భయ పాడేది. ఆ భయము లోనే చాలా ధైర్యము చూపించేది.
నేను ఎప్పుడూ శివుడిని వేడుకొనే దానిని, కొడుకు జీవితాన్ని  బాగు చేయమని. అదీ వాడి మీద ప్రేమ అనే దాని కంటే  అమాయకురాలు  అయిన నా కోడలి మీద జాలితో. నందిని శుద్ధ శ్రోత్రియ  పేద బ్రాహ్మణుడు. తను ఈ విష వలయము లోనికి ఎలా వచ్చిందో అర్థము కాలేదు.ఇంకా సరోజ జీవితాన్ని పాడు కాకుండా చేయమని రోజూ  జగన్మాతను ప్రార్థించుట  మొదలు పెట్టినాను. ఇంకా నిద్రలో కూడా అదే ధోరణిలో ఉండే దాన్ని.
ఎప్పుడూ భయముతో గడుపుతున్న సరోజకు కాస్త గాలి మార్పు వస్తుందని  తీర్థ యాత్రలకు వెల్లినాము.  హరిద్వార్ లో గంగా నదీ తీరాన నడుస్తున్నాము. ఇంతలో ఒక సాధువు ఎదురు వచ్చినాడు. “ మాజీ! థోడీ దక్షిణా దీజియే” అంటూ చేయి జాపినాడు.  సరోజ నాన్నగారు, జేబు లోంచి పది రూపాయలను తీసి ఇచ్చినాడు. ఇంకా ఆ సాధువు హిందీ లోనే చెప్పినాడు.”అమ్మా! మీ మనసులో ఏముందో నాకు తెలుసు. అమ్మనే నమ్ముకున్నావు.ఆమె చూచుకోవాలి.”
“ఇప్పుడు నేనేమి చేయాలి?”
“ అమ్మా! ప్రమాదము ముంచుకొని వస్తున్నది. బలవంతముగా పెళ్లి జరగాలని ప్రణాలికలు చేస్తున్నారు. వెంటనే తిరుపతికి వెళ్ళిపో. అక్కడే చదువు పూర్తీ చేయమను.అక్కడా ఒక్క దాన్నీ ఉంచ వద్దు. నీవు కూడా వెళ్ళు.”
“మరి అమ్మాయి పెళ్లి?”
“ మీ కాబోయే అల్లుడు అక్కడే కలుస్తాడు.నాటకమంతా అమ్మే ఆడుతుంది. మీ కాబోయే అల్లుడు అమాయకముగా అనిపిస్తాడు. కానీ వజ్రము లాటి వాడు. వెంటనే.. వెంటనే.. శ్రీ మాత్రే నమః  “ అంటూ జనములో కలిసి పోయినాడు. ఎంత వెదికినా మళ్ళీ కనిపించ లేదు.
తిరిగి వెంటనే డిల్లీ వచ్చినాము. అప్పటికి సరోజ డిగ్రీ పరీక్ష ఫలితాలు వచ్చినాయి. వెంటనే సర్టిఫికెట్లు అన్నీ తీసుకున్నాము. సరోజను ఎక్కడికీ పంపించకుండా ఇంట్లోనే ఉంచినాము. అప్పుడే తిరుపట్ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయము ప్రవేశాలను ప్రకటించినారు. ఇంటిని నందినికి అప్ప చెప్పేసి మేము తిరుపతికి వచ్చేసినాము. ఆ తరువాత అంటా తెల్సిందే.
అల్లుడు గారూ! మిమ్ములను చూడగానే సరోజకు మీరు  బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించినారు. ఇది ఈ నాటి పిచ్చి ప్రేమతో కూడిన వ్యామోహము కాదు. ఒక్కొక్క రజు వచ్చి చెప్పేది.” అమ్మా! ఆయన నాకు ఏంటో కాలము నుండి తెలిసిన వాడని అనిపిస్తుంది” యని. మళ్ళీ ఇటువంటి వన్నీ తన భ్రమ ఏమో యని కంగారు పడేది. “ తను సరి అయిన దారిలో వేలుతున్నానా? తప్పు చేస్తున్నానా? “ యని ఆలోచించేది. అయితే మొదటి ప్రాధాన్యము మీ చదువు మరియు తన చదువు. అవి పాడవ కూడదు. తన ఇష్ట దైవము కృష్ణ పరమాత్మ తో బాటు అమ్మ వారికి కూడా పూజ చేసేది.
ఇంకా మీకు డిగ్రీ అయి ఊరు వదిలి వెళ్ళిన తరువాత తన మనస్సు మనస్సు లో లేదు. ఎన్నో అనుమానాలతో భయాలతో మీ ఊరు వచ్చింది. తను ఏంటో సంతోషముతో  తిరిగి వచ్చింది.తన ముఖములో అంట సంతోషాన్ని చాలా కాలము తరువాత చూచినాను.
“అమ్మా! ఆ ఊరు ఎంత బాగుందమ్మా.” ఒక సారి యనెడి.” రాము అమ్మగారు ఎంత మంచి వారమ్మా!ఆమె లాగా ఇంకెవరయిన పరాయి అమ్మాయిని అంట తొందరగా నమ్మి లోపలి రానిస్తారా?”యని అడిగింది.
“వాళ్ళ నాన్నగారి ముఖములో ఎంత వెలుగు ఉందమ్మా! ఒక జ్ఞానిలా కనిపించినాడు.” అని ఒక  సారి చెప్పింది.
“ఒంటరిగా ఇలా ప్రయాణము చేసినావు భయము లేదా?” అడిగితె,” నీ పూజలే నన్ను కాపాడుతున్నాయి కదమ్మా!” అని యన్నది.
“అల్లుడు గారూ! ఇదీ మా కథ. సరోజకు అందుకే డిల్లీకి రావటము కూడా ఇష్టము లేదు. ఇంక తన నాన్నగారు పోయిన తరువాత  తప్ప లేదు.” కళ్ళ నీళ్ళు తుడుచుకున్నది.
పిల్లలు అలసి నిద్ర పోయినారు. సరోజ “అమ్మ చెప్పింది విన్నారు కదా. ఇంత కాలము ఈ విషయాలన్నీ మీ దగ్గిర దాచినాను. అదీ మీరెక్కడ దూరమవుతారో అన్న భయంతో . నన్ను క్షమించండి” అని కాళ్ళు పట్టుకున్నది.
“ లేదు సరోజా! వాటితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎప్పటికీ నీవు నా పాత సరోజవే.”అని దగ్గిరకు తీసుకున్నాడు.
మర్నాడు తిరిగి ప్రయాణమయినారు.
(To be continued)


No comments:

Post a Comment